Home
Gadgets

Infinix X1 సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి!! బడ్జెట్ ధరలోనే

ట్రాన్స్షన్ హోల్డింగ్స్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ సంస్థ ఇండియాలో అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నది. అయితే ఇప్పుడు ఇండియాలో అధికారికంగా ఇన్ఫినిక్స్ 32 X1 మరియు ఇన్ఫినిక్స్ 43 X1 రెండు X1 సిరీస్ స్మార్ట్‌టీవీలను విడుదల చేసి గ్రాండ్ గా స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ రెండు టీవీలు పేరుకు తగ్గట్టుగా 32-అంగుళాలు మరియు 43-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. 64-బిట్ మీడియాటెక్ ప్రాసెసర్, 1GB ర్యామ్ మరియు HDR10 సపోర్ట్‌ డిస్ప్లే మరియు ఆండ్రాయిడ్ టీవీ ఫీచర్లతో రన్ అయ్యే ఈ ఇన్ఫినిక్స్ టీవీ మోడల్ లు వన్‌ప్లస్, షియోమి, రియల్‌మి మరియు మోటరోలా సంస్థలు అందించే స్మార్ట్ టీవీల కంటే తక్కువ ధరను కలిగి ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల HD డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల HD డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్

ఇన్ఫినిక్స్ 32 X1 మరియు 43 X1 టివిలు ఆండ్రాయిడ్ టివిని బాక్స్ ద్వారా రన్ అవుతున్న కారణంగా యూజర్లు తమకు కావలసిన యాప్ లు మరియు గేమ్ లను గూగుల్ ప్లే స్టోర్ నుండి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ రెండు టీవీలలో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ మరియు డిస్నీ + హాట్‌స్టార్ వంటి ప్రసిద్ధ OTT యాప్ లు ముందే ప్రీలోడ్ చేయబడి ఉన్నాయి. 43 అంగుళాల మోడల్ 1080 × 1920 పిక్సెల్‌లతో ఫుల్HD డిస్‌ప్లేను కలిగి ఉండగా, 32-అంగుళాల మోడల్ 768 × 1366 పిక్సెల్‌లతో HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇవి గరిష్ట స్థాయిలో 400 నిట్ల ప్రకాశంను కలిగి ఉంటాయి అని ఇన్ఫినిక్స్ తెలిపింది. ఈ స్క్రీన్‌లలో 60W రిఫ్రెష్ రేటుతో పాటుగా ముందు భాగంలో సన్నని బెజెల్స్‌ నిర్మాణంను కలిగి ఉంటుంది.

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల హార్డ్‌వేర్ ఫీచర్స్

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల హార్డ్‌వేర్ ఫీచర్స్

ఇన్ఫినిక్స్ సంస్థ యొక్క కొత్త రెండు X1 సిరీస్ స్మార్ట్‌టీవీల యొక్క హార్డ్‌వేర్ విషయానికొస్తే 43 అంగుళాల మోడల్‌లో 24W సౌండ్ అవుట్‌పుట్ మరియు 32 అంగుళాల మోడల్‌లో 20W సౌండ్ అవుట్‌పుట్ స్పీకర్లను కలిగి ఉంటాయి. అలాగే ఇవి మాలి 470 MP3 GPU, క్వాడ్-కోర్ 64-బిట్ మీడియాటెక్ MTK 6683 చిప్‌సెట్‌ను కలిగి ఉండి 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీతో రన్ అయ్యే ప్రతి స్మార్ట్ టీవీలోని ఉహించిన ఫీచర్లలో ఒకటైన క్రోమ్‌కాస్ట్‌ మద్దతుతో పాటు బ్లూటూత్ రిమోట్‌ను కూడా ఇన్ఫినిక్స్ అందిస్తున్నది.

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల కనెక్టివిటీ ఎంపికలు

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల కనెక్టివిటీ ఎంపికలు

ఇన్ఫినిక్స్ యొక్క కొత్త X1 సిరీస్ రెండు టీవీల్లోని కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే వై-ఫై 802.11 B/g/n, బ్లూటూత్ 5.0 మరియు IR రిమోట్ వంటివి ఉన్నాయి. 43-అంగుళాల మోడల్ మూడు HDMI పోర్ట్‌లను అందిస్తుంది. అలాగే 32 అంగుళాల మోడల్ మాత్రం కేవలం రెండు HDMI పోర్ట్‌లతో వస్తుంది. అయితే ఈ రెండు టీవీలలో 5GHz Wi-Fi మద్దతు మాత్రం అందుబాటులో లేదు.

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ X1 సిరీస్ స్మార్ట్‌టీవీల ధరల వివరాలు

ఇన్ఫినిక్స్ X1 యొక్క 32-ఇంచ్ స్మార్ట్ టివి యొక్క ధర రూ.11,999 కాగా 43-ఇంచ్ X1 మోడల్ రూ.19,999 రిటైల్ ధర వద్ద లభిస్తుంది. ఇతర బ్రాండ్లు ఈ పరిమాణాలలో అందించే టీవీల యొక్క ధరలతో పోలిస్తే వీటి యొక్క ధరలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. ఇన్ఫినిక్స్ ప్రస్తుతం ఈ పోటీ ప్రపంచంలో మార్కెట్లోకి కేవలం రెండు టీవీలను మాత్రమే విడుదల చేసింది. ఇన్ఫినిక్స్ యొక్క కొత్త X1 సిరీస్ స్మార్ట్ టీవీలు డిసెంబర్ 18 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి.

Best Mobiles in India

English summary
Infinix X1 Series Smart TVs Released in India: Price, Specs, Sale Date and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X