పిక్సెల్ 3a స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై సపోర్ట్‌ను ఎలా పొందాలి?

|

గూగుల్ అధికారికంగా ఆండ్రాయిడ్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించింది. గతంలో ఆండ్రాయిడ్ క్యూ అని పిలిచే గూగుల్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు సంస్థ ఆండ్రాయిడ్ 10గా మార్పు చెందింది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లైన గూగుల్ పిక్సెల్ 3 a మరియు పిక్సెల్ 3a XL తో సహా అన్ని పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ను విడుదల చేసింది.

ఆండ్రాయిడ్ 10
 

ఆండ్రాయిడ్ 10 పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL స్మార్ట్‌ఫోన్‌లలో 1188.8 MB అప్‌డేట్‌గా లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 యొక్క అన్ని క్లాస్సి ఫీచర్లను గూగుల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు తెస్తుంది. డార్క్ థీమ్, స్మార్ట్ రిప్లై, నావిగేషన్ మరియు లైవ్ క్యాప్షన్ వంటి వాడుకలో సౌలభ్యాన్ని పెంచే లక్షణాలు మరియు ప్రైవసీ నియంత్రణలు మరియు లొకేషన్ నియంత్రణలు వంటి ప్రైవసీపై దృష్టి సారించే ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

DSDS ఫీచర్

DSDS ఫీచర్

ఈ అప్డేట్ ద్వారా పిక్సెల్ 3a స్మార్ట్‌ఫోన్‌లలో డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై సపోర్ట్‌ను తీసుకువచ్చింది. డ్యూయల్ సిమ్ డ్యూయల్ స్టాండ్‌బై లేదా DSDS ఫీచర్ వినియోగదారులు తమ పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్‌ఫోన్‌లో రెండు సిమ్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది. ఈ సిమ్‌లలో ఒకటి బయటి సిమ్ కార్డ్ అయితే మరొకటి eSIM కావచ్చు. రెండు సిమ్‌లను

ఉపయోగించడానికి వినియోగదారులను అనుమతించడమే కాకుండా మెసేజింగ్ లేదా కాలింగ్ వంటి చర్య కోసం వారు ఏ సిమ్‌ను ఉపయోగించాలి అని అనుకుంటున్నారో ఎంచుకోవడానికి DSDS ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది.

 పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL

ఒక్కమాటలో చెప్పాలంటే పిక్సల్ ఫోన్‌లను ఆండ్రాయిడ్ 10 కి అప్‌డేట్ చేసిన తర్వాత పిక్సెల్ 3a మరియు పిక్సెల్ 3a XL స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రెండు సిమ్‌లను ఉపయోగించగలరు. అయితే మీ పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్‌ఫోన్‌లో డిఎస్‌డిఎస్ ఫీచర్ మరియు ఇ-సిమ్‌కు మద్దతు ఇస్తే మీరు మీ మొబైల్ క్యారియర్‌తో తనిఖీ చేయాలి.

DSDS ఫీచర్ మరియు ఇ-సిమ్‌
 

మీ క్యారియర్ DSDS ఫీచర్ మరియు ఇ-సిమ్‌కు మద్దతు ఇస్తే మీ పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్‌ఫోన్‌లో ఇ-సిమ్‌ను ఎలా సెటప్ చేయవచ్చో తెలుసుకోవడానికి కింది పద్ధతులు పాటించండి.

1. మీ పిక్సెల్ 3a లేదా పిక్సెల్ 3a XL స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగులను ఓపెన్ చేయండి.

2. ఇప్పుడు నెట్‌వర్క్ మరియు ఇంటర్నెట్‌ను ఆన్ చేయడానికి దాని మీద నొక్కండి.

3. మొబైల్ నెట్‌వర్క్ ఎంపిక కోసం కిందకి స్క్రోల్ చేసి యాడ్ అనే ఐకాన్‌పై నొక్కండి.

4. ఇప్పుడు సిమ్ కార్డ్ ఎంపిక చేసుకున్న తరువాత నెక్స్ట్ ఆప్షన్ పై నొక్కండి.

5. నెక్స్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తరువాత స్క్రీన్ మీద 2 సంఖ్యలను ఉపయోగించాలా? నెక్స్ట్ ఆప్షన్ పై నొక్కండి అని ఉన్న డైలాగ్ బాక్స్ కనబడుతుంది. వాటిని ఎంచుకొని నెక్స్ట్ ఆప్షన్ పై

నొక్కండి.

6. ఆ తరువాత పునప్రారంభించు (రీస్టార్ట్) అనే ఎంపికపై నొక్కండి.

7. మీ ఫోన్ ను పునప్రారంభించిన తరువాత సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.

8. మొబైల్ నెట్‌వర్క్ ఎంపిక కోసం వెళ్లండి.

9. ప్రిఫరెన్స్ ను సెట్ చేయడానికి మీరు కాల్ ప్రిఫరెన్స్ మరియు SMS ప్రిఫరెన్స్ ఎంపికలలో ఉపయోగించాలనుకుంటున్న నెట్‌వర్క్ ఆపరేటర్‌పై నొక్కండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Android 10 Update: How to Get Dual SIM Dual Standby Support on Google Pixel Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X