రియల్‌మీ నుంచి ఎయిర్ 7, T200 లైట్ ఇయర్‌బడ్స్ లాంచ్.. 52dB ANC, 52గంటల బ్యాటరీ, ధర కేవలం రూ.1199..
Realme Buds Air 7, Buds T200 Lite: రియల్‌మీ కంపెనీ ఇండియాలో రెండు కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ని రిలీజ్ చేసింది. అవే రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7, ఇంకా రియల్‌మీ బడ్స్ T200 లైట్. ఈ రెండు మోడల్స్‌లోనూ చాలా ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి, బ్యాటరీ లైఫ్ కూడా చాలా ఎక్కువ, చూడటానికి కూడా స్టైలిష్‌గా ఉన్నాయి. మ్యూజిక్ ప్రియులకు ఇవి బాగా నచ్చుతాయి. వీటి ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
* రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 ఫీచర్లు
రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7లో 52dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్ ఉంది. అంటే బయట సౌండ్ వినిపించకుండా మ్యూజిక్ ఆస్వాదించొచ్చు. దీని కోసం ఇందులో ఆరు మైక్రోఫోన్లు పెట్టారు. 12.4mm డ్రైవర్లు ఉండటం వల్ల బేస్ అదిరిపోతుంది, 360° స్పేషియల్ ఆడియోతో సినిమా చూస్తున్నా, పాటలు వింటున్నా బాగా అనిపిస్తుంది.

* చాలా దృఢంగా ఉంటాయి
వర్కౌట్స్ చేసేటప్పుడు, బయట తిరిగేటప్పుడు చెమట పట్టినా, దుమ్ము పడ్డా ఏమీ కాదు ఎందుకంటే వీటికి IP55 రేటింగ్ ఉంది. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7 మూడు కలర్స్‌లో వస్తున్నాయి. ఐవరీ గోల్డ్, మోస్ గ్రీన్, ఇంకా లావెండర్ పర్పుల్. వీటి ధర రూ.3,299 కానీ మార్చి 24 నుంచి రూ.2,799కే కొనొచ్చు.
* రియల్‌మీ బడ్స్ T200 లైట్
రియల్‌మీ బడ్స్ T200 లైట్‌లో AI ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) ఫీచర్ ఉంది. దీనివల్ల మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల సౌండ్స్ రాకుండా స్పష్టంగా వాయిస్ వెళ్తుంది. ఇందులో కూడా 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్లు ఉన్నాయి, సౌండ్ చాలా బాగుంటుంది.
ఫొటోల్లో వాటర్‌మార్క్‌లు క్షణాల్లో మాయం చేస్తోన్న జెమిని 2.0 AI టూల్.. కాపీరైట్లకు ఇక కష్టకాలమేనా?
బ్లూటూత్ 5.4 ఉండటం వల్ల కనెక్షన్ సమస్యలు ఉండవు. గేమింగ్ ఆడేవాళ్ల కోసం సూపర్ లో లేటెన్సీ మోడ్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 48 గంటల వరకు పనిచేస్తాయి. నీళ్లు పడ్డా ఏమీ కాకుండా IPX4 వాటర్‌ప్రూఫ్ రేటింగ్ ఇచ్చారు. రియల్‌మీ బడ్స్ T200 లైట్ మూడు కలర్స్‌లో దొరుకుతున్నాయి. అవి స్ట్రోమ్ గ్రే, వోల్ట్ బ్లాక్, ఇంకా అరోరా పర్పుల్.
* ఎక్కడ కొనాలి?
వీటి ధర చాలా తక్కువ, జస్ట్ రూ.1,399. ఇప్పుడు వీటిని డిస్కౌంట్‌లో కేవలం రూ.1,199కే అమ్మకానికి పెట్టారు. రియల్‌మీ బడ్స్ ఎయిర్ 7, బడ్స్ T200 లైట్ రెండూ రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇంకా పెద్ద షాపుల్లో కూడా దొరుకుతాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వాళ్లకి ఈ కొత్త ఇయర్‌బడ్స్ మంచి ఆప్షన్.


Click it and Unblock the Notifications








