Xiaomi కొత్త వైర్‌లెస్ ఛార్జర్ టెక్నాలజీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు!!

|

వైర్‌లెస్ ఛార్జర్‌ల గురించి గత కొంతకాలంగా చర్చనీయాంశం మరింత ఎక్కువగా ఉంది. కాని ప్రజలు గమనించదగ్గ విషయం ఏమిటంటే వైర్‌లెస్ ఛార్జింగ్ అనేది నిజమైన వైర్‌లెస్ కాదు. అవును ఫోన్ అడాప్టర్‌కు ప్లగ్ చేయబడలేదు అంతే కానీ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఛార్జింగ్ స్టాండ్ అవసరం ఖచ్చితంగా ఉంది. దీని ద్వారా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ను ఉపయోగించలేకపోవడం కూడా సమస్యగా ఉంది. అయితే ఐఫోన్ 12 సిరీస్‌తో ప్రవేశపెట్టిన ఆపిల్ యొక్క మాగ్‌సేఫ్ టెక్నాలజీ ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది కానీ ఇందులో కూడా ఛార్జ్ చేయడానికి ఫోన్ వెనుక భాగంలో అటాచ్ చేయడానికి కేబుల్ అవసరం ఉంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ యొక్క సొగసైన మార్గంగా ఉంది. ఇది వినియోగదారులను వారి యొక్క ఫోన్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

వైర్‌లెస్ ఛార్జర్

ఎటువంటి కేబుల్ అవసరం లేకుండా ఛార్జ్ చేయడానికి నిజమైన వైర్‌లెస్ ఛార్జర్ ఉందా? అంటే అవును అనే సమాధానం చెప్పాలి. ఈ కొత్త రకం చార్జర్ ను షియోమి సంస్థ విడుదల చేయనున్నది. పూర్తిగా వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేయడానికి Mi ఎయిర్ ఛార్జ్ కోసం పనిచేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీని అర్థం ఎటువంటి కేబుల్ జతచేయకుండానే మీ యొక్క ఫోన్‌లను ఛార్జ్ చేయవచ్చు.

mi ఎయిర్ ఛార్జర్ ఎలా పనిచేస్తుంది?

mi ఎయిర్ ఛార్జర్ ఎలా పనిచేస్తుంది?

షియోమి సంస్థ తన యొక్క బ్లాగ్ పోస్ట్‌లో దీని గురించి ప్రకటించింది. ఈ టెక్నాలజీ 5W శక్తిని ఉత్పత్తి చేస్తూ ఏదైనా ఒక పరికరాన్ని ఒక నిర్దిష్ట దూరం వరకు వైర్లెస్ పద్దతిలో ఛార్జింగ్ పైల్ ద్వారా ఛార్జ్ అందించగలదని తెలిపింది. ఈ పైల్ 5 యాంటెన్నాలను కలిగి ఉంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్ యొక్క స్థానాన్ని ఖచ్చితంగా నిర్ణయించడానికి ఉపయోగపడుతుంది. స్థానం నిర్ణయించిన తర్వాత నియంత్రణ శ్రేణి బీమ్ఫార్మింగ్ ద్వారా తరంగాలను ప్రసారం చేస్తుంది. ఫోన్ లోని అంతర్నిర్మిత "బెకన్ యాంటెన్నా" మరియు "స్వీకరించే యాంటెన్నా శ్రేణి" ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. బెకన్ యాంటెన్నా స్థాన సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. రెండోది 14 యాంటెన్నా సిరీస్ రెక్టిఫైయర్ సర్క్యూట్ ద్వారా మిల్లీమీటర్-వేవ్ సిగ్నల్‌ను విద్యుత్ శక్తిగా మారుస్తుంది.

mi ఎయిర్ ఛార్జర్ త్వరలో అందుబాటులో ఉంటుందా?

mi ఎయిర్ ఛార్జర్ త్వరలో అందుబాటులో ఉంటుందా?

షియోమి సంస్థ ప్రకటించిన వైర్లెస్ చార్జర్ కేవలం డెమో మాత్రమేనని గమనించండి. ఇది వినియోగదారులకు ఎప్పుడు లభిస్తుందో అన్న విషయం స్పష్టంగా తెలియదు. ఈ టెక్నాలజీ మానవుల ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అని ఆందోళనలు ఉన్నాయి. ఇవి నియంత్రణ అధికారుల పరిశీలనకు లోబడి ఉండవచ్చు. షియోమి ఇప్పటికే వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీలో భాగంగా కొద్ది రోజుల క్రితం 67W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రెండు ఫోన్‌లలో పనిచేస్తుందని పుకార్లు వచ్చాయి. ఈ సంస్థ ఇప్పటికే 50W వైర్‌లెస్ ఛార్జింగ్ తో Mi 10 అల్ట్రా ఫోన్‌ను వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్ గా కలిగి ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Plan to Launch Wireless Charging Mi Air Charger

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X