Home
Gadgets

నోకియా నుండి మొదటి 4K స్మార్ట్ టీవీ ఇండియాలో రిలీజ్.. ధర ఎంతో చూడండి

నోకియా యొక్క స్మార్ట్ టీవీని ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేశారు. ఇండియాలో స్మార్ట్ టీవీ మార్కెట్లోకి ప్రవేశించడానికి నోకియా సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. నోకియా స్మార్ట్ టీవీ కోసం 'నోటిఫై మి' అనే అధికారిక పేజీని ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.

ఫ్లిప్‌కార్ట్

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రకారం నోకియా-బ్రాండెడ్ టీవీ 55-అంగుళాల 4K ప్యానెల్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క పూర్తి వివరాలు మరియు లభ్యత గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ధర మరియు లభ్యత వివరాలు

ధర మరియు లభ్యత వివరాలు

ఇండియాలో ఈ నోకియా 55-inch 4K స్మార్ట్ టివి యొక్క ధర రూ.41,999ల నుండి ప్రారంభమవుతుంది. దీని మొదటి సేల్స్ డిసెంబర్ 10 మధాహ్నం 12:00PM నుండి మొదలుకానున్నాయి. దీనిని ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయడానికి డిసెంబర్ 10 నుండి అందుబాటులో ఉంటుంది.

 

ఆఫర్స్ వివరాలు

ఆఫర్స్ వివరాలు

ఫ్లిప్‌కార్ట్ లో నోకియా స్మార్ట్ టీవీ మీద అందిస్తున్న ఆఫర్‌ల విషయానికొస్తే నోకియా యొక్క తాజా టీవీలో 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే కంపెనీ నో-కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే ఇది ఆండ్రాయిడ్ 9 పై ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఇందులో గూగుల్ ప్లే స్టోర్ యాప్ ముందే ఇన్ స్టాల్ చేయబడి ఉంటుంది కావున వినియోగదారులు వారికి అవసరమైన మరిన్ని యాప్ లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఫీచర్స్

ఫీచర్స్

నోకియా 55-inch 4K స్మార్ట్ టివి PureX క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా తనకు కావలసిన శక్తిని తీసుకుంటుంది. ఈ నోకియా బ్రాండ్ తన మొదటి టీవీని 2.25GB ర్యామ్ ఆప్షన్‌లో అందిస్తోంది. 55-అంగుళాలు డిస్ప్లే గల నోకియా స్మార్ట్ టీవీ ఇంటెలిజెంట్ డిమ్మింగ్ టెక్నాలజీ, డాల్బీ విజన్ మరియు హెచ్‌డిఆర్ 10 వంటి ఫీచర్లతో వస్తుంది.

 

 55-inch 4K స్మార్ట్ టివి

నోకియా 55-inch 4K స్మార్ట్ టివి ప్రకాశవంతమైన, మెరుగైన మరియు మరింత స్పష్టమైన కంటెంట్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది డాల్బీ ఆడియో, డాల్బీ డిజిటల్ మరియు డిటిఎస్ ట్రూసరౌండ్ టెక్నాలజీల మద్దతుతో వస్తుంది. ఈ టీవీలో కింద వైపు బాటమ్-ఫైరింగ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇది వినియోగదారులకు శక్తివంతమైన ఆడియోను అందించగలదని కంపెనీ పేర్కొంది.

నోకియా

నోకియా సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్ టీవీ క్లియర్ వ్యూ టెక్నాలజీ మరియు క్లియర్ సౌండ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. ఇది డిజిటల్ స్ట్రీమ్ కంటెంట్ కోసం శబ్దాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. 55-అంగుళాల 4K స్మార్ట్ టీవీ బెజెల్-లెస్ డిజైన్‌ను కలిగిఉంటుంది. ఇది గూగుల్ వాయిస్ అసిస్టెంట్ మరియు నెట్‌ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ కోసం హాట్‌కీలతో వస్తుంది. ఈ నోకియా-బ్రాండెడ్ టీవీ షియోమి, మోటరోలా, Vu, ఇఫాల్కాన్, థామ్సన్ వంటి మరిన్ని బ్రాండ్లకు పోటీగా మార్కెట్ లోకి రాబోతున్నది.

Best Mobiles in India

English summary
Nokia 4K Panel 55-inch Smart TV Launched in India: Check Price, Sale Date, Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X