OnePlus Watch 3 వన్‌ప్లస్ వాచ్ 3 వెనుక పెద్ద మిస్టేక్.. నవ్వుకుంటున్న నెటిజన్లు..!
OnePlus Watch 3: చైనాకు చెందిన వన్‌ప్లస్ కంపెనీ కొత్తగా వన్‌ప్లస్ వాచ్ 3 ని అమెరికాలో రిలీజ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ వాచ్ వెనుక ఉన్న ఒక చిన్న తప్పు వల్ల సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే, ఈ వాచ్ వెనుక 'మేడ్ ఇన్ చైనా (Made in China)' అని ఉండాల్సింది పోయి 'మేడా ఇన్ చైనా (Meda in China)' అని ఉంది.
దీంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది కావాలని చేసిన పబ్లిసిటీ స్టంటా? లేక నిజంగానే క్వాలిటీ కంట్రోల్ లో పెద్ద మిస్టేక్ జరిగిందా? అని చర్చించుకుంటున్నారు. సాధారణంగా ఎవరో ఒకరు ఈ టైపో కచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుంది అంతమంది అంత పెద్ద సంస్థలో ఒక్కరు కూడా దీనిని గుర్తుపట్టకపోవడం గమనార్హం.

* టైపో ఎలా బయటపడింది..
ఫేమస్ టెక్ యూట్యూబర్ మార్క్వెజ్ బ్రౌన్‌లీ ఈ వాచ్ ఫొటోలను X (ట్విట్టర్) లో పోస్ట్ చేస్తూ "వన్‌ప్లస్ 3 వాచ్ వెనుక 'మేడా ఇన్ చైనా' అని తప్పుగా రాసి ఉంది" అని చెప్పాడు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. దాదాపు 30 లక్షల మందికి పైగా దీన్ని చూసేశారు.
చాలా మంది నవ్వుతూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం ఇంత పెద్ద కంపెనీ ఇలాంటి తప్పు ఎలా చేస్తుందని వన్‌ప్లస్‌ను ట్రోల్ చేస్తున్నారు. కావాలనే ఇలా చేశారా అని కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఈ టైపోపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
Confirmed: The OnePlus Watch 3 has a typo on the back: Meda in China 🫠 pic.twitter.com/EsXGAJc1JI
— Marques Brownlee (@MKBHD) February 20, 2025
"నేను నమ్మను ఇది పొరపాటు అని, ఇది కచ్చితంగా వాళ్ల మార్కెటింగ్ ట్రిక్. అందుకే ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు" అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ఇంకొకరేమో "చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అర్థం అవుతుంది కదా" అని లైట్ తీసుకున్నారు.
కొంతమంది అయితే చైనా కంపెనీలు చేసే ఇలాంటి ఫన్నీ తప్పులను గుర్తు చేసుకుంటున్నారు. ఒక యూజర్ "ఒకసారి నేను కొన్న బొమ్మ కారు మాన్యువల్‌లో 'టైర్లను ఎఫ్*** చేయవద్దు' అని రాసి ఉంది" అంటూ నవ్వాడు. ఇంకొకరు "ఇది లిమిటెడ్ ఎడిషన్ 'మేడా ఇన్ చైనా' కలెక్టర్స్ ఐటెం కావొచ్చు" అని జోక్ వేశారు.
అయితే, కొందరు మాత్రం వన్‌ప్లస్ క్వాలిటీ కంట్రోల్‌పై సీరియస్ గా కామెంట్లు చేస్తున్నారు. "ఇలాంటి పెద్ద తప్పునే పట్టించుకోలేదంటే, ఇంకెన్ని మిస్టేక్స్ దాగున్నాయో?" అని ఒక యూజర్ ఆందోళన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వాచ్ గురించి చాలామంది మాట్లాడుకుంటున్నారు.
* వన్‌ప్లస్ వాచ్ 3 ఫీచర్లు, ధర
టైపో ఉన్నా, వన్‌ప్లస్ వాచ్ 3 మాత్రం మంచి ఫీచర్లతో వస్తోంది. అమెరికాలో ఇది ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 26 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ఈ స్మార్ట్‌వాచ్ ధర 329.99 డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.29,000). ఇది ఎమరాల్డ్ టైటానియం, అబ్సిడియన్ టైటానియం అనే రెండు కలర్లలో లభిస్తుంది.
ఇందులో 1.5 అంగుళాల LTPO అమోలెడ్ డిస్‌ప్లే, 32GB స్టోరేజ్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే సపోర్ట్, ఇంకా 100కు పైగా వర్కవుట్ మోడ్స్ ఉన్నాయి. అంతేకాదు, కేవలం 60 సెకన్లలోనే హెల్త్ చెకప్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. దీంతో ఇది మార్కెట్లో ఉన్న ఇతర స్మార్ట్‌వాచ్‌లకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది.
* మార్కెటింగ్ స్టంటా? నిజంగానే తప్పిదమా?
ఇది కావాలని చేసిన మార్కెటింగ్ స్టంటా? లేక నిజంగానే జరిగిన తప్పిదమా? అనే చర్చ మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. పొరపాటు అయితే, వన్‌ప్లస్ క్వాలిటీ కంట్రోల్ మీద అనుమానాలు వస్తాయి. ఒకవేళ మార్కెటింగ్ ట్రిక్ అయితే మాత్రం, వాళ్లు అనుకున్నది సాధించారు అనే చెప్పాలి. ఎందుకంటే, 'మేడా ఇన్ చైనా' టైపోతో వన్‌ప్లస్ వాచ్ 3 ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.


Click it and Unblock the Notifications








