Home
Gadgets

దేవుడా.. ఇయర్‌బడ్స్ మీ మెదడును ఇంతలా నాశనం చేస్తున్నాయా? ఇప్పుడే ఆ నిజాలేంటో తెలుసుకోండి..!

Bluetooth Earbuds: ఇటీవల సోషల్ మీడియాలో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ సంబంధించి కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవి మైక్రోవేవ్ ఓవెన్ లాంటి ప్రమాదకరమైన రేడియేషన్‌ను విడుదల చేస్తాయని, అవి మెదడును పాడు చేస్తాయనేది ఆ వైరల్ పోస్టుల సారాంశం. ఇంకేముంది చాలామంది భయపడిపోయి ఇయర్‌బడ్స్‌ను పారేయమని సలహాలు కూడా ఇస్తున్నారు. కానీ, ఇందులో నిజం లేదు.

సైంటిఫిక్ పరిశోధనలు, నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్లూటూత్ ఇయర్‌బడ్స్ (Bluetooth earbuds) విడుదల చేసే రేడియేషన్ (Radiation) మన ఆరోగ్యానికి ఏమాత్రం ప్రమాదకరం కాదు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. అలాగే ఇయర్‌బడ్స్‌ను సురక్షితంగా ఎలా వాడాలో చాలా వివరంగా తెలుసుకుందాం.

Bluetooth Earbuds Are Safe

* బ్లూటూత్ ఇయర్‌బడ్స్ రేడియేషన్
బ్లూటూత్ ఇయర్‌బడ్స్ మీ ఫోన్, టాబ్లెట్ లాంటి వాటితో వైర్‌లెస్‌గా కనెక్ట్ అవ్వడానికి 2.4 GHz ISM బ్యాండ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ (RF) సిగ్నల్స్‌ను వాడతాయి. ఈ రకమైన రేడియేషన్‌ను ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ (EMF) అంటారు. ఇది నాన్-అయోనైజింగ్ రకం. అంటే దీనికి DNAను లేదా కణాలను పాడు చేసేంత శక్తి ఉండదు.

మరోవైపు మైక్రోవేవ్ ఓవెన్లు, ఎక్స్-రేలు అయోనైజింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఈ తరహా రేడియేషన్‌ కణాలను దెబ్బతీస్తుంది, తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. అందుకే బ్లూటూత్ రేడియేషన్‌ను మైక్రోవేవ్ రేడియేషన్‌తో పోల్చడం తప్పు, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది.

* రేడియేషన్ మన చుట్టూనే ఉంది..
ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలు కొత్తేమీ కాదు, సూర్యుడు కూడా వాటికి ఒక పెద్ద మూలం. వైఫై రూటర్లు, సెల్ ఫోన్లు, పవర్ లైన్లు, MRI స్కానింగ్ మెషీన్లు.. ఇలా మనం రోజు వాడే చాలా వస్తువులు నాన్-అయోనైజింగ్ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. అయినా భయపడాల్సిన అవసరం లేదు.

Take a Poll

ఎందుకంటే ఈ వస్తువుల నుంచి వచ్చే తక్కువ-స్థాయి EMF రేడియేషన్ విడుదలవుతుంది. ఇది సాధారణంగా సురక్షితమని శాస్త్రీయ అధ్యయనాలు (సైంటిఫిక్ స్టడీస్) చెబుతున్నాయి. ఇంకా చెప్పాలంటే, రేడియేషన్ దూరం పెరిగే కొద్దీ దాని ప్రభావం కూడా తగ్గిపోతుంది. అందుకే పెద్దగా రిస్క్ ఉండదు.

* బ్లూటూత్‌తో క్యాన్సర్ ముప్పు?
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ను "బహుశా క్యాన్సర్ కారకం" అని వర్గీకరించాయి. కానీ దీనర్థం బ్లూటూత్ ఇయర్‌బడ్స్ క్యాన్సర్‌ను కలిగిస్తాయని కాదు. దీనిపై ఇంకా ఎక్కువ పరిశోధనలు జరగాలని దీని ఉద్దేశం.

* ఇయర్‌బడ్స్‌ను సురక్షితంగా ఎలా వాడాలి..
బ్లూటూత్ ఇయర్‌బడ్స్ ప్రమాదకరమైనవి కానప్పటికీ, వాటిని బాధ్యతగా వాడటం మంచిది. ఎక్కువ సౌండ్‌తో లేదా ఎక్కువసేపు పాటలు వింటే మీ వినికిడి శక్తి దెబ్బతినే అవకాశం ఉంది. మీ చెవులను కాపాడుకోవడానికి 60/60 రూల్‌ను పాటించండి, అంటే వాల్యూమ్‌ను 60% కంటే తక్కువగా ఉంచండి, ఒకేసారి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు వాడకండి.

* నిజం ఇది: ఇయర్‌బడ్స్ ప్రమాదకరం కాదు..
ప్రస్తుతానికి బ్లూటూత్ రేడియేషన్‌కు, మెదడు క్యాన్సర్‌కు లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే బ్లూటూత్ ఇయర్‌బడ్స్ హానికరమైన రేడియేషన్‌ను విడుదల చేస్తాయనే వాదనలు అబద్ధం.

అవి విడుదల చేసే రేడియేషన్ నాన్-అయోనైజింగ్ రకం, మైక్రోవేవ్ ఓవెన్ల ప్రమాదకరమైన అయోనైజింగ్ రేడియేషన్ లాంటిది కాదు. నిపుణులు, ఫాక్ట్-చెక్ చేసే సంస్థలు బ్లూటూత్ ఇయర్‌బడ్స్ సురక్షితమని ధృవీకరించారు. కాబట్టి హాయిగా మీ ఇయర్‌బడ్స్‌ను వాడండి, కానీ మరీ ఎక్కువ సౌండ్ పెట్టుకోకుండా జాగ్రత్త పడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Bluetooth Earbuds Are Safe, No Need to Fear Radiation
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X