Huawei Watch GT 2e ప్రీ-ఆర్డర్స్ మొదలయినాయి... ఉచిత ఆఫర్స్ చాలా..
ప్రస్తుత సమయంలో చాలా మంది స్మార్ట్ ఫోన్ తరువాత అధికంగా ఇష్టపడే డివైస్ లలో స్మార్ట్ వాచ్ అన్నిటికంటే ముందువరుసలో ఉంటుంది. స్మార్ట్ ఫోన్లను తయారుచేస్తున్న ప్రతి కంపెనీ కూడా తన సొంత స్మార్ట్ వాచ్ లను వివిధ రకాల ధరలలో వివిధ మోడల్ లలో విడుదల చేసారు.

గత సంవత్సరం ఈ రంగంలోకి అడుగు పెట్టిన హువాయి సంస్థ ఇప్పుడు కొన్ని రోజుల ముందు తన కొత్త వాచ్ ను విడుదల చేసింది. హువాయి సంస్థ కొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ వాచ్ ఇప్పుడు భారతదేశంలో ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది. హువాయి వాచ్ GT2e పేరుతో విడుదల అయిన ఈ వాచ్ అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా నేటి నుండి మే 21 వరకు ముందే ఆర్డర్ చేయవచ్చు.

హువాయి వాచ్ GT2e ధరల వివరాలు
హువాయి వాచ్ GT2e ను ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్ లలో మాత్రమే విడుదల చేసారు. దీని యొక్క ధర రూ.11,990 లుగా నిర్ణయించారు. ఈ హువాయి స్మార్ట్‌వాచ్‌ను ప్రస్తుతం రెండు ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా పొందవచ్చు. వీటిని కొనుగోలు చేయడానికి 6 నెలల నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారికి AM61 బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు ఉచితంగా లభిస్తాయి.

హువాయి వాచ్ GT2e స్పెసిఫికేషన్స్
హువాయి వాచ్ GT2e స్మార్ట్‌వాచ్ స్పోర్టి లుక్ కలిగి ఉండి గ్రాఫైట్ బ్లాక్, లావా రెడ్, మింట్ గ్రీన్ మరియు ఐసీ వైట్ వంటి నాలుగు కలర్ ఎంపికలలో లభిస్తుంది. ఇది రెటినా-గ్రేడ్ రిజల్యూషన్‌తో 1.39-అంగుళాల AMOLED డిస్ప్లేని కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ఎనిమిది బహిరంగ కార్యకలాపాలు మరియు ఏడు ఇండోర్ కార్యకలాపాలతో సహా 15 ప్రొఫెషనల్ వర్కౌట్ మోడ్లతో వస్తుంది.

వర్కౌట్ సెన్సార్
ఈ కార్యకలాపాలలో రన్నింగ్, వాకింగ్, పర్వతారోహణ, హైకింగ్, సైక్లింగ్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ వంటివి మరిన్ని ఉన్నాయి. అలాగే వర్కౌట్ల కోసం 190 రకాల డేటాను ట్రాక్ చేసే ఫీచర్ లను ఈ స్మార్ట్ వాచ్ కలిగి ఉంది. ఇది ఆరు ప్రొఫెషనల్ వర్కౌట్ మోడ్‌లను కూడా గుర్తించగలదు.

ఫీచర్స్
హువాయి వాచ్ GT2e స్మార్ట్‌వాచ్ యొక్క బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే ఇది ఒకే ఒక ఛార్జీతో రెండు వారాల పాటు పనిచేస్తుంది అని కంపెనీ తెలిపింది. ఇది అంతర్గత కిరిన్ A1 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.ఇది హువాయి యొక్క ట్రూసీన్ హృదయ స్పందన పర్యవేక్షణ టెక్నాలజీను ఉపయోగించి పనిచేసే హృదయ స్పందన సెన్సార్‌ను కలిగి ఉంది. వినియోగదారు హృదయ స్పందన రేటు చాలా ఎక్కువగా ఉంటే లేదా చాలా తక్కువగా ఉంటే ఈ స్మార్ట్ వాచ్ హెచ్చరికను పంపుతుంది. స్మార్ట్ వాచ్ ట్రూ రిలాక్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నాలజీ మరియు ట్రూస్లీప్ 2.0 టెక్నాలజీని కూడా ఉపయోగిస్తుంది.


Click it and Unblock the Notifications








