బెంగుళూరుకు ఐఫోన్ కంపెనీ, ధరలు భారీగా తగ్గే అవకాశం
స్థానికంగా ఐఫోన్ ఉత్పత్తి ప్రారంభమైతే వాటి ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుందని సమాచారం
ఆపిల్ ఎట్టకేలకు ఇండియాలో ఆపిల్ ఐ ఫోన్ల తయారీని ప్రారంభించబోతోంది. ఇందుకు వేదిక బెంగుళూరుకానుంది. ఆపిల్ సంస్థ అసలైన పరికరాల తయారీదారు, తైవాన్ కు చెందిన విస్ట్రాన్ బెంగళూరులోని పీన్యాలో ఐఫోన్ తయారీ ప్లాంటు స్థాపించనుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. స్థానికంగా ఐఫోన్ ఉత్పత్తి ప్రారంభమైతే వాటి ధర భారీగా తగ్గే అవకాశం ఉంటుందని సమాచారం. కాగా, ఆపిల్ డిజైన్, డెవలప్‌మెంట్ కు చెందిన విభాగాన్ని సైతం ఇక్కడే నెలకొల్పుతామని సంస్థ సీఈవో టిమ్ కుక్ గతంలో ఈ మేరకు హామీ ఇవ్వడం తెలిసిందే.
హల్‌చల్ చేస్తున్న ఐఫోన్ 8 ఫీచర్లు : వింటే షాకే !
మతిపోగోడుతున్న ఆపిల్ ఐఫోన్ 8 ఎడ్జ్ ఫీచర్స్‌పై ఓ స్మార్ట్ లుక్కేయండి

హోమ్ బటన్
రానున్న ఐఫోన్ ఎడ్జ్ లో హోమ్ బటన్ కనిపించడం లేదు. లీకయిన ఇమేజ్ లను బట్టి చూస్తే ఈఫోన్ హోమ్ బటన్ లేకుండా వస్తున్నట్లు తెలుస్తోంది. హోమ్ బటన్ ప్లేస్ లో ప్రత్యేక ప్యానల్ బటన్ ఏర్పాటు చేసినట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఎల్ జీ ఇటువంటి ప్యానల్ డిజైన్ చేసేసింది.

రిజల్యూషన్
అయితే రానున్న ఐఫోన్ 8 ఎడ్జ్ రిజల్యూషన్ లో ఇతర ఫోన్లకు సవాల్ విసరున్నట్లు తెలుస్తోంది. అత్యంత ఎక్కువ రిజల్యూషన్ తో పాటు అత్యంత పవర్ పుల్ Apple A11 processor తో ఫోన్ రానున్నట్లు సమాచారం.
ఆపిల్ అభిమానులకు ఓ కొత్త అనుభవాన్ని
అయితే ఇది నిజమా లేక జస్ట్ ఫాంటసీనా అన్నది పక్కన బెడితే రానున్న ఐఫోన్ 8 ఎడ్జ్ మాత్రం ఆపిల్ అభిమానులకు ఓ కొత్త అనుభవాన్ని అందిస్తుందని మాత్రం చెప్పవచ్చు. ఐఫోన్ 8 ఎడ్జ్ కి సంబంధించిన కాన్సప్ట్ ట్రైలర్ ఎలా ఉందో ఓ సారి మీరు కూడా లుక్కేయండి.

ఐఫోన్ 8
డిజైన్ అయితే దీని కన్నాముందే రాడికల్ డిజెన్ తో పాటు ఎడ్జ్ టూ ఎడ్జ్ డిస్ ప్లేతో ఐఫోన్ 8 రానున్నట్లు తెలుస్తోంది. డిస్ ప్లేని టచ్ చేస్తే ప్రంట్ ఫేసింగ్ కెమెరా ఓపెన్ అయ్యేలా రూపొందించనున్నారని రూమర్లు తెలియజేస్తున్నాయి

10-nanometer A11 chip
రానున్న ఈ ఫోన్ 10-nanometer A11 chipతో రానున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు లాంగ్ రేంజ్ వైర్ లెస్ ఛార్జింగ్ తో వస్తుందని సమాచారం. అలాగే ఐరిస్ ఫేసియల్ స్కానింగ్ ఉంటే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








