మీ స్మార్ట్‌ఫోన్ హ్యాక్ కాకుండా ఉండాలంటే..

Written By:

మీ సెల్ ఫోన్ తో అన్ని రకాల లావాదేవీలు నిర్వహిస్తున్నారా.. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారా..అయితే ఫోన్ ను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే హ్యాకింగ్ భారీన పడే అవకాశం ఉంది. మీ ఫోన్ హ్యాకింగ్ భారీన పడకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

బెంగుళూరుకు ఐఫోన్ కంపెనీ, ధరలు భారీగా తగ్గే అవకాశం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాస్‌వర్డ్ లాక్

మీరు మీ ఫోన్ ఆన్ చేసినప్పుడల్లా పాస్‌వర్డ్ అడిగేలా లాక్ సెట్ చేసుకుంటే మంచింది. ఊరికే లాక్ తీయాలని విసుగు చెందకుండా ఉండాలి. అలా ఉంటే మీ ఫోన్ కొంచెం సేఫ్ గా ఉంటుంది.

వైఫై కనెక్షన్

కొందరు ఎక్కడబడితే అక్కడ వైఫై ఉందని మొబైల్ లో వెంటనే వైఫై ఆన్ చేస్తారు. ఇది చాలా ప్రమాదం. వీటిని అవసరం ఉన్నప్పుడే ఆణ్ చేసుకుంటే చాలామంచింది. దీని వల్ల హ్యాకింగ్ నుంచి కొంత మేర రక్షించుకోవచ్చు.

డేటా ఎన్క్రిప్షన్

స్మార్ట్ఫోన్లలో సెట్టింగ్స్, సెక్యూరిటీ అనే విభాగంలోకి వెళితే అక్కడ డేటా ఎన్క్రిప్షన్ అనే ఫీచర్ డిజేబుల్ అయి ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అయితే ఇది చాలా టైం తీసుకుంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా డివైస్లోని వివరాలన్నీ 256 బిట్ లేదా 128 బిట్ సెక్యూరిటీతో లాక్ అయి ఉంటాయి.కనుక హ్యాకర్ల నుంచి సురక్షితంగా ఉండవచ్చు.

https బ్రౌజింగ్

బ్రౌజింగ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం https తో వచ్చే వాటిని మాత్రమే ఓపెన్ చేయాలి. అలాకాని వాటిని ఓపెన్ చేయకండి.

యాప్స్

మీరు ఏవైనా యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలంటే కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుండి మాత్రమే ఇన్ స్టాల్ చేసుకోండి. యాప్ స్టోర్ నుంచి కాకుండా బయట నుంచి యాప్స్ ఇన్ స్టాల్ చేస్తేమీ సమాచారం ధర్డ్ పార్టీకి ఈజీగా చేరే అవకాశం ఉంటుంది.

పోర్న్ సైట్లు

మొబైల్స్ లో పోర్న్ కి సంబంధించిన వీడియోలను కాని అలాగే సైట్లను కాని ఓపెన్ చేయడం తగ్గిస్తే మంచింది. అవి ఓపెన్ చేయడం వల్ల హ్యాకర్లు ఈజీగా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Simple Steps To Keeping Your Smartphone Safe Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting