బ్యాటరీ లో అని చూపిస్తుందా..పొరపాటు మీదగ్గరే ఉంది

Written By:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ వాడటం కామన్ అయిపోయింది. అయితే అదే సమయంలో ఈ ఫోన్ ను విడిచి వారు ఒక్క క్షణం కూడా ఉండలేరంటే అతిశయోక్తి కాదు. మరి ఇంతలా ఫోన్ వాడుతున్నవారికి ఎలప్పుడూ మీ బ్యాటరీ లో అంటూ ఫోన్ సినిమా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఛార్జర్ పక్కనే పెట్టుకుని వెళుతుంటారు. మరి ఈ లో బ్యాటరీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. బ్యాటరీ లైఫ్ ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో కొన్ని ట్రిక్స్ ఇస్తున్నాం ఓ సారి చూడండి.

గూగుల్ రూ.1.3 కోట్ల ఆఫర్ మీ కోసం ఎదురుచూస్తోంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండింటికీ చాలా తేడా

ఒకప్పుడు సెల్ ఫోన్స్‌లో నికెల్ బ్యాటరీస్ వాడేవారు కాని ఇప్పుడు లిధియం అయాన్ బ్యాటరీ వాడుతున్నారు అయితే ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.

40-80 రూల్

నికెల్ బ్యాటరీస్ వాడే సమయంలో అందులో ఉన్న ఛార్జింగ్ మొత్తం అయిపోయేవరకు వాడి ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టమని కంపెనీలు చెప్పేవి. కాని ఇప్పుడు వస్తున్న లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్కువ కాలం మన్నాలంటే 40-80 రూల్ పాటించాలని కంపెనీలు చెబుతున్నాయి.

0-100 శాతం వరకు

ఇప్పుడు మీ ఫోన్ ని 0-100 శాతం వరకు ఒకేసారి ఛార్జింగ్ పెట్టడం మానేయండి. ఇలా చేస్తే ప్రతీ సారి బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.

40 శాతం బ్యాటరీ మిగిలుండగానే

ఇలా చేయకుండా 40 శాతం బ్యాటరీ మిగిలుండగానే ఛార్జింగ్ పెట్టి 80 శాతం వచ్చాక ఛార్జింగ్ తీసేయండి. ఒకవేళ ఛార్జింగ్ 40 శాతం కన్నా తక్కువగా ఉంటె కనీసం 20 శాతం ఉండేటట్టు చూసుకోండి.

0-20 అలాగే 80-100 వరకు ఛార్జింగ్ పెడితే

0-20 అలాగే 80-100 వరకు ఛార్జింగ్ పెడితే లిథియం అయాన్ బ్యాటరీస్ త్వరగా దెబ్బతింటాయి. ఏళ్ల తరబడి రావాల్సిన బ్యాటరీస్ కొన్ని నెలలకే పాడయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

అయాన్ బ్యాటరీస్ ను ఓవర్ హీట్ చేస్తే

లిథియం అయాన్ బ్యాటరీస్ ను ఓవర్ హీట్ చేస్తే దాదాపు 35 శాతం వరకు శక్తిని కోల్పోతుందని బ్యాటరీ యూనివర్సిటీ వారు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

ఒక్క సారికి 40 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్

వీరి ప్రకారం లిథియం అయాన్ బ్యాటరీస్ ని ఛార్జింగ్ పెట్టినప్పుడు ఒక్క సారికి 40 శాతం కన్నా ఎక్కువ ఛార్జింగ్ పెట్టకూడదట. అలా చేస్తే మీ ఫోన్ బ్యాటరీ తొందరగా పాడవుతుందట.

ఎక్కువ శాతం ఛార్జింగ్ పెడితే

అలా కాకుండా ఎక్కువ శాతం ఛార్జింగ్ పెడితే ... 1500 సార్లు ఛార్జింగ్ పెడితే 10 శాతం శక్తిని కోల్పోయే బ్యాటరీస్ .. కేవలం 400 సార్లకే 35 శాతం శక్తిని కోల్పోతుందని వారంటున్నారు.

40-80 రూల్ పాటిస్తే

కాబట్టి మీరు ఇక నుంచి మీరు 40-80 రూల్ పాటిస్తే మీ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. ఏం చేస్తారో మీరే ఆలోచించుకోండి మరి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 tips for better battery life for Android phones read more gizbot telugu..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting