ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ తో గూగుల్ పిక్సెల్,శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

|

గూగుల్ తన తదుపరి జెనరేషన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 10 ను ఇటీవల ప్రకటించింది. గూగుల్ ఆండ్రాయిడ్ 10 ను ప్రకటించినప్పటి నుంచి ప్రతి స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమ ఫోన్లలో ఆండ్రాయిడ్10 ఆపరేటింగ్ సిస్టమ్ ను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే నోకియా ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 అప్డేట్ ను పొందబోతున్నట్లు తెలిపారు.

 

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ తో గూగుల్ పిక్సెల్,శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇప్పుడు గూగుల్ పిక్సెల్ కూడా రాబోయే తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు గూగుల్ పిక్సెల్ 4 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేయనుంది. కానీ ఇప్పుడు ఒక కొత్త నివేదిక ప్రకారం ఆండ్రాయిడ్10ను తన పాత పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉహించిన దానికంటే త్వరగా విడుదల కావచ్చని సూచిస్తుంది.

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ తో గూగుల్ పిక్సెల్,శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సెప్టెంబర్ 3, 2019 న పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 10 ను విడుదల చేసే అవకాశం ఉంది అని కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం ఫోన్ అరేనా నివేదిక తెలిపింది. సంస్థ యొక్క ఇద్దరు సహాయక ఏజెంట్లు ఈ జ్యుసి వివరాలను వెల్లడించారు.సెప్టెంబర్ 3, 2019 నుండి ఆండ్రాయిడ్ క్యూ పరికరాలకు ఆండ్రాయిడ్10 ను విడుదల చేయబడుతుందని తెలిపారు.

పిక్సెల్ ఫోన్లు

పిక్సెల్ ఫోన్లు

నివేదిక ప్రకారం ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ వచ్చే నెలలో అంటే సెప్టెంబర్ 3, 2019 న అందుబాటులోకి రానున్నది. ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ ను పొందే పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌లు పిక్సెల్ 3a, పిక్సెల్ 3 a XL, పిక్సెల్ 3 మరియు పిక్సెల్ 3 XL స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే కాకుండా పిక్సెల్ 2 మరియు పిక్సెల్ 2 XL స్మార్ట్‌ఫోన్‌లలో కూడా లభిస్తుంది. గూగుల్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఆండ్రాయిడ్ 10 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఉపయోగించనున్నారు. కానీ గూగుల్ సంస్థ విడుదల తేదీని ఇంకా ధృవీకరించనందున ఖచ్చితమైన విడుదల కోసం సంస్థ యొక్క అధికారిక నిర్ధారణ కోసం వేచి ఉండాలి.

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

మధ్య శ్రేణి ధరల విభాగంలో చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారుల నుండి గట్టి పోటీని ఎదుర్కొన్న తరువాత శామ్‌సంగ్ తన గెలాక్సీ ఎ-సిరీస్‌ను పునరుద్ధరించింది.ప్రముఖ కొరియా కంపెని కూడా ఇటీవల విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ A10, గెలాక్సీ A30, గెలాక్సీ A50 లతో పాటు శామ్‌సంగ్ తన గెలాక్సీ A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల యొక్క మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ను అప్‌డేట్ చేయడం ప్రారంభించింది. ఏదేమైనా కొరియా కంపెనీ 2020 లో వచ్చే తదుపరి తరం గెలాక్సీ A-సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో విడుదల చేయబోతున్నారు.

శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
 

శామ్‌సంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

శామ్సంగ్ 2020 లో విడుదల చేసే ఫోనులలో ముందు వరుసలలో శామ్సంగ్ గెలాక్సీ A71 మరియు గెలాక్సీ A 91 ఉన్నాయి. గెలాక్సీ క్లబ్ ప్రకారం రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తో 2020 మొదటి త్రైమాసికంలో మార్కెట్ లోకి రానున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో గెలాక్సీ S11 సిరీస్ లాంచ్ అయిన వెంటనే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అధికారికమవుతాయని దీని అర్థం. గెలాక్సీ S ఫ్లాగ్‌షిప్ సాధారణంగా ఆండ్రాయిడ్ యొక్క కొత్త వెర్షన్‌తో తొలిసారిగా ప్రవేశిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Google Pixel,Samsung Galaxy smartphones Gets Android 10 Update On September 3

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X