Xiaomi యొక్క Mi టీవీ లైనప్ ధరలు పెరిగాయి!! ఎంత పెరిగాయో తెలుసా??

|

ప్రముఖ షియోమి సంస్థ స్మార్ట్ ఫోన్ రంగంలో విజయం సాధించిన తరువాత గత సంవత్సరం ఇండియాలో తన యొక్క స్మార్ట్ టీవీలను కూడా విడుదల చేసింది. షియోమి విడుదల చేసిన Mi టివి 4A ప్రో, Mi టివి 4X మరియు Mi టివి హారిజోన్ ఎడిషన్ సిరీస్ యొక్క ధరలను రూ.3,000 వరకు పెంచుతున్నట్లు సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ టీవీల కొత్త ధరలు ఇప్పుడు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్, ఇతర ఆన్‌లైన్ ఈ-కామర్స్ రిటైల్ సైట్‌లు మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇప్పటికే అమలులోకి వచ్చాయి. షియోమి సంస్థ తన టీవీల ధరలను పెంచడం ఇది రెండవసారి. మొదటిసారి ధర పెంపు సమయంలో Mi టివి 4A హారిజన్ ఎడిషన్ మరియు రెగ్యులర్ Mi టివి 4A మోడళ్ల యొక్క ధరలను పెంచింది. కొత్త ధరల పెంపు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Mi టివి 4A ప్రో మీద పెరిగిన కొత్త ధరలు

Mi టివి 4A ప్రో మీద పెరిగిన కొత్త ధరలు

Mi టివి 4A ప్రో 32 యొక్క అంగుళాల వేరియంట్‌ ధర మీద రూ.1,000 పెంచడంతో మునుపటి రూ.13,999 ధర నుంచి ఇప్పుడు రూ.14,999 కు పెరిగింది. అలాగే Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ యొక్క 32-అంగుళాల వేరియంట్ మీద రూ.1,500 పెరగడంతో రూ.14,499 పాత ధర నుండి ఇప్పుడు రూ.15,999 కు పెరిగింది.

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ కొత్త ధరలు

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ కొత్త ధరలు

Mi టివి 4A హారిజోన్ ఎడిషన్ 43-అంగుళాల మోడల్ ను ఇప్పుడు రూ.25,999 ధర వద్ద లభిస్తుంది. ఇది మునుపు రూ.23,499 ధర వద్ద లభించేది. అంటే దీని మీద రూ.2,000 వరకు పెరుగుదలను అందుకుంది. అలాగే Mi టీవీ 4A యొక్క 43-అంగుళాల వేరియంట్ ఇప్పుడు రూ.22,499 నుండి 24,999 రూపాయలకు పెరిగింది.

Mi టివి 4X కొత్త ధరల వివరాలు
 

Mi టివి 4X కొత్త ధరల వివరాలు

Mi టివి 4X యొక్క 43-ఇంచ్ వేరియంట్ గతంలో రూ.25,999 ధర వద్ద లభించగా ఇప్పుడు రూ.28,999 ధర వద్ద లభిస్తున్నది. అలాగే 50-అంగుళాల వేరియంట్ మీద గతంలోని రూ.31,999 ధర వద్ద నుంచి ప్రస్తుతం రూ.34,999 ధరకు పెరిగింది. చివరిగా 55 అంగుళాల వేరియంట్ మీద గతంలోని రూ.36,999 ధర వద్ద నుంచి రూ.3,000 పెరిగి ఇప్పుడు రూ.39,999 ధర వద్ద లభిస్తుంది.

ఇతర సంస్థల టీవీల పెరుగుదల వివరాలు

ఇతర సంస్థల టీవీల పెరుగుదల వివరాలు

ఇండియాలో షియోమి సంస్థ యొక్క టీవీల ధరల పెరుగుదలను ఇతర టీవీ తయారీదారుల కూడా ఆశించారు. కొన్ని నివేదికల ప్రకారం గత నెలలో LG, పానాసోనిక్, థామ్సన్‌ వంటి సహా పలు సంస్థలు తమ టివిల ధరలను జనవరి నుంచి 10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. సముద్రం మరియు వాయు సరుకు రవాణా ఛార్జీల పెరుగుదలతో సహా రాగి, అల్యూమినియం మరియు ఉక్కు వంటి కొన్ని కీలకమైన ముడి పదార్థాల ధరల పెరుగుదల కారణంగా టీవీల ధరలు పెరిగాయి.

2021 లో షియోమి మార్కెట్ విస్తరణ ప్లాన్

2021 లో షియోమి మార్కెట్ విస్తరణ ప్లాన్

షియోమి సంస్థ ఇటీవల తన Mi టివి యొక్క ఐదు మిలియన్ యూనిట్లను రెండు సంవత్సరాల కాలంలో తయారుచేయడానికి భారత మార్కెట్లోకి రవాణా చేసినట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పుడు అంటే 2021లో Mi క్యూఎల్‌ఇడి టివితో పాటు మరిన్ని ప్రీమియం మోడళ్లను ఇండియాలో విడుదల చేసి తన యొక్క లైనప్‌ను మరింత విస్తరించాలని యోచిస్తోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi TV Lineup Prices Increased up to Rs.3,000 in India: New Price, Specs, Sales and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X