Home
Gadgets

Paytm : దేశంలోనే తొలిసారిగా పేటీఎం సోలార్‌ సౌండ్‌ బాక్స్‌లు విడుదల.. 4G సపోర్టు, 3W స్పీకర్‌..!

భారత్‌ లో డిజిటల్‌ పేమెంట్స్‌ భారీగా పెరుగుతున్నాయి. నోట్ల రద్దు, కరోనా అనంతరం కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అందుకు అనుగుణంగా ఆయా సంస్థలు వినియోగదారులను ఆకట్టుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. పేటీఎం, ఫోన్‌పే వంటి సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సౌండ్‌బాక్స్‌లను తీసుకొచ్చాయి. దుకాణాదారులు డిజిటల్‌ పేమెంట్స్ వివరాలు తెలుసుకొనేందుకు ఈ సౌండ్‌బాక్స్‌లను ఉపయోగిస్తున్నాయి. డిజిటల్‌ పేమెంట్స్ లో కొందరు మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అనేక మంది సౌండ్‌ బాక్స్‌లను వినియోగిస్తున్నారు.

తాజాగా పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌ సంస్థ సోలార్‌ సౌండ్‌బాక్స్‌ ను (Paytm Solar Sound Box) విడుదల చేసింది. ప్రస్తుతం అనేక సంస్థలు సౌండ్‌బాక్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినా.. దేశంలోనే తొలిసారిగా సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ సౌండ్‌బాక్స్‌ తక్కువ సూర్యకాంతిలోనూ రీఛార్జ్‌ అవుతుందని సంస్థ చెబుతోంది.

Paytm solar sound box launched

4G నెట్‌వర్క్‌ను సపోర్టు :
చిరు దుకాణాలు సహా వ్యాపారులకు ఉపయోగపడేలా సౌండ్‌బాక్స్‌ ను తీసుకొచ్చినట్లు తెలిపింది. విద్యుత్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లో వ్యాపారులకు ఉపయోగపడుతుంది. ఈ సౌండ్‌బాక్స్ QR కోడ్‌ స్కౌనర్‌ ను కలిగి ఉంటుంది. 4G నెట్‌వర్క్‌ ను సపోర్టు చేస్తుంది. మరియు 3W స్పీకర్‌ ను కలిగి ఉంది.

రెండు బ్యాటరీలు :
పేటీఎం సోలార్‌ సౌండ్‌బాక్స్‌ రెండు బ్యాటరీలను కలిగి ఉంటుంది. ఒకటి సోలార్‌, మరొకటి ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తారు. సూర్యకాంతిలో ఆటోమేటిక్‌ గా ఛార్జింగ్ చేసేలా దీనిని తయారు చేశారు. 2-3 గంటల సోలార్‌ ఛార్జింగ్‌ తో రోజంతా పనిచేస్తుందని సంస్థ చెబుతోంది.

11 భాషల్లో నోటిఫికేషన్ :
మరో బ్యాటరీని ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కోసం అమర్చించింది. ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్‌ చేసి 10 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. ఈ సోలార్‌ సౌండ్‌బాక్స్‌ 11 భాషలను సపోర్టు చేస్తుంది. అయితే ఈ సౌండ్‌బాక్స్ ధర, సేల్‌ వివరాలు తెలియాల్సి ఉంది.

* గత నెలలో పేటీఎం Receive Money QR Widget పేరుతో ఆండ్రాయిడ్ యూజర్‌ల కోసం ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ ఫీచర్‌ ద్వారా QR కోడ్ కోసం ప్రతిసారి యాప్‌ను ఓపెన్‌ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్‌ యాక్టివేట్‌ చేసుకున్నాక.. హోం స్క్రీన్‌లోనే QR కోడ్‌ డిస్‌ప్లే కానుంది. అయితే ఐఫోన్‌ యూజర్‌లకు ఈ ఫీచర్‌ ఇప్పటికే అందుబాటులో ఉంది.

దీంతోపాటు డిజిటల్‌ పేమెంట్స్ వివరాలు తెలిసేలా మరో ఫీచర్‌ను కూడా గత నెలలో పేటీఎం తీసుకొచ్చింది. Coin Drop పేరుతో లాంచ్‌ చేసింది. మీ బ్యాంక్‌ అకౌంట్‌లోకి నగదు ట్రాన్స్‌ఫర్‌ జరిగినప్పుడు కాయిన్‌ డ్రాప్‌ సౌండ్‌తో నోటిఫికేషన్‌ రానుంది.

ఈ సంవత్సరం జనవరిలో చిరు వ్యాపారులు, దుకాణాదారులకు ఉపయోగపడేలా జియో భారత్‌ ఫోన్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. డిజిటల్‌ పేమెంట్స్‌ జరిగినప్పుడు ఈ వివరాలు తెలిసేలా అనేక మంది సౌండ్‌బాక్స్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ బాక్స్‌లు అవసరం లేకుండా జియోభారత్‌ ఫోన్‌లలో నోటిఫికేషన్‌లను పొందవచ్చు.

సౌండ్‌బాక్స్‌లను అందిస్తున్నందుకు వ్యాపారుల వద్ద నుంచి నెలవారీగా రుసుములను ఆయా సంస్థలు వసూలు చేస్తున్నాయని, అయితే ఎలాంటి రుసుం లేకుండా జియోభారత్‌ ఫోన్‌లతో డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ల వివరాలు తెలుసుకోవచ్చని విడుదల సమయంలో జియో వెల్లడించింది.

ఇతర సంస్థలు సౌండ్‌బాక్స్‌ల కోసం రూ.125 అద్దె వసూలు చేస్తున్నాయని, జియో సౌండ్‌ పే సర్వీసుల ద్వారా ఈ సదుపాయాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. దీని ద్వారా సంవత్సరానికి రూ.1500 ఆదా అయ్యే అవకాశం ఉందని తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Paytm solar sound box launched with 4G and 3W Speaker for the first time in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X