Home
Gadgets

వీడియో కాలింగ్, MEMC ఫీచర్లతో విడుదలైన TCL కొత్త 4K టీవీల మీద ఓ లుక్ వేయండి

ఇండియాలో మొదటి నుంచి టీవీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించిన TCL సంస్థ ఇటీవల P725 4K HDR LED టివి సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేసారు. ఈ సిరీస్‌ జాబితాలో నాలుగు స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఈ సిరీస్ లో లభించే అన్ని LED టీవీలు ఆండ్రాయిడ్ టీవీ 11 ప్లాట్‌ఫామ్‌లో రన్ అవుతూ 4K హెచ్‌డిఆర్ కంటెంట్ ను గొప్ప నాణ్యత గల విజువల్ తో మీకు లభిస్తుంది. TCL సంస్థ ఈ టీవీలను 43-అంగుళాలు, 50-అంగుళాలు, 55-అంగుళాలు మరియు 65-అంగుళాలు వంటి నాలుగు పరిమాణాలలో ప్రారంభించింది. TCL P725 స్మార్ట్ టీవీ సిరీస్ యొక్క ఫీచర్స్ మరియు ధరల వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

TCL P725 4K HDR LED TV సిరీస్ ధరల వివరాలు

TCL P725 4K HDR LED TV సిరీస్ ధరల వివరాలు

TCL సంస్థ తన P725 4K HDR LED TV సిరీస్ లను నాలుగు వేర్వేరు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో 43 అంగుళాల వేరియంట్‌ యొక్క ధర రూ.41,990 కాగా, 50 అంగుళాల వేరియంట్‌ను రూ.62,990, 55-అంగుళాల వేరియంట్‌ను రూ.62,990 మరియు చివరిగా 65 అంగుళాల వేరియంట్‌ను 89,990 రూపాయల ధర వద్ద విడుదల చేశారు. లభ్యత విషయానికి వస్తే వీటిలో స్మార్ట్ టీవీ యొక్క 65-అంగుళాల వేరియంట్ మాత్రమే అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతుంది. ఇతర వేరియంట్ల లభ్యత విషయంలో ఎటువంటి సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.

TCL P725 4K HDR LED TV సిరీస్ స్పెసిఫికేషన్స్

TCL P725 4K HDR LED TV సిరీస్ స్పెసిఫికేషన్స్

TCL కొత్తగా విడుదల చేసిన P725 4K హెచ్‌డిఆర్ ఎల్‌ఇడి టివిల యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇవి ఆండ్రాయిడ్ టివి 11 ప్లాట్‌ఫామ్‌లో రన్ అవుతాయి. ఇది ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 7,000 యాప్ లు మరియు గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి మరియు వాటిని స్మార్ట్ ఫోన్ లో వలె యాక్సిస్ చేయడానికి వీలుగా అనుమతి లభిస్తుంది. అలాగే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ళ్లు డిస్నీ + హాట్‌స్టార్ మరియు నెట్‌ఫ్లిక్స్ కూడా టిసిఎల్ కొత్త సిరీస్ ఎల్‌ఇడి టివిలో యాక్సిస్ చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

TCL P725 4K HDR LED టీవీ సిరీస్ MEMC ఫీచర్స్

TCL P725 4K HDR LED టీవీ సిరీస్ MEMC ఫీచర్స్

TCL కొత్త స్మార్ట్ టీవీల యొక్క అన్ని వేరియంట్లు Chromecast తో ముందే లోడ్ చేయబడి ఉన్నాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌ల నుండి టీవీలోకి కంటెంట్ మిర్రరింగ్‌ను అనుమతిస్తుంది. టీవీ సిరీస్ మంచి వీక్షణ అనుభవం కోసం డాల్బీ అట్మోస్ ఆడియో మరియు డాల్బీ విజన్ ప్రమాణాలకు మద్దతునిస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ టీవీలు MEMC (మోషన్ ఎస్టిమేషన్ అండ్ మోషన్ కాంపెన్సేషన్) టెక్నాలజీను కలిగి ఉన్నాయి. అలాగే ఇవి వీడియో కాల్ కోసం ముందుభాగంలో కెమెరాను కూడా కలిగి ఉంటాయి. యూజర్లు టిసిఎల్ P725 4K హెచ్‌డిఆర్ ఎల్‌ఇడి టివిలో గూగుల్ అసిస్టెంట్ హ్యాండ్స్ ఫ్రీని కూడా యాక్టివేట్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

Best Mobiles in India

English summary
TCL P725 4K HDR LED TV Series Released in India With Android TV 11 and MEMC Features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X