ఆండ్రాయిడ్ వైరస్‌ను తరిమికొట్టండిలా

Posted By:

యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌తో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను శాసిస్తోంది. అయితే, ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ కావటంతో రకరకాల మాల్వేర్ల బెడద ఈ ఆపరేటింగ్ సిస్టంకు పొంచి ఉంది. కాబట్టి, ఆండ్రాయిడ్ యూజర్లు వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆండ్రాయిడ్ డివైస్‌లలో తిష్ట వేసిన వైర‌స్‌ను తొలగించేందుకు 5 సింపుల్ పద్ధతులు..

Read More: ఆ కంప్యూటర్ బరువు 5000 కిలోలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ -1

ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌ను సేఫ్ మోడ్‌లోకి రీబూట్ చేయండి. సేఫ్ మోడ్‌ను ఎనేబుల్ చేసేందుకు పవర్ ఆఫ్ బటన్‌ను ప్రెస్ చేసి కొద్ది సేపు హోల్డ్ చేయండి. దీంతో మీ ఫోన్ సేఫ్ మోడ్ ఆప్షన్‌లో రిస్టార్ట్ అవుతుంది. దీంతో మీ ఫోన్ లోని థర్ట పార్టీ యాప్స్ డిసేబుల్ కాబడతాయి.

 

స్టెప్ -2

మీ ఫోన్ డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. డౌన్‌లోడ్ టాబ్ క్రింది ఉన్న యాప్స్ జాబితాను పరిశీలించండి. వాటిలో రన్ అవకుండా నక్కి ఉన్న హానికరమైన యాప్స్‌ను గుర్తించండి.

 

స్టెప్ -3

గుర్తించిన హానకరమైన అప్లికేషన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేసేయండి.

 

స్టెప్ -4

ఇప్పుడు డివైస్ ఎడ్మిన్‌స్ట్రేటర్‌లోకి వెళ్లి ఎడ్మిన్‌స్ట్రేటర్ జాబితాలోని యాప్స్ జాబితాను చూడండి . వీటిలో మీరు రిమూవ్ చేయదలచిన హానికరమైన యాప్స్‌ను ఎంపిక చేసుకుని తరువాతి స్ర్కీన్ పై కనిపించే డీయాక్టివేట్ బటన్ పై టాప్ చేయండి.

 

స్టెప్ - 5

యాప్స్ అన్‌ఇన్‌స్టాలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మీ స్మార్ట్‌ఫోన్‌ను సేఫ్‌మోడ్ నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తిరిగి రీస్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌ పూర్తిగా సేఫ్ మోడ్‌లో ఉన్నట్లే.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Simple Steps To Remove Virus And Malware From Your Android Smartphone. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot