Home
Gadgets

తక్కువ కరెంటుతో ఎక్కువ చల్లదనం.. 2025లో ఇండియాలో బెస్ట్ AI ఏసీలు ఇవే!

Best AI ACs 2025: ఇప్పుడు ఏసీలు కూడా స్మార్ట్ అయిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో, నేటి ఏసీలు కేవలం గదిని చల్లబరచడం మాత్రమే కాదు, చాలా ఎక్కువ చేస్తాయి. ఇవి కరెంట్ బిల్లు తగ్గించేలా పవర్ వాడకాన్ని ఆటోమేటిక్‌గా తగ్గిస్తాయి, మీ అలవాట్లను గుర్తుపెట్టుకుంటాయి, ఇంకా యాప్ ద్వారా మీ ఫోన్ నుంచే కంట్రోల్ చేయొచ్చు.

అంతేకాదు, గదిలో టెంపరేచర్ ఎలా ఉందో చూసి, ఎంతమంది ఉన్నారో కనిపెట్టి, వాటికి తగ్గట్టు టెంపరేచర్ సెట్ చేసుకుంటాయి. ఏసీకి ఎప్పుడు సర్వీసింగ్ చేయాలో కూడా ముందే చెబుతాయి.2025లో మీరు ఒక AI ఏసీ కొనాలని చూస్తుంటే, ఈ మోడల్స్ మాత్రం తప్పకుండా చూడాల్సిందే.

Best AI ACs for India in 2025 Upgrade to Smart Cooling

* LG 5 స్టార్ స్ప్లిట్ ఏసీ విత్ AI కన్వర్టబుల్ 6-ఇన్-1 కూలింగ్

ఎల్జీ ఏసీలు అంటేనే నమ్మకం. ఈ ఏసీ ఏకంగా 6 మోడ్స్‌లో పనిచేస్తుంది. గదిలో వేడిని బట్టి కూలింగ్ పవర్‌ని ఆటోమేటిక్‌గా మారుస్తుంది. దీంతో కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. ఎల్జీ AI డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీతో చాలా త్వరగా చల్లబడుతుంది, కానీ కరెంటు మాత్రం చాలా తక్కువగా లాగుతుంది.

"ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్" కోటింగ్ ఉండటం వల్ల ఏసీ పాడవకుండా ఎక్కువ కాలం వస్తుంది. LG థింక్Q యాప్ ఉంటే ఫోన్ నుంచే ఏసీని కంట్రోల్ చేయొచ్చు, ఎంత కరెంట్ వాడుతున్నారో చూడొచ్చు, ఏమైనా సమస్య ఉంటే స్మార్ట్ డయాగ్నోసిస్‌తో తెలుసుకోవచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మాటలతోనే ఏసీని ఆపరేట్ చేయొచ్చు.

* శాంసంగ్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ, AR50F24D1XH:

శాంసంగ్ అంటే టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్. ఈ ఏసీలో AI ఆటో కూలింగ్ ఫీచర్ ఉంది. ఇది మీ కూలింగ్ అలవాట్లను గుర్తుపెట్టుకుని, మీకు నచ్చినట్టుగా రూమ్ టెంపరేచర్‌ని సెట్ చేస్తుంది. "విండ్‌ఫ్రీ" మోడ్ గాలిని డైరెక్ట్‌గా మొహం మీద కొట్టకుండా, చిన్న హోల్స్ ద్వారా మెల్లగా చల్లదనాన్ని ఇస్తుంది.

స్మార్ట్‌థింగ్స్ యాప్ ద్వారా ఏసీని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు, టైమర్ పెట్టుకోవచ్చు, సర్వీసింగ్ అలర్ట్స్ కూడా వస్తాయి. డిజిటల్ ఇన్వర్టర్ బూస్ట్ టెక్నాలజీతో కరెంటు వాడకం చాలా తక్కువగా ఉంటుంది. ఏసీల కారణంగా కరెంటు బిల్లు తడిసి మోపిడుగుతుందని భయపడే వారికి ఇది బెస్ట్.

*:హైయర్ 1.6 టన్ 5 స్టార్ ఇంటెల్లీ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ:

హైయర్ ఏసీలు కూలింగ్‌కి పేరుగాంచాయి. ఈ ఇంటెల్లీ స్మార్ట్ స్ప్లిట్ ఏసీలో AI టెక్నాలజీతో కూడిన ట్రిపుల్ ఇన్వర్టర్ ఉంది. ఇది గదిని క్షణాల్లో చల్లబరుస్తుంది, కానీ కరెంటు బిల్లు మాత్రం మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. "కినౌచి హెవీ-డ్యూటీ" డిజైన్ తో ఏసీ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది,

అంతేకాదు, ఎక్కువ కాలం పనిచేస్తుంది. హైయర్ స్మార్ట్ ఏసీ యాప్ ద్వారా కూలింగ్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు, కరెంట్ ఎంత వాడుతున్నారో చెక్ చేసుకోవచ్చు, ఇంకా సర్వీసింగ్ అలర్ట్స్ కూడా వస్తాయి. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కంట్రోల్ కూడా సపోర్ట్ చేస్తుంది.

* బ్లూ స్టార్ 1 టన్ 5 స్టార్ వై-ఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీ:

బ్లూ స్టార్ ఏసీలు మన దేశంలో చాలా పాపులర్. ఈ 1 టన్ వై-ఫై ఇన్వర్టర్ ఏసీ సైజులో చిన్నగా ఉన్నా, చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. AI ప్రో మోడ్ గదిలో ఎంత మంది ఉన్నారో, గాలిలో తేమ ఎంత ఉందో, టెంపరేచర్ ఎంత ఉందో కనిపెట్టి కూలింగ్‌ను ఆటోమేటిక్‌గా సెట్ చేస్తుంది.

స్మార్ట్ ఏసీ యాప్ ద్వారా మీరు ఎక్కడి నుంచైనా ఏసీని కంట్రోల్ చేయొచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్‌తో కూడా పనిచేస్తుంది. అంటే మాటలతోనే ఏసీని నియంత్రించవచ్చు. అలాగే 5-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ సిస్టమ్ తో కరెంట్ ఆదా చేయడం చాలా సులభం.

* పానాసోనిక్ 1.5 టన్ స్మార్ట్ వై-ఫై ఇన్వర్టర్ ఏసీ:

పానాసోనిక్ అంటే క్వాలిటీకి మారుపేరు. ఈ స్మార్ట్ వై-ఫై ఏసీ "ట్రూ AI మోడ్"తో వస్తుంది. ఇది మీ కూలింగ్ ప్రాధాన్యతలను నేర్చుకుని, మీకు సౌకర్యంగా ఉండటానికి, కరెంట్ ఆదా చేయడానికి ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. 7-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ ఫీచర్ తో గది సైజు, ఎంత మంది ఉన్నారో దాన్ని బట్టి కూలింగ్ కెపాసిటీని మార్చుకోవచ్చు.

MirAIe యాప్ ద్వారా రిమోట్ కంట్రోల్, టెంపరేచర్ అడ్జస్ట్‌మెంట్, కరెంట్ వాడకం చూడొచ్చు. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ తో వాయిస్ కంట్రోల్ కూడా ఉంది. ఈ AI ఏసీలు అన్నీ అడ్వాన్స్‌డ్ కూలింగ్, కరెంట్ సేవింగ్స్, స్మార్ట్ కంట్రోల్స్‌తో వస్తున్నాయి. 2025లో మీ ఇంటి కోసం బెస్ట్ ఏసీ కొనాలంటే, ఇవి మంచి ఆప్షన్లు.

More from GizBot

Best Mobiles in India

English summary
India's 2025 AI ACs offer smart cooling, energy savings, and app control. Top brands like LG, Samsung, Haier, Panasonic, Blue Star provide efficient, feature-rich models for homes.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X