Realme X50 Pro 5G: అదరహో అనిపిస్తున్నసేల్స్ ఆఫర్స్

|

భారతదేశంలో రియల్‌మి X50 ప్రో 5G యొక్క సేల్ ఈ రోజు మొదలుకానుంది. ఫిబ్రవరి 24 న ఇండియాలో లాంచ్ అయిన ఈ ఫోన్ ఈ రోజు రెండవ సారి అమ్మకానికి మన ముందుకు వస్తున్నది. దీని యొక్క మొదటి సేల్ లాంచ్ అయిన రోజునే జరిగింది. దీనిని కొనుగోలు చేయదలచిన వారు రియల్‌మి యొక్క అధికారిక వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ధరల వివరాలు

ధరల వివరాలు

ఇండియాలో మొట్టమొదటి 5G సామర్థ్యం గల ఫోన్‌లలో ఒకటైన ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్‌ మరియు 12GB వరకు ర్యామ్‌ను కలిగి ఉంటుంది. భారతదేశంలోరియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్ లలో వివిధ రకాల ధరను కలిగి ఉంటుంది. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.37,999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.39,999. టాప్-ఎండ్ మోడల్ 12GBర్యామ్ + 256GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర రూ.44,999లుగా ఉన్నది. ఈ ఫోన్ రస్ట్ రెడ్ మరియు మోస్ గ్రీన్ కలర్ లలో మాత్రమే లభిస్తుంది.

 

 

Apple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీApple కొత్త ఉత్పత్తులలో mini-LED టెక్నాలజీ

సేల్స్ ఆఫర్స్

సేల్స్ ఆఫర్స్

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్స్ ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు రియల్‌మి.కామ్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతుంది. దీని కొనుగోలు మీద రూ.500 విలువైన మోబిక్విక్ సూపర్ క్యాష్‌బ్యాక్ ను వినియోగదారులు పొందవచ్చు. నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ కూడా లభిస్తుంది. రూ.11,500 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను కూడా అదనంగా పొందవచ్చు. ఇవి కాకుండా కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వంటి ఆఫర్‌లు మరియు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ను కూడా పొందవచ్చు.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC చేత రన్ అవుతుంది. భారతదేశంలో ఈ 5G మొబైల్ ప్లాట్‌ఫాంలో విడుదల అవుతున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. దీని ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ దాని ముందు కంటే CPU మరియు GPU పనితీరులో పెద్ద మెరుగుదలను తెస్తుంది. ఇది 90HZ రిఫ్రెష్ రేట్ మరియు 180HZ శాంప్లింగ్ రేట్‌తో 6.44-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ యొక్క ముందు భాగంలో డ్యూయల్ అల్ట్రా-వైడ్ సెల్ఫీ కెమెరాల కోసం పిల్ ఆకారపు కటౌట్ కూడా ఉంది.

 

 

చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?చిన్న పిల్లల ఆధార్ కార్డును పొందడం ఎలా?

డిస్ప్లే

డిస్ప్లే

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. ఇది 92 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉండడమే కాకుండా ఇది ప్యానెల్ FHD + రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీలను క్లిక్ చేయడానికి ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో జోడించబడి ఉండడమే కాకుండా ఇది 65W సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతునిస్తుంది. ఇది సూపర్ లీనియర్ డ్యూయల్ స్పీకర్‌తో వస్తుంది.

 

 

Oppo Kash: అప్పు కావాలా? ఇప్పుడు దీని ద్వారా సులభంగా పొందవచ్చు!!!Oppo Kash: అప్పు కావాలా? ఇప్పుడు దీని ద్వారా సులభంగా పొందవచ్చు!!!

కెమెరా సెటప్‌

కెమెరా సెటప్‌

ఫోటోలు మరియు వీడియోల కోసం రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో క్వాడ్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 64 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ GW1 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-అంగెల్ కెమెరా మరియు 12 మెగాపిక్సెల్ కెమెరా టెలిఫోటో సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ పోట్రైట్ సెన్సార్ తో కూడిన కెమెరాలను కలిగి ఉంటుంది. హ్యాండ్‌సెట్ 20x హైబ్రిడ్ జూమ్‌తో పాటు వై-ఫై 6 కి మద్దతు ఇస్తుంది.

కనెక్టివిటీ

కనెక్టివిటీ

రియల్‌మి X50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో డ్యూయల్-మోడ్ 5G, డ్యూయల్ 4G, VoLTE, వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, GPS మరియు USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ ఎక్స్ 55 మోడెమ్ ఉంది. ఇది యూజర్లు 5G మరియు 4G నెట్‌వర్క్‌ల మధ్య సులభంగా మారడానికి అనుమతిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 10 మరియు కలర్‌ఓఎస్ ఆధారిత రియల్‌మి UI 1.0 తో రన్ అవుతుంది.

 

 

Best Mobiles in India

English summary
Realme X50 Pro 5G Second Sale Strat Today at 12 PM : Price, Availability, Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X