మీ ఫోన్‌కి వైర్‌లెస్ ఛార్జింగ్ పెడితే ఎలా ఉంటుంది, ఈ గాడ్జెట్ మీకోసం

ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ కామన్‌ అయిపోయింది. పవర్ బ్యాంక్ అంటే మొబైల్ చార్జర్.

|

ఈ రోజుల్లో ఎక్కడికెళ్లినా చేతిలో మొబైల్, బ్యాగ్‌లో పవర్ బ్యాంక్ కామన్‌ అయిపోయింది. పవర్ బ్యాంక్ అంటే మొబైల్ చార్జర్. ఇన్‌స్టంట్ చార్జర్ అన్నమాట. తరచుగా ప్రయాణాలు చేసే వారు, ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించేవారి వద్ద పవర్‌ బ్యాంక్‌ తప్పక ఉండి తీరాల్సిందే. అయితే ఒక్కోసారి కేబుల్ మరచిపోయినప్పుడు పవర్ బ్యాంకు ఉన్న పెద్ద ప్రయోజనం ఉండదు. ఆ సమయంలో ఫోన్ ని నేలకు విసిరేసి కొట్టాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా కొత్త పవర్ బ్యాంక్ వచ్చేసింది. ఎటువంటి కేబుల్స్ అవసరం లేకుండా మీ ఫోన్ ని ఈ పవర్ బ్యాంకుకి కనెక్ట్ చేసి వైర్‌లెస్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు.

పబ్‌జీ యూజర్లకు ఇది నిజంగా చేదు వార్తే, తల్లిదండ్రులకు శుభవార్త

వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంక్‌

వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంక్‌

పవర్‌ బ్యాంక్‌ల తయారీలో పేరుపొందిన యాంబ్రేన్‌ ఇప్పుడు లేటెస్ట్‌గా రెండు మోడళ్ల వైర్‌లెస్‌ పవర్‌ బ్యాంక్‌లను భారత్‌లో విడుదల చేసింది. అంటే.. ఎటువంటి కేబుల్‌ లేకుండానే మొబైళ్లకు ఈ పవర్‌ బ్యాంక్‌లను కనెక్ట్‌ చేయవచ్చు.

10000 ఎంఏహెచ్‌ సామర్థ్యం

10000 ఎంఏహెచ్‌ సామర్థ్యం

10000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల ఈ పవర్‌ బ్యాంక్‌లు గరిష్టంగా 500 పవర్‌ సైకిళ్లను సపోర్ట్‌ చేస్తాయి. వీటికి మూడు ఛార్జింగ్‌ పోర్ట్‌లుంటాయి. అందులో రెండు సాధారణ యూఎస్‌బీ పోర్ట్‌లు. ఒకటి టైప్‌ సి యూఎస్‌బీ పోర్ట్‌. పవర్‌ ఇండికేటర్‌ కూడా ఉంది.

 

 

ధర

ధర

ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న ఫోన్లకు పవర్‌ ఇండికేటర్‌ సదుపాయం లేకపోతే సాధారణ కేబుల్‌ ద్వారా కూడా ఛార్జ్‌ చేసుకోవచ్చు. పీడబ్ల్యూ-11 మోడల్‌ పవర్‌ బ్యాంక్‌ రూ.1999కు, పీడబ్ల్యూ-20 మోడల్‌ పవర్‌ బ్యాంక్‌ రూ.1899కు లభిస్తున్నాయి.

అన్ని ఫోన్లకు

అన్ని ఫోన్లకు

ఈ పవర్ బ్యాంకు అన్ని రకాల ఫోన్లకు పనిచేస్తుంది. ఛార్జింగ్ ఎక్కువగా వచ్చే ఫోన్లకు సవాల్ విసురుతూ దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చామని కంపెనీ చెబుతోంది. iPhone X, iPhone 8 Plus, Galaxy Note 5, S6, S7, S8+, S9, S9+, ఇంకా ఇతర బ్రాండెడ్ ఫోన్లకు దీన్ని వాడుకోవచ్చు. ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Ambrane PW-11 Power Bank review: Say goodbye to wires, charge your phone efficiently on-the-go more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X