ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ కొనే ముందు మీరు తెలుసుకోవల్సిన 5 అంశాలు!

|

టెక్నాలజీ రోజురోజుకు విస్తరిస్తోంది. నేటి తరం మొబైల్ కమ్యూనికేషన్ ఇంకా కంప్యూటింగ్ విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీ రోజుకో కొత్త మోడల్‌లో దర్శనమిస్తోంది. పోటీ వ్యాపారం నేపధ్యంలో వివిధ మోడళ్లు మార్కెట్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసిని కొనుగోలు చేద్దామనుకునే వారి కోసం గిజ్‌బాట్ 5 అత్యుత్తమ సలహాలను అందిస్తోంది.

 

అత్యధిక జీతాలు చెల్లిస్తున్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు!!!

ఆపరేటింగ్ సిస్టం (operating system):

ఆపరేటింగ్ సిస్టం (operating system):

ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు సదరు డివైజ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి ఓ అవగాహనకు రండి. ప్రస్తుత మార్కెట్లో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్ కొత్తదిగా ఉంది. మరో వైపు యాపిల్ ఐవోఎస్, బ్లాక్‍‌బెర్రీ 10 ఇంకా విండోస్ 8 ఓఎస్ ఆధారిత డివైజ్‌లు లభ్యమవుతున్నాయి.

స్ర్కీన్ సైజ్ (screen size):

స్ర్కీన్ సైజ్ (screen size):

వివిధ స్ర్కీన్ వేరియంట్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ట్యాబ్లెట్ స్ర్కీన్ సైజు 7 అంగుళాల ఉన్నట్లయితే వినియోగానికి ఉపయుక్తంగా ఉంటుంది. అదేవిధంగా స్మార్ట్‌ఫోన్ స్ర్కీన్ పొడవు 4 అంగుళాల ఉన్నట్లయితే ఇంటర్నెట్ సర్ఫింగ్ ఇంకా స్ర్కీన్ రిసల్యూషన్ బాగుంటుంది.

 బ్రాండ్ (Brand):
 

బ్రాండ్ (Brand):

మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించి ముందుగానే ఓ నిర్థారణకు రావల్సి ఉంటుంది. కంపెనీ విలువను బట్టి డివైజ్ పనితీరు ఉంటుంది.

అప్లికేషన్స్ (Applications):

అప్లికేషన్స్ (Applications):

మీరు కొనుగోలు చేస్తున్న ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నెన్ని అప్లికేషన్‌లు ఉన్నాయో తెలుసుకోండి. మార్కెట్లో లభ్యమవుతున్న ఆధునిక వర్షన్ గాడ్జెట్‌ల‌లో సోషల్ నెట్‌వర్కింగ్ దగ్గర నుంచి హెల్త్‌కేర్ అప్లికేషన్‌ల వరకు ముందుగానే నిక్షిప్తం కాబడి ఉంటున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఆలోచనాత్మకంగా వ్యవహరించండి.

కనెక్టువిటీ (connectivity):

కనెక్టువిటీ (connectivity):

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీలో వై-ఫై, బ్లూటూత్, డాంగిల్ సపోర్ట్, సిమ్ కనెక్టువిటీ వంటి అంశాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోండి.

బ్యాటరీ బ్యాకప్ (battery backup):

బ్యాటరీ బ్యాకప్ (battery backup):

మీరు కొనుగోలు చేయబోయే స్మార్ట్‌ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించి బ్యాటరీ బ్యాకప్ విషయంలో ముందుగానే ఓ నిర్థిష్ట అవగాహనకు రండి. మీ ట్యాబ్లెట్ 4000ఎమ్ఏహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీని కలిగి ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

బరువు (weight) :

బరువు (weight) :

ఎంపిక చేసుకోబోయే స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించి బరువు విషయంలో జాగ్రత్త వహించండి.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X