ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

Written By:

స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతిఒక్కరిని ప్రధానంగా వేధించే సమస్య బ్యాటరీ బ్యాకప్. ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవటానికి చాలా కారణేలే ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది యాప్స్ వినియోగం. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మనం ఇన్స్‌స్టాల్ అనేకమైన యాప్స్ డివైస్ స్టోరేజ్ స్పేస్ పై ఒత్తిడి తేవటమే కాకుండా ఫోన్ పనితీరుతో పాటు బ్యాటరీ లైఫ్ పై ప్రభావం చూపుతాయి.

ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

ఫోన్‌లలో అప్లికేషన్‌ల సంఖ్య పెరిగే కొద్ది ఫోన్ పనితీరు నెమ్మదించటంతో పాటు బ్యాటరీ బ్యాకప్ త్వరగా తగ్గిపోతుంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ పనితీరుతో బ్యాటరీ లైఫ్‌ను ఇప్పటికిప్పుడు మెరుగుపరుచుకునేందుకు ఫోన్ నుంచి తొలగించాల్సిన 5 యాప్స్‌ను ఇప్పుడు చూద్దాం...

5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఆసుస్ 4జీ ఫోన్, జస్ట్ రూ.9,999కే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యాప్ 1

ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

Facebook

ఫేస్‌బుక్, ఈ యాప్ గురించి మనందరికి తెలిసిందే. మనల్ని, మన మిత్రులతో రోజంతా కనెక్ట్ చేసి ఉంచటంలో ఈ యాప్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ క్రమంలో బోలెడంత బ్యాటరీ లైఫ్‌ను ఈ యాప్ ఖర్చు చేస్తుంది. ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవాలనుకునేవారు ఫేస్‌బుక్‌ను యాప్‌లో కాకుండా బ్రౌజర్ లో ఉపయోగించుకుంటే ఎంతో కొంత మేలు ఉంటుంది.

 

యాప్ 2

ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

Weather App & Widget

వాతావరణ సమచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే క్రమంలో చాలా మంది యూజర్లు తమ ఫోన్‌లలో వెదర్ యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేస్తుంటారు. ఈ యాప్ తరచూ అప్‌డేట్ అవటానికి బోలెడంత బ్యాటరీ లైఫ్ అవసరమవుతుంది. కాబట్టి ఫోన్‌లో వాతావరణ సమాచారం తెలుసుకోవాలనుకునే వారు వెదర్ యాప్స్ కు బదులు "OK, Google" ఎంక్వైరీని ఉపయోగించుకుంటే సరిపోతుంది.

 

యాప్ 3

ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

Antivirus Apps

ఆండ్రాయడ్ స్మార్ట్‌ఫోన్‌ల పై సెక్యూరిటీ పరమైన దాడులు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో అప్రమత్తమైన గూగుల్ వాటిని ధీటుగా ఎదర్కునేందుకు ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గానే సెక్యూరిటీ ఫీచర్లను అందించే ప్రయత్నం చేస్తోంది. ఎన్‌క్రిప్షన్ వ్యవస్థతో వస్తోన్న ఈ ఫీచర్ మీ డివైస్‌ను మాల్వేర్ దాడుల నుంచి రక్షించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి ఇలాంటపుడు ఫోన్‌లో అదనంగా యాంటీ వైరస్ యాప్‌లను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ఎందుకు..?

 

యాప్ - 4

ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

Cleaning App

చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లలో క్లీనింగ్ యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకుంటున్నారు. క్లీనింగ్ యాప్స్ మీ ఫోన్‌లోని యాప్స్‌కు సంబంధించిన క్యాచీ డేటాను క్లియర్ చేయటంతో పాటు జంక్ ఫైళ్లను క్లీన్ చేస్తాయి.

మీ ఫోన్‌లోని చెత్తను క్లీన్ చేసేందుకు క్లీనింగ్ యాప్సే అవసరం లేదు. ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్‌లోని క్యాచీ డేటాను క్లియర్ చేస్తే చాలు.

యాప్ 5

ఫోన్ నెమ్మదించటానికి ఆ 5 యాప్సే కారణం

Default Browser

ఫోన్‌లో ఇన్‌బుల్ట్‌గా వచ్చే డీఫాల్ట్ బ్రౌజర్‌కు ప్రత్యామ్నాయంగా అనేక బ్రౌజర్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి, మీ ఫోన్‌లో డీఫాల్ట్‌గా వచ్చిన బ్రౌజర్‌ను డిసేబుల్ చేసి దాని స్థానంలో మీకు నచ్చిన బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Apps You Should Remove Right Now To Improve Smartphone Performance. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting