తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌

|

ఇండియాలో రియల్‌మి 6, రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసారు. ఈ లాంచ్ ఈవెంట్ కార్యక్రమంలో వీటితో పాటుగా రియల్‌మి బ్యాండ్‌ను కూడా విడుదల చేసారు. డయల్ ఫేస్ రియల్ డిజైన్ గల ఈ ఫిట్‌నెస్ బ్యాండ్‌ ఐదు వేరు వేరు కలర్ లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ చేయడానికి వీలుగా ఉన్న రియల్‌మి బ్యాండ్ గురించి మరింతంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌
 

రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌

Mi బ్యాండ్ 4 కు పోటీగా విడుదలైన రియల్ బ్యాండ్ డిజైన్ పరంగా పెద్ద కలర్ డిస్ప్లేను కలిగి ఉండడమే కాకుండా రియల్ టైమ్ హార్ట్ రేట్ మోనిటర్ మరియు స్మార్ట్ నోటిఫికేషన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌ను రియల్‌మి లింక్ యాప్ ను ఉపయోగించి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో కనెక్ట్ చేయవచ్చు. ఫిట్‌నెస్ బ్యాండ్‌లో భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన క్రికెట్ మోడ్ కూడా ఉంది.

Realme 6, 6Pro కొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి!!!

ఇండియాలో రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌ ధర

ఇండియాలో రియల్‌మి ఫిట్‌నెస్ బ్యాండ్‌ ధర

భారతదేశంలో రియల్‌మి బ్యాండ్‌ను రూ.1,499 ధర వద్ద లాంచ్ చేసారు. ఈ ఫిట్నెస్ బ్యాండ్ బ్లాక్, గ్రీన్ మరియు ఎల్లో మరియు స్ట్రాప్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. "హేట్-టు-వెయిట్" పరిమిత-కాలపు అమ్మకంలో భాగంగా రియల్‌మి.కామ్ వెబ్‌సైట్ ద్వారా ఈ రోజు నుండి కొనుగోలు చేయడానికి ఇది అందుబాటులో ఉంది. అయితే దీని యొక్క మొదటి రెగ్యులర్ సేల్స్ మార్చి 9 న మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మి.కామ్ ద్వారా జరుగుతుంది. ఈ స్మార్ట్ బ్యాండ్ అమెజాన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా త్వరలో లభిస్తుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రియల్‌మి బ్యాండ్‌లో 0.96-అంగుళాల (2.4 సెం.మీ) కలర్ TFT ఎల్‌సిడి ప్యానెల్ 80x160 పిక్సెల్స్ రిజల్యూషన్ వద్ద వస్తుంది. దీని యొక్క డిస్ప్లేలో టచ్ బటన్ ఉంటుంది. ఇది రియల్‌మి లింక్ యాప్ ద్వారా సర్దుబాటు చేయగల ఐదు రకాల మోడ్ లకు మద్దతు ఇస్తుంది. ఇంకా ఇందులో అంతర్నిర్మిత గురుత్వాకర్షణ సెన్సార్ ను ఉపయోగించి మీ మణికట్టు భూమికి ఎంత ఎత్తులో ఉందొ కనుగొనవచ్చు.

Tata Sky సెట్-టాప్-బాక్సుల పెరిగిన కొత్త ధరలు ఇవే...

రియల్‌మి లింక్ యాప్‌
 

రియల్‌మి లింక్ యాప్‌

రియల్‌మి లింక్ యాప్‌ను ఉపయోగించి రియల్‌మి బ్యాండ్‌లో ఐదు రకాల డయల్ ఫేస్‌లను వర్తించవచ్చు. భవిష్యత్ లో ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్ డేట్ లతో ఇంకా అదనపు డయల్ పేస్ లను జోడించవచ్చు అని రియల్‌మి సంస్థ హామీ ఇచ్చింది.

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

రియల్‌మి బ్యాండ్ సెన్సార్‌

రియల్‌మి బ్యాండ్ సెన్సార్‌

ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం రియల్‌మి బ్యాండ్ ఖచ్చితమైన PPG ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్‌తో ప్రీలోడ్ చేయబడి ఉంది. ఇది ప్రతి ఐదు నిమిషాలకు వినియోగదారుల యొక్క హృదయ స్పందన రేటును కొలుస్తుందని పేర్కొంది. ఇది స్లీప్ క్వాలిటీ మానిటర్‌తో కూడా వస్తుంది. దీని ద్వారా నిద్ర నాణ్యతను విశ్లేషించడానికి ఒక అల్గోరిథంను ఉపయోగించింది. వినియోగదారులు వారి నిద్ర విధానాలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక నివేదికను రూపొందిస్తుంది. వినియోగదారులు ఎక్కువసేపు కూర్చున్న తర్వాత నడవడానికి గుర్తుచేయడానికి వీలుగా ఐడిల్ అలర్ట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

BSNL Rs.551 ప్లాన్: రోజుకు 5GB డేటా ప్రయోజనాలతో

స్పోర్ట్స్ మోడ్‌

స్పోర్ట్స్ మోడ్‌

రియల్‌మి బ్యాండ్‌లో తొమ్మిది రకాల స్పోర్ట్స్ మోడ్‌ల జాబితా కూడా ఉన్నాయి. ఇందులో వాకింగ్, రన్నింగ్ మరియు యోగా వంటివి ఉన్నాయి. మీరు ఈ మూడు రకాల మోడ్‌లను ఫిట్‌నెస్ బ్యాండ్‌లో సెట్ చేసుకొని మీరు మీ యొక్క కార్యక్రమాలను చేసుకోవచ్చు. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు వివరణాత్మక గణాంకాలను అందించడానికి క్రికెట్ మోడ్ కూడా ఇందులో ఉంది.

ఈ వారంలో లాంచ్ అయ్యే స్మార్ట్‌వాచ్ లు ఇవే...

స్మార్ట్ నోటిఫికేషన్‌

స్మార్ట్ నోటిఫికేషన్‌

రియల్‌మి బ్యాండ్‌ IP68- సర్టిఫైడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. అంటే ఇది నీరు, ధూళి వంటి నిరోధకతను కలిగి ఉంది. ఈ రియల్‌మి బ్యాండ్‌ స్మార్ట్ నోటిఫికేషన్‌లతో వస్తుంది. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్‌టాక్ మరియు యూట్యూబ్ వంటి యాప్ లకు మద్దతును ఇస్తుంది.

బ్యాటరీ

బ్యాటరీ

రియల్‌మి బ్యాండ్‌లో మూడు-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, రోటర్ వైబ్రేషన్ మోటర్ మరియు బ్లూటూత్ v4.2 ఉన్నాయి. బ్యాండ్ ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్‌లో పనిచేసే అన్ని రకాల డివైస్ లకు అనుకూలంగా ఉంటుంది. ఈ రియల్‌మి బ్యాండ్‌ 90mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది ఆరు నుండి తొమ్మిది రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Realme Band Launched in India: Price, Specs, Features and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X