Xiaomi Mi Notebook: కొత్త ల్యాప్‌టాప్‌ లాంచ్ త్వరలోనే!!! ఫీచర్స్ అదుర్స్....

|

ప్రముఖ చైనా సంస్థ షియోమి ఇండియాలో స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ రంగాలలో విజయం సాధించిన తరువాత ఇప్పుడు మొదటి సారిగా ల్యాప్‌టాప్‌ రంగంలోకి అడుగు పెడుతోంది. ఇందుకోసం జూన్ 11, 2020 న తన Mi నోట్‌బుక్ ల్యాప్‌టాప్‌ను ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

 

షియోమి Mi ల్యాప్‌టాప్‌

షియోమి Mi ల్యాప్‌టాప్‌

ఈ షియోమి చైనా కంపెనీ Mi ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేయడాన్ని చాలా కాలంగా తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా టీజ్ చేస్తున్నది. షియోమి ఇండియా యొక్క MD మను కుమార్ జైన్ గత వారం తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఇండియాలో ఈ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసాడు. దీనితో పాటుగా కొన్ని నివేదికలు ఇచ్చిన సమాచారం ప్రకారం షియోమి రెడ్‌మిబుక్ 13 యొక్క రీబ్రాండెడ్ వెర్షన్‌తో పాటుగా Mi బ్యాండ్ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో Mi బ్రాండ్ కింద విక్రయిస్తుందని పేర్కొంది. Facebook "Collab app": ఫేస్‌బుక్ నుంచి మరో కొత్త వీడియో యాప్...

షియోమి ట్విట్

షియోమి ట్విట్

షియోమి సంస్థ ఇండియాలో తన Mi నోట్బుక్ ప్రారంభ తేదీని మాత్రమే ప్రకటించింది. ల్యాప్‌టాప్ యొక్క ప్రత్యేకతలకు సంబంధించి ప్రతేకంగా ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. కానీ సంస్థ టీజ్ చేసిన దానిలో ఉన్న సమాచారం ప్రకారం షియోమి Mi నోట్‌బుక్ ఇంటెల్ కోర్ ఐ 7 ప్రాసెసర్ మరియు 1C ఛార్జింగ్‌ మద్దతుతో పాటుగా బెజెల్-లెస్ ఫుల్ హెచ్‌డి డిస్ప్లే ను కలిగి ఉంది. Vodafone Idea Rs.251 Data Voucher: అధిక డేటా వినియోగదారులకు సరైన ప్లాన్

షియోమి Mi నోట్‌బుక్ స్పెసిఫికేషన్స్
 

షియోమి Mi నోట్‌బుక్ స్పెసిఫికేషన్స్

షియోమి సంస్థ ఇండియాలో విడుదల చేయబోయే Mi నోట్‌బుక్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే కంపెనీ టీజ్ చేసిన ఫోటోల ప్రకారం ఇది అద్భుతమైన పనితీరు కోసం ఇంటెల్ కోర్ i7 ప్రాసెసర్ ద్వారా రన్ అవుతున్నట్లు ఆశించవచ్చు. స్క్రీన్ విషయంలో షియోమి Mi నోట్‌బుక్‌లో ఫుల్ హెచ్‌డి స్క్రీన్ ఉంటుందని భావించవచ్చు. ఇది వినియోగదారుల యొక్క వ్యూ అనుభవాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. BSNL Bharat Fiber Broadband: 4 నెలల సేవలు ఉచితంగా పొందే అవకాశం...

షియోమి Mi నోట్‌బుక్ ఫీచర్స్

షియోమి Mi నోట్‌బుక్ ఫీచర్స్

షియోమి Mi నోట్‌బుక్ 1C ఛార్జింగ్ టెక్నాలజీను కలిగి ఉన్నట్లు సమాచారం. ల్యాప్‌టాప్‌లోని 1C ఛార్జింగ్ టెక్నాలజీతో ల్యాప్‌టాప్ మల్టీ టాస్కర్లకు మరియు ముఖ్యంగా గేమర్‌లకు అనువైనదిగా ఉంటుంది. ల్యాప్‌టాప్‌ యొక్క ఇంటర్నల్ మెమొరీ ఊహించిన దానికంటే అధికంగా ఉంటుంది అని షియోమి సంస్థ తన టీజర్ ద్వారా తెలిపింది. కాబట్టి పెద్ద మొత్తంలో ఫైళ్ళను స్టోర్ చేయడం గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

షియోమి Mi నోట్‌బుక్ ధరల వివరాలు

షియోమి Mi నోట్‌బుక్ ధరల వివరాలు

షియోమి Mi నోట్‌బుక్ యొక్క ధరల వివరాల గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనలను విడుదల చేయలేదు. కానీ షియోమి భారత మార్కెట్లో షియోమి Mi నోట్బుక్ ను అధిక ధర వద్ద ఉంచుతుందని భావిస్తున్నారు. రెడ్మిబుక్ 13 కన్నా Mi నోట్‌బుక్ యొక్క ఫీచర్స్ చాలా మెరుగ్గా ఉన్నందున దీని ధర అధికంగా ఉండవచ్చు.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Notebook Laptop Launched in India on June 11

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X