మొదటి డ్రోన్ డెలివరీతో సంచలనం సృష్టించిన గూగుల్

|

సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన గూగుల్ ఇప్పుడు దాని అనుబంధ సంస్థలలో ఒకటైన ఫెడెక్స్ ద్వారా మరొక సంచలనం సృష్టించింది. ప్రస్తుత కాలంలో వర్జీనియా పట్టణంలో ఎక్కువ మంది ఆన్లైన్ డెలివరీల మీద అదరపడుతున్నారు. డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి పరీక్షలో భాగంగా గూగుల్ అనుబంధ సంస్థలు వాల్‌గ్రీన్స్ మరియు ఫెడెక్స్ తమ కొనుగోళ్లను అందించడానికి మొదటిసారిగా డ్రోన్‌లను విజయవంతంగా ఉపయోగించారు.

ఆల్ఫాబెట్
 

గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని వింగ్ సంస్థ డ్రోన్ ద్వారా వాణిజ్య డెలివరీలను అందించడానికి ఈ ఏడాది ప్రారంభంలో యుఎస్ ఫెడరల్ అనుమతి పొందింది. అమెజాన్ యొక్క ప్రైమ్ ఎయిర్ ను ఓడించి యుఎస్ లో అనుమతి పొందిన మొట్టమొదటి డ్రోన్ సంస్థ ఇది. వింగ్ సంస్థ 2013 లో తన డ్రోన్ ప్రణాళికలను వెల్లడించింది.

UPS ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్

ఈ నెల ప్రారంభంలో UPS ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుండి డెలివరీ డ్రోన్లను ఎగరడానికి అనుమతి పొందింది. నార్త్ కరోలినాలోని రాలీలోని వేక్‌మెడ్ హాస్పిటల్ క్యాంపస్‌ వద్ద కంపెనీ తన డెలివరీ పరీక్షలను నిర్వహిస్తోంది.

క్రిస్టియన్స్‌బర్గ్‌లో

వర్జీనియాలోని క్రిస్టియన్స్‌బర్గ్‌లో పరీక్షలు నిర్వహించడానికి వింగ్ సంస్థ వాల్‌గ్రీన్స్, ఫెడెక్స్ మరియు స్థానిక గిఫ్ట్ షాప్ షుగర్ మాగ్నోలియాతో భాగస్వామ్యం చేసుకున్నది. పట్టణంలోని వాల్‌గ్రీన్స్ కస్టమర్లు 100 కంటే ఎక్కువ వస్తువుల జాబితాను ఆర్డర్ చేయగలరు. వాటిని డ్రోన్‌ల సహాయం ద్వారా తక్కువ సమయంలో వారి ఇంటి వద్దకు డోర్ డెలివరీ చేయగలరు.

మొదటి డ్రోన్ డెలివరీ
 

మొదటి డ్రోన్ డెలివరీ

వాల్‌గ్రీన్స్ యొక్క మొదటి డ్రోన్ డెలివరీ ద్వారా కస్టమర్లకు దగ్గు మరియు కోల్డ్ మెడిసిన్‌ను ఆర్డర్ చేశారు. ఒక వింగ్ డ్రోన్ డిక్స్ స్పోర్టింగ్ గూడ్స్ నుండి ఫెడెక్స్ ప్యాకేజీని పట్టణంలోని మరొక కుటుంబానికి పంపిణీ చేసింది. సూసీ సెన్స్మీర్ అనే ఆమె స్పోర్టింగ్ గూడ్స్ నుండి ఫ్రంట్ యార్డుకు ఆర్డర్ చేసిన శీతాకాలపు చొక్కాను డ్రోన్ ద్వారా పంపిణీ చేసిన డిక్స్ అందుకున్నది. 81 ఏళ్ల ఆమె అలాంటిది నేను చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు అని తెలిపింది.

డ్రోన్ డెలివరీ వ్యాసార్థం

డ్రోన్ డెలివరీ వ్యాసార్థం

క్రిస్టియన్స్‌బర్గ్‌లోని వింగ్ పంపిణీ కార్యాలయం నుండి సుమారు 4 మైళ్ళు (6.5 కిలోమీటర్లు) వ్యాసార్థం వ్యవది వరకు ఎగురుతున్న డ్రోన్లను ఉపయోగించి డెలివరీలను పంపిణి చేస్తున్నారు. డ్రోన్ల డెలివరీని 12-మైళ్ల (19 కిలోమీటర్లు) రౌండ్ ట్రిప్‌ మేర వింగ్ దాని వ్యాసార్థాన్ని విస్తరించాలని ఆశిస్తుంది.

లోగాన్ సిటీ

వింగ్ సంస్థ ఇప్పటికే కాన్బెర్రా మరియు లోగాన్ సిటీ, ఆస్ట్రేలియా మరియు హెల్సింకిలలో కూడా డ్రోన్ డెలివరీ పరీక్షలను ప్రారంభించింది. FAA నుండి ఎయిర్ క్యారియర్ ధృవీకరణ పొందిన తరువాత శుక్రవారం విమానాలు US లో మొట్టమొదటి వాణిజ్య డెలివరీలను ప్రారంభించాయి.

వింగ్ CEO

వింగ్ CEO

వింగ్ CEO జేమ్స్ ర్యాన్ బర్గెస్ మాట్లాడుతు డ్రోన్ల డెలివరీ ద్వారా వస్తువులను ఆర్డర్ చేయగల వేగాన్ని పెంచాలని చూస్తున్నారు. వినియోగదారులు కొన్నిసార్లు ఆర్డర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే వారు వాటిని పొందగలరు. డ్రోన్ డెలివరీ పెరగడం ద్వారా రోడ్లపై డెలివరీ ట్రక్కులు తగ్గుతాయి. దీని వల్ల పర్యావరణ ప్రయోజనం కూడా కలుగుతుంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో వీటి పోకడలను మరింత ఎక్కువగా పరిశీలిస్తున్నాము అని ఆయన చెప్పారు. డ్రోన్ డెలివరీలను వీటికి పరిష్కారాలలో ముఖ్య భాగంగా చూస్తాము అని ఆయన తెలిపారు..

ఆస్ట్రేలియా

వింగ్ యొక్క ఆస్ట్రేలియా పైలట్లో బర్గెస్ చాలా డెలివరీలు ఆహారం మరియు శీతల ఔషధం కోసం ఎక్కువగా వినియోగించాము అని చెప్పారు. ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి ఇష్టపడని సమయంలో వారికి అవసరమైన విషయాలు ఆహారం,హాట్ కాఫీ వంటి వాటిని డెలివరీ చేయడానికి స్థానిక కాఫీ-హౌస్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా కంపెనీ వాటిని పంపిణీ చేస్తోంది. ఇందులో మరొక విషయం ఏమిటంటే డెలివరీ సమయం నాలుగు నిమిషాల కన్నా తక్కువగా ఉంటుంది.

డ్రోన్‌

వింగ్ యొక్క డ్రోన్‌ల లక్ష్యం ఫొటోస్ మరియు వీడియోలు తీయడం కాదు సురక్షితంగా డెలివరీలు చేయడం. నావిగేషన్ కోసం వింగ్ యొక్క డ్రోన్లలో కెమెరాలు ఉన్నాయి. కానీ ఈ వీడియోలను విమానంలో ప్రాసెస్ చేయబడ్డా కూడా వింగ్ యొక్క ప్రధాన సర్వర్లకు తిరిగి ప్రసారం చేయబడలేదని బర్గెస్ చెప్పారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Wing, A Google Affiliate Company Begins Drone Deliveries In Virginia Town

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X