గూగుల్ రూ.1.3 కోట్ల ఆఫర్ మీ కోసం ఎదురుచూస్తోంది

Written By:

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆపిల్ తో ఎలాగైనా పోటీపడాలని ఉవ్విళ్లూరుతున్న గూగుల్ ఇప్పుడు హ్యకర్లకు బంఫరాఫర్ ప్రకటించింది. లక్షా రెండు లక్షలు కాదు ఏకంగా 1.3 కోట్ల ఆఫర్ ని ప్రకటించింది. మరి అంత ఆఫర్ మీరు చేజిక్కించుకోవాలంటే ఏం చేయాలి అనేగా మీ సందేహం. సింపుల్ మీరు గూగుల్ ఫోన్లను హ్యాక్ చేస్తే చాలు. ఆ డబ్బు మొత్తం మీ వశమవుతుంది.

కౌంటర్,రీకౌంటర్లతో జియో,ఎయిర్‌టెల్ మధ్య మళ్లీ నిప్పురాజుకుంది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ తో పోటీ పడుతున్న గూగుల్

మొబైల్ మార్కెట్ రంగంలో ఆపిల్ తో పోటీ పడుతున్న గూగుల్ మొబైల్ హ్యాకర్లకోసం ఓ పెద్ద మొత్తాన్ని షాకింగ్ ఆఫర్ గా ప్రకటించింది.

నెక్సస్ 5 ఎక్స్, నెక్సస్ 6 పి

గూగుల్ అదిరే ఫీచర్లతో ఈ మధ్య లాంచ్ చేసిన నెక్సస్ 5 ఎక్స్, నెక్సస్ 6 పి స్మార్ట్‌ఫోన్లను హ్యాక్ చేసిన వారికి భారీ బహుమతిని ప్రకటించింది.

ప్రథమ బహుమతి 200,000 డాలర్లు

ఓ ప్రత్యేకమైన హ్యాంకింగ్ ద్వారా తన స్మార్ట్‌ఫోన్లలోని లోపాన్ని గానీ, ఏదైనా బగ్ ను గానీ కనుగొన్న హ్యాకర్లు ప్రథమ బహుమతి 200,000 డాలర్లు (రూ 1.3 కోట్లు) సంపాదించే అవకాశం కల్పిస్తోంది.

ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు

గూగుల్ 'ప్రాజెక్ట్ జీరో ప్రైజ్' పథకంగా ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇవ్వనుంది. రెండవ బహుమతిగా సుమారు 67 లక్షలు (100,000 డాలర్లు) మూడవ బహుమతిగా సుమారు 38 లక్షలు (50,000 డాలర్లు) అందిస్తామని తెలిపింది.

పోటి కాలం

ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి మొదలైన ఈ పోటీ వచ్చే ఏడాది 2017 మార్చి 13 న ముగియనుందని గూగుల్ వెల్లడించింది.

టెక్నికల్ రిపోర్ట్

అలాగే మరికొంతమంది ఎంపిక చేసినవారికి టెక్నికల్ రిపోర్ట్ రాయాల్సిందిగా ఆహ్వానిస్తోంది. మీరు రాసిన దాన్ని ప్రాజెక్ట్ జీరో బ్లాగ్ లో ప్రచురిస్తుంది.

ఐదేళ్ల కిందట

కాగా మొబైల్ ఫోన్లలో నెక్సస్ సిరీస్ ను ఐదేళ్ల కిందట ప్రారంభించిన గూగు ల్ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మార్షమల్లోతో నెక్సస్ 5 ఎక్స్, 6పీలను ఇటీవల లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు

అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకు ఈ రకమైన ఎత్తుగడలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆపిల్ ఈ రకమైన ఆఫర్లను ప్రకటించిన విషయం విదితమే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google will give you Rs 1.3 crore for hacking these two smartphones –Know how Read more gizbot telugu..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot