మెషిన్ గన్ తో జతచేసిన డ్రోన్‌లు ఎలా ఉన్నాయో చూడండి

|

ప్రస్తుత కాలంలో రోజు రోజుకి టెక్నాలజీ అనేది ఎంతలా పెరుగుతోంది అంటే మనం ఇంటిలో కూర్చొని ఉండగానే అన్ని పనులు చేయగలిగే అంతలా పెరుగుతోంది. ఇందులో భాగంగా డ్రోన్‌ల ఉపయోగం. డ్రోన్‌లను చాలా రకాల అవసరాలకు ఉపయోగిస్తున్న సంగతి అందరికి తెలిసినదే. ఇప్పుడు డ్రోన్‌ల ద్వారా నిర్దేశించిన లక్ష్యాలను చేధించడానికి మెషిన్ గన్ ను జతచేసిన డ్రోన్‌లను తయారుచేసారు.

డ్రోన్

మెషిన్ గన్ ను జతచేయబడిన డ్రోన్ అధిక నిర్దేశంతో లక్ష్యాలను చేధించగలదని దాని తయారీదారులు తెలిపారు. ఈ నెలలో దీనిని టర్కీ దేశం మొదటి సారిగా కొనుగొలు చేయనున్నది. ఇటువంటి డ్రోన్‌లను కలిగి ఉన్న మొదటి దేశంగా టర్కీ ఉంది. 25 కిలోగ్రాముల బరువు గల ఈ డ్రోన్ గాలిలో ఎగరడానికి తిరిగే ఎనిమిది బ్లేడ్లను కలిగి ఉంది. ఇది మెషిన్ గన్ ను జతచేయబడి ఉండి 200 రౌండ్ల మందుగుండు సామగ్రిని అందించగల సామర్ధ్యంను కలిగి ఉంటుంది. ఇది సింగిల్ షాట్స్ లేదా 15-రౌండ్ల పేలుళ్లను కాల్చగలదు.

 

అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019.... వీటి మీద ఆఫర్లే ఆఫర్లుఅమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019.... వీటి మీద ఆఫర్లే ఆఫర్లు

మిలటరీ డ్రోన్‌

చాలా దేశాల మిలటరీ సంస్థలు ఇప్పటికే చిన్న పాటి సైనిక డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. ఇవి గ్రెనేడ్‌లను పడవేయడానికి లేదా పేలుడు పదార్థాన్ని లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాలలో పేల్చడానికి ఉపయోగిస్తున్నారు. సాంగర్ అని పిలువబడే ఈ కొత్త డ్రోన్ ను అంకారాకు చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ అసిస్గార్డ్ తయారు చేసింది.

 

 

ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019... ఆఫర్స్ ఏమిటో మీరు చూడండి...

డ్రోన్‌

డ్రోన్‌లను ఉపయోగించి కచ్చితంగా కాల్చడం చాలా కష్టం. ఇందులో కొంతవరకు పరిధి మరియు కోణాన్ని నిర్ధారించడంలో ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి షాట్ నుండి పాక్షికంగా తిరిగి రావడం డ్రోన్‌ను గణనీయంగా కదిలిస్తుంది. ఇది తరువాతి రౌండ్ లక్ష్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సవాళ్లను అధిగమించడానికి సాంగర్‌కు రెండు వ్యవస్థలు ఉన్నాయి. దూరం, కోణం మరియు గాలి వేగాన్ని లెక్కించడానికి కెమెరాలు మరియు లేజర్ రేంజ్ ఫైండర్‌ వంటి సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. వీటి ద్వారా ఎక్కడ లక్ష్యం చేయాలో తెలియచేస్తుంది. రెండవది రోబోట్ ఆయుధాల సమితి ఇది మెషిన్ గన్‌ను కదిలించే ప్రభావాలను భర్తీ చేస్తుంది.

 

 

అద్భుతమైన ఆఫర్లతో BSNL బ్రాడ్‌బ్యాండ్ Rs.1,199 కాంబో ప్లాన్‌అద్భుతమైన ఆఫర్లతో BSNL బ్రాడ్‌బ్యాండ్ Rs.1,199 కాంబో ప్లాన్‌

డ్రోన్‌ ప్రత్యేకతలు

డ్రోన్‌ ప్రత్యేకతలు

డ్రోన్‌ను ఉపయోగించి 200 మీటర్ల నుండి 15-సెంటీమీటర్ల విస్తీరణం వరకు లక్ష్యాలను చేదించడానికి అనుగుణంగా సాంగర్‌కు ఖచ్చితత్వం ఉందని అసిస్‌గార్డ్ పేర్కొంది. ఇందులో గల ప్రతి బుల్లెట్ ఆ పరిధిలో మానవ-పరిమాణ లక్ష్యాన్ని చేధించేంత ఖచ్చితమైనదిగా ఉంటుంది. ఈ డ్రోన్ పైలట్ రిమోట్ కంట్రోల్‌లో స్క్రీన్‌ను ఉపయోగించి దానిపై క్రాస్ హెయిర్‌లను ఉంచడం ద్వారా లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు.

సాంగర్ డ్రోన్‌

సాంగర్ డ్రోన్‌ చీకటిలో కూడా పనిచేస్తుంది. ఇది చీకటిలో పనిచేయడానికి నైట్ సెన్సార్లను కలిగి ఉంటుంది. ఇందులో గల నైట్ సెన్సార్ల పరిధి 10 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఒకే రిమోట్ కంట్రోల్ ఉపయోగించి మూడు సాంగర్ల డ్రోన్‌ల సమూహాన్ని కంట్రోల్ చేయవచ్చు అని అసిస్‌గార్డ్‌లోని అహాన్ సునార్ తెలిపారు.

Best Mobiles in India

English summary
Machine Gun Attached Drones Are Getting Attached To Turkey's Defence Department

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X