Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న సమస్యలు, పరిష్కారాలు

Written By:

ఉత్తమ హార్డ్‌వేర్ స్పెక్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో అందిస్తూ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi  మార్కెట్‌ను శాసిస్తోంది. భారత్ వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో షియోమి ఫోన్‌లకు మంచి మార్కెట్ ఉందానే చెప్పాలి.

 Xiaomi ఫోన్‌లలో తలెత్తే  సమస్యలు, పరిష్కారాలు

ఈ బ్రాండ్ నుంచి ఇటీవల విడుదలైన 'Mi 4i' స్మార్ట్‌ఫోన్‌ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకోవటంతో పూర్తిస్థాయిలో సఫలీకృతమైంది. అయితే, ఈ ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలా మంది ఓవర్ హీటింగ్, యాప్ క్రాష్, నెట్‌వర్క్ ఇష్యూ వంటి సమస్యలను ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రపంచపు మొట్టమొదటి 'Soap Proof' ఫోన్

నేటి ప్రత్యేక కథనంలో భాగంగా Xiaomi Mi 4i స్మార్ట్‌ఫోన్‌లో తలెత్తుతున్న సాధారణ సమస్యలు వాటిని పరిష్కరించేందకు సింపుల్ ట్రిక్స్ ను మీకు సూచించటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సమస్య - 1

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

షియోమి ఎంఐ4ఐ : ఓవర్ హీటింగ్ సమస్య

ఈ మధ్య కాలంలో విడుదలైన దాదాపు అన్ని మధ్య తరగతి స్మార్ట్‌ఫోన్‌లలో ఓవర్ హీటింగ్ సమస్య సాధారణమైపోయింది. ఈ సమస్య షియోమి ఎంఐ4ఐకు మినహాయింపు ఏమి కాదు. ఈ ఫోన్‌ను వినియోగిస్తోన్న చాలా మంది కొద్ది నిమిషాలు గేమ్స్ ఆడినా, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినా ఓవర్ హీటింగ్ వస్తోందంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను పొందటం ద్వారా ఓవర్ హీటింగ్ సమస్యను ఫిక్స్ చేయవచ్చు. అప్‌డేట్ పొందిన తరువాత కూడా హీటింగ్ సమస్యను ఫేస్ చేస్తున్నట్లయితే ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అన్ వాంటెడ్ యాప్స్‌ను కిల్ చేయండి.

 

సమస్య - 2

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

ఫెర్మామెన్స్ ఇష్యూ

Xiaomi Mi 4i స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్ పై రన్ అవతున్నప్పటికి చాలా మంది ఫోన్ పనితీరు నెమ్మదిగా ఉందంటున్నారు. ముఖ్యంగా ఏదైనా అప్లికేషన్‌ను ఓపెన్ చేసిన సమయంలో టచ్ స్ర్కీన్ నెమ్మదిగా రెస్పాండ్ అవుతోందని చెబుతున్నారు.

Xiaomi Mi 4i స్మార్ట్‌ఫోన్‌‌లో లాగింగ్ సమస్యలను ఫేస్ చేస్తున్నవారు ఫోన్‌లోని అన్ వాంటెడ్ అప్లికేషన్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయటంతో పాటు క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేసినట్లయితే హ్యాండ్‌సెట్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. షియోమీ తన ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లో సెక్యూరిటీ పేరుతో ఓ యాప్‌ను ఇన్‌బిల్ట్‌గా ఇచ్చింది. ఈ యాప్‌‌ను వినియోగించుకోవటం ద్వారా ఫోన్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు.

 

సమస్య 3

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

బ్యాటరీ సమస్య

ఈ మధ్య కాలంలో విడుదలైన దాదాపు అన్ని మధ్య తరగతి స్మార్ట్‌ఫోన్‌లలో బ్యాటరీ డ్రెయిన్ సమస్య సాధారణమైపోయింది. ఈ సమస్య షియోమి ఎంఐ4ఐకు మినహాయింపు ఏమి కాదు. మీ ఫోన్‌లో బ్యాటరీ లైఫ్‌ను పెంచుకునేందుకు వై-ఫై, జీపీఎస్, మొబైల్ డేటా వంటి కనెక్షన్‌లను అవసరం లేని సమయంలో టర్నాఫ్ చేయండి. అదేసమయంలో ఫోన్‌లోని అన్‌వాంటెడ్ యాప్స్‌ను క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. ఇలా చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్ పెరగటంతో పాటు ర్యామ్ మెమరీ ఆదా అవుతుంది. బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా బ్యాకప్‌ను పెంచుకోవచ్చు.

 

యాప్ క్రాష్

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

యాప్ క్రాష్

తమ స్మార్ట్‌ఫోన్‌లో ఎంఐ 4ఐ యాప్స్ ఆటోమెటిక్‌గా క్రాష్ అవుతున్నాయంటూ పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. సాధారణంగా ఈ సమస్య ఫోన్‌లోని రీసెంట్ యాప్స్‌ను తరచూ క్లోజ్ చేయకపోవటం వల్ల ర్యామ్ మెమరీ పై ఒత్తిడి పెరిగిపోవటం వల్ల సంభవిస్తుంది. కాబట్టి యాజర్లు రీసెంట్ యాప్స్ ఎప్పటికప్పుడు క్లోజ్ చేసుకోవాలి.

 

కాల్ డ్రాప్ సమస్య

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

కాల్ డ్రాప్ సమస్య

ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలా మంది కాల్ డ్రాప్ సమస్యలను ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్ సమస్య కారణంగానే ఈ ఎర్రర్ వస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి, కంపెనీ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసేంత వరకు వెయిట్ చేయక తప్పదు.

 

ఇంటర్నెట్ కనెక్టువిటీ సమస్య

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

ఇంటర్నెట్ కనెక్టువిటీ సమస్య

ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న చాలా మంది ఇండియన్ యూజర్లు ఇంటర్నెట్ కనెక్టువిటీ సమస్య ఫేస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రౌజింగ్ ప్రారంభించిన కొద్ది నిమిషాల్లోనే మొబైల్ డేటా ఆగిపోవటం వంటి సమస్యలు యూజర్లు ఇబ్బందిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వారు తమ నెట్‌వర్క్ APN యాక్సెస్‌ను non-proxy APNకు మార్చుకోవటం ద్వారా సమస్య పరిష్కారమవుతుంది.

 

చార్జింగ్ సమస్య

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

చార్జింగ్ సమస్య

మీ ఎంఐ 4ఐ స్మార్ట్‌ఫోన్‌ చార్జింగ్ సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే చార్జర్ అడాప్టర్‌ను మార్చిచూడండి. అప్పటికి సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే సమీపంలోని షియోమి సర్వీస్ సెంటర్‌ను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి.

 

లాక్ స్ర్కీన్ ఎర్రర్

Xiaomi ఫోన్‌లలో తలెత్తుతున్న 8 సమస్యలు వాటి పరిష్కారాలు

లాక్ స్ర్కీన్ ఎర్రర్

ఫోన్ ను అన్ లాక్ చేస్తున్న సమయంలో "Don't Cover the orange area of the screen" అని వార్నింగ్ మెసేజ్ వస్తున్నట్లయితే అది ఖచ్చితంగా ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ సమస్యే. ఈ ఇష్యూను పరిష్కరించుకునేందుకు కంపెనీ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసేంత వరకు వెయిట్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Common Problems Of Xiaomi Mi 4i And How To Fix Them [Tutorial]
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting