Vodafone Idea Rs.251 Data Voucher: అధిక డేటా వినియోగదారులకు సరైన ప్లాన్
ఇండియాలో ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను ఈ నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. దీని కారణంగా ఉద్యోగులు మరొక నెల పాటు ఇంటి వద్ద నుండి పనిచేయవలసి ఉంటోంది. ఇండియాలోని టెలికామ్ సంస్థలు తమ వినియోగదారుల కోసం రకరకాల ఆఫర్లతో అధిక డేటాను అందించడానికి వివిధ ధరల వద్ద డేటా వోచర్లను అందిస్తోంది.

వోడాఫోన్ ఐడియా డేటా వోచర్
వోడాఫోన్ ఐడియా సంస్థ రూ.251 ధర వద్ద వినియోగదారుల కోసం కొత్తగా డేటా వోచర్‌ను ప్రవేశపెట్టింది. COVID-19 వ్యాప్తి కారణంగా ఇంటి వద్ద నుండి పనిచేసే ప్రజలకు దీని యొక్క డేటా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉండి తమ విలువైన సమయాన్ని గడపడానికి ఎక్కువ డేటాను వినియోగిస్తున్నారు. Moto G8 Power Lite Sale: బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కు ఇదే సరైన ఛాయస్!!!

డేటా డిమాండ్
డేటా అవసరాల డిమాండ్‌ను తీర్చడానికి టెల్కోలు కొత్త డేటా ప్యాక్‌లతో వస్తున్నాయి. వోడాఫోన్ ఐడియా యొక్క కొత్త రూ.251 డేటా వోచర్ 50GB 4G / 3G/ 2G డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ వోచర్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి. Airtel Prepaid Plans:84రోజుల వాలిడిటీతో లాక్డౌన్ సమయంలో సరైన ప్లాన్‌లు ఇవే....

వోడాఫోన్ ఐడియా రూ.251 డేటా వోచర్
వోడాఫోన్ ఐడియా వినియోగదారులలో అధికంగా మొబైల్ డేటాను వినియోగించే వారికి రూ.251 డేటా వోచర్ సరిగ్గా సరిపోతుంది. ఇది ఒక నెల కాలంలో రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 50GB డేటాను అందిస్తుంది. ఈ డేటా వోచర్ యొక్క 50GB అదనపు డేటాను 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. JioFiber బ్రాడ్‌బ్యాండ్ యొక్క కొత్త ప్లాన్‌ల డేటా ఆఫర్స్ ఇవే...

వోడాఫోన్ ఐడియా రూ.251 డేటా వోచర్ లభ్యత
వోడాఫోన్ ఐడియా యొక్క రూ.251 డేటా వోచర్ ప్రయోజనం బీచర్, చెన్నై, గుజరాత్, హర్యానా, కేరళ, తమిళనాడు (చెన్నై మినహా), మరియు యుపి ఈస్ట్ వంటి ఎంపిక చేసిన టెలికం సర్కిల్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆంధ్రప్రదేశ్, అస్సాం, డీల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర మరియు గోవా, మధ్యప్రదేశ్, ముంబై, నార్త్ ఈస్ట్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, యుపి వెస్ట్ మరియు పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో కూడా ఇది త్వరలోనే అందుబాటులోకి రానున్నది.

వోడాఫోన్ ఐడియా రూ 98 డేటా వోచర్
వోడాఫోన్ ఐడియా కొద్ది రోజుల క్రితం తన రూ.98 డేటా వోచర్ ప్లాన్ యొక్క ప్రయోజనాలను సవరించింది. సవరణకు ముందు ఈ డేటా వోచర్ 6GB డేటా ప్రయోజనాన్ని మాత్రమే అందించేది. కానీ ఇప్పుడు టెల్కో తన ‘డబుల్ డేటా ఆఫర్' లోకి రూ .98 డేటా వోచర్‌ను కూడా చేర్చింది. ఇప్పుడు రూ.98 వోచర్ 12GB అపరిమిత డేటాను 28 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది.

వోడాఫోన్ ఐడియా డేటా వోచర్ ప్లాన్లు
వోడాఫోన్ ఐడియా మరో రెండు ధరల వద్ద డేటా వోచర్లను అందిస్తున్నాయి. వీటి యొక్క ధరలు వరుసగా రూ.16 మరియు రూ.48. వినియోగదారులు రూ.16 డేటా వోచర్‌తో 1GB డేటాను 24 గంటల చెల్లుబాటుతో మరియు రూ.48 డేటా వోచర్‌తో 3GB డేటా ప్రయోజనాన్ని 28 రోజుల వాలిడిటీతో పొందుతారు.

రిలయన్స్ జియో రూ.251 డేటా వోచర్ ప్లాన్
రిలయన్స్ జియో ‘వర్క్ @ హోమ్' పేరుతో మూడు డేటా వోచర్లను ప్రవేశపెట్టింది. ఆ ప్లాన్‌లలో ఒకటి రూ.251 ధర వద్ద వస్తుంది. రిలయన్స్ జియో యొక్క రూ.251 వోచర్ ప్లాన్ వాయిస్ కాలింగ్ సౌకర్యంను అందించదు కానీ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ యొక్క వాలిడిటీ కాలానికి మొత్తంగా 50GB డేటా ప్రయోజనంను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.251 డేటా వోచర్ ప్లాన్
ఎయిర్టెల్ సంస్థ ముందుగా రిలయన్స్ జియోకు పోటీగా దాని రూ.251 డేటా వోచర్‌ను విడుదల చేసింది. ఎయిర్‌టెల్ యొక్క రూ.251 డేటా వోచర్ 50GB డేటాను అందిస్తుంది. ఈ వోచర్ కు కూడా యాక్సిస్ వాలిడిటీ ఏమీ లేదు. వినియోగదారులు ప్రస్తుతమున్న వారి ప్లాన్ యొక్క అదే వాలిడిటీను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








