ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

Written By:
    X

    తమ మెసెంజర్ యాప్ 80 కోట్ల మంది నెలవారి యాక్టివ్ యూజర్లతో దూసుకుపోతుందని ఫేస్‌బుక్ ఇటీవల వెల్లడించింది. మెసెంజర్ యాప్‌ను రోజురోజుకు ఆకర్షణీయంగా తీర్చిదిద్దటంలో ఫేస్‌బుక్ సఫలమవుతోంది.

    మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    పోటీ మార్కెట్ నేపథ్యంలో మెసెంజర్ యాప్ పై పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తోన్న ఫేస్‌బుక్ సరికొత్త అప్‌డేట్‌లతో యూజర్లకు స్వాగతం పలుకుతోంది. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను వినియోగిస్తున్న ప్రతిఒక్కరు తెలుసుకోవల్సిన 10 విషయాలను ఇప్పుడు చూద్దాం...

    Honor 5X రాకతో లెనోవో కే4 నోట్‌కు చుక్కలేనా..?

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    అవును మీరు వింటున్నది నిజమే.. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ పై వాడుకోవచ్చు. డెస్క్‌టాప్ పై మెసెంజర్ ఇంటర్‌ఫేస్ అచ్చం మొబైల్ యాప్ మాదిరిగానే ఉంటుంది. ఏ విధమైన న్యూస్ ఫీడ్స్ మీకు విఘాతం కలిగించవు. మిత్రులతో హ్యాపీగా చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ మెసెంజర్‌ను మీ డెస్క్‌టాప్ పై ట్రై చేసేందుకు క్లిక్ చేయండి.

     

     

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    మెసెంజర్ యాప్ వాడటానికి ఫేస్‌బుక్ అకౌంట్ అవసరం లేదు. మెసెంజర్ యాప్‌లో "Not on Facebook?" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని మొబైల్ నెంబరుతో యాప్‌‍లోకి లాగిన్ కావొచ్చు.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    మెసెంజర్ యాప్ ద్వారా Uber car సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాప్‌లోని More iconను సెలక్ట్ చేసుకుని అందులోని Transportation ఆప్షన్ పై టాప్ చేయండి. ఇక్కడ మీకు Uber సర్వీసుకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. మీ అకౌంట్ లోకి లాగిన్ అవటం ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ పంపొచ్చు.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..? అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్
    కార్నర్‌లో Pin button కనిపిస్తుంది.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    మెసెంజర్ యాప్ ద్వారా పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. అయితే, ఈ సదుపాయం భారత్‌లోకి ఇంకా అందుబాటులోకి రాలేదు.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ మిత్రులకు ఫోటోలను చాలా సులువుగా సెండ్ చేసుకోవచ్చు. యాప్‌లో పొందుపరిచిన ఫోటో మ్యాజిక్ ఫీచర్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మీకు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు, ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉచిత వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను చేసుకోవచ్చు.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

    ఫేస్‌బుక్ మెసెంజర్ గురించి తెలుసుకోవల్సిన 10 ముఖ్యమైన విషయాలు

    ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.

    గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

    English summary
    10 Hidden Tips And Tricks To Make Facebook Messenger Work Better For You. Read More in Telugu Gizbot...
    Opinion Poll

    ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more