IPL లవర్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు.. కేవలం రూ.6,999 నుంచే ప్రారంభం!
Smart TVs: క్రికెట్ అభిమానులకు త్వరలోనే బీభత్సమైన వినోదం అందనుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ మార్చి 22 నుంచి అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. ఇంట్లో కూర్చొని మ్యాచ్ చూసే అనుభూతిని మరింత గొప్పగా మార్చేందుకు అమెజాన్ అదిరిపోయే ఆఫర్లతో మీ ముందుకు వచ్చింది. మార్చి 21 నుంచి 26 వరకు "ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్" (EPL) పేరుతో ఒక మెగా సేల్‌ను నిర్వహిస్తోంది.
ఈ సేల్‌లో స్మార్ట్ టీవీలపై ఊహించని డిస్కౌంట్లు ఉన్నాయి. ధరలు అయితే కేవలం రూ.6,999 నుంచే మొదలవుతున్నాయి. స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్‌ను మీ ఇంటికి తెచ్చుకోవడానికి ఇదే సరైన సమయం. మరి వేటిపై ఏ స్థాయిలో ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం

* VW స్మార్ట్ టీవీ 57% డిస్కౌంట్‌తో రూ.6,999కే
VW స్మార్ట్ టీవీ ఫ్రేమ్‌లెస్ డిజైన్‌లో లభిస్తున్న మోడళ్లలో ఇది చాలా చవకైనది. 32 అంగుళాల HD స్క్రీన్‌తో వస్తున్న ఈ టీవీ చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీని అసలు ధర రూ.16,999 కాగా, ఇప్పుడిది కేవలం రూ.7,299కే అందుబాటులో ఉంది. అంతేకాదు, కొన్ని బ్యాంక్ ఆఫర్లతో అదనంగా మరో రూ.300 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
* రెడ్‌మీ F సిరీస్‌పై ఏకంగా 40% డిస్కౌంట్
రెడ్‌మీ F సిరీస్ స్మార్ట్ LED టీవీపై ఏకంగా 40% డిస్కౌంట్ ప్రకటించారు. 43 అంగుళాల భారీ స్క్రీన్, స్టెరియో స్పీకర్లతో వస్తున్న ఈ టీవీ.. 4K క్వాలిటీ విజువల్స్‌తో పాటు క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ను అందిస్తుంది. దీని అసలు ధర రూ.42,999 కాగా, ఈ సేల్‌లో దీన్ని కేవలం రూ.25,999కే సొంతం చేసుకోవచ్చు.
* Mi స్మార్ట్ టీవీ 46% తగ్గింపుతో మీ ఇంటికి
షియోమీ కంపెనీకి చెందిన Mi స్మార్ట్ టీవీ అసలు ధర రూ.24,999 కాగా, ఇప్పుడు ఇది కేవలం రూ.13,499కే అందుబాటులో ఉంది. 32 అంగుళాల HD-రెడీ స్క్రీన్‌తో వస్తున్న ఈ టీవీ.. IPL మ్యాచ్‌లు చూడటానికి పర్ఫెక్ట్ ఛాయిస్. స్పష్టమైన విజువల్స్‌తో పాటు స్మూత్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది.
* స్కైవాల్ స్మార్ట్ టీవీపై 68% డిస్కౌంట్
తక్కువ ధర గల టీవీ కోసం చూస్తున్న వారికి స్కైవాల్ స్మార్ట్ HD టీవీ బెస్ట్ ఆప్షన్. దీనిపై 68% డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.22,499, కానీ సేల్‌లో ఇది కేవలం రూ.7,299కే లభిస్తోంది. 32 అంగుళాల స్క్రీన్‌తో క్లియర్ విజువల్స్‌ను అదిరిపోయే ధరలో పొందొచ్చు. ఇంకా బోనస్‌గా కొన్ని బ్యాంక్ ఆఫర్లూ ఉన్నాయి.
* కోడాక్ స్మార్ట్ టీవీని సగం ధరకే సొంతం చేసుకోండి
కోడాక్ LED స్మార్ట్ టీవీని సగం ధరకే అమ్మకానికి పెట్టారు. సాధారణంగా దీని ధర రూ.15,999 ఉంటుంది. కానీ అమెజాన్ సేల్‌లో మీరు దీన్ని కేవలం రూ.8,499కే కొనేయొచ్చు. HD పిక్చర్ క్వాలిటీతో వచ్చే ఈ టీవీపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అంటే ఇది నిజంగానే డబ్బుకు తగ్గ విలువైన టీవీ అని చెప్పొచ్చు.
* ఆఫర్లు ముగిసేలోపే.. కొనేయండి..
అమెజాన్ EPL సేల్ మీ టీవీని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఒక గోల్డెన్ ఛాన్స్. చవకైన మోడల్ కావాలన్నా, లేదా పెద్ద స్క్రీన్ 4K టీవీ కావాలన్నా.. మీ అవసరానికి తగ్గ టీవీ కచ్చితంగా ఇక్కడ ఉంటుంది. 68% వరకు డిస్కౌంట్లతో వస్తున్న ఈ ఆఫర్లను అస్సలు మిస్ చేసుకోవద్దు. IPL సీజన్‌కు ముందే మీ కొత్త స్మార్ట్ టీవీని ఆర్డర్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








