Just In
- 4 hrs ago
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- 9 hrs ago
గూగుల్, వాట్సాప్ లాగా Twitter లో కూడా పేమెంట్ ఫీచర్! వివరాలు!
- 11 hrs ago
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- 1 day ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
Don't Miss
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- News
student: న్యూడ్ వీడియోతో షాక్ అయిన కాలేజ్ విద్యార్థి, బ్లాక్ మెయిల్ చేసిన శాడిస్టు లేడీ, క్లైమాక్స్ లో?
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Movies
Kranti Day 5 Collections దర్శన్ మూవీ స్ట్రాంగ్‌గా.. తొలివారంలోనే లాభాల్లోకి.. ఎంత ప్రాఫిట్ అంటే?
- Finance
fiscal deficit fy23: ఇదీ ఈ ఏడాది ఖర్చు, ఆదాయం.. మరి లోటు మాటేమిటి ?
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఒక్క మిస్డ్ కాల్‌తో ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోండి
మీరు ఉద్యోగం చేస్తున్నారా..మీకు ప్రావిడెంట్ ఫండ్ వస్తోందా..అయితే దాన్ని తెలుసుకోవడానికి మీరు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారా..అయితే మీకు ఇంకా ఆ శ్రమ అవసరం లేదు..మీ చేతిలో మొబైల్ ఉంటే చాలు..అందులో నెట్ ఉంటే చాలు మీరు ఈజీగా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.గతంలోలాగా మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) బ్యాలెన్స్‌ను తెలుసుకోవడం కోసం పనివేళలు వృథా చేసుకొని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు.చాలా సింపుల్ గా మీకు దానికి సంబంధించిన వివరాలు లభిస్తాయి..మీ చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా క్షణాల్లో ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసం మూడు రకాల ఆప్షన్స్‌ను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) అందుబాటులోకి తీసుకొచ్చింది.సో దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.
Read more: మారుమూల పల్లెల్లోకి వైఫై హాట్ స్పాట్

స్మార్ట్‌ఫోన్లో ఈపీఎఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్..
స్మార్ట్‌ఫోన్లో ఈపీఎఫ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం, లేదా మిస్‌డ్ కాల్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్ మొబైల్ యాప్ ప్రస్తుతం ఈపీఎఫ్ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ యూజర్లు ఈపీఎఫ్ యాప్‌ను..
ఆండ్రాయిడ్ యూజర్లు ఈపీఎఫ్ యాప్‌ను www.Epfindia.com వెబ్‌సైట్‌కు వెళ్లి అందులోని ‘అవర్ సర్వీసెస్' నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా గూగుల్ ప్లేస్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో లేదు. వెబ్‌సైట్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో సభ్యుడు, ఉద్యోగి, పెన్షనర్ అనే మూడు ఆప్షన్లు ఉంటాయి.

మీరు దేనికి చెందితే దాన్ని ఎంచుకోవాలి..
మీరు దేనికి చెందితే దాన్ని ఎంచుకోవాలి. యాక్టివేటెడ్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఎంటర్ చేయడం ద్వారా బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ ప్రతి ఉద్యోగికీ యూఏఎన్‌ను కేటాయిస్తోంది. ఉద్యోగులు వారి సంస్థ నుంచి ఈ నంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

మిస్‌డ్ కాల్ సర్వీస్
మీ మొబైల్‌లో ఇంటర్నెట్ సౌలభ్యం లేదనుకోండి. అప్పుడు ఏవిధంగా ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి. మీ వద్ద యూఏఎన్ ఉంటే చాలు.

మీరు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే..
మీరు 011-22901406 నంబర్‌కు మిస్‌డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. అప్పుడు ఈపీఎఫ్‌ఓ మీ మొబైల్ నంబర్‌కు పీఎఫ్ నంబర్, పేరు, పుట్టిన తే ది వంటి వివరాలను ఎస్‌ఎంఎస్ చేస్తుంది. అప్పుడు మీరు మీ యూఏఎన్ నంబర్‌ను మీ ఆధార్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్, పర్మనెంట్ అకౌంట్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది.

నుసంధాన ప్రక్రియ పూర్తైన తర్వాత..
ఈ పనిని మీ సంస్థ చేస్తుంది. ఇలా అనుసంధాన ప్రక్రియ పూర్తైన తర్వాత మీరు మిస్‌డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారీ ఈపీఎఫ్‌వో మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను తెలియజేస్తుంది.

ఎస్‌ఎంఎస్‌తో ఈపీఎఫ్ వివరాలు
మీకు ఒకవేళ యాక్టివేటేడ్ యూఏఎన్ లేకపోతే అప్పుడేం చేస్తారు. అప్పుడు ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏసీటీ అని టైప్ చేసి కామా పెట్టి తర్వాత యూఏఎన్ నంబర్‌ను,22 డిజిట్ల పీఎఫ్ నంబర్‌ను ఎంటర్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపి మీ యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత..
యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్‌ఓహెచ్‌ఓ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి యూఏఎన్ అని టైప్ చేసి మళ్లీ స్పేస్ ఇచ్చి ఈఎన్‌జీ అని ఎంటర్ చేసి పై నంబర్‌కే ఎస్‌ఎంఎస్ పంపాలి. అప్పుడు మీకు మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఎస్‌ఎంఎస్ రూపంలో వస్తాయి.

ఇక కాగితంతో అసలు పనిలేని రోజులు ..
ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఉపసంహరణలకు ఇక కాగితంతో అసలు పనిలేని రోజులు వచ్చేస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనే పీఎఫ్ విత్‌డ్రాయల్ సౌలభ్యం అందించే ప్రయత్నంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఉంది.

మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ..
మార్చి నాటికి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కేకే జలాన్ గతంలో వెల్లడించారు. ప్రావిడెంట్ ఫండ్‌సహా ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డ్‌ను స్వచ్ఛందంగా అమలుచేయడానికి గడువును సుప్రీంకోర్టు మార్చి వరకూ పొడిగించిన నేపథ్యంలో... ఈపీఎఫ్‌ఓ ఈ ప్రకటన వెలువరించిన విషయం విదితమే.

ఆధార్ అనుసంధానంగా... దరఖాస్తు అందిన మూడు గంటల్లోనే...
ఆధార్ అనుసంధానంగా... దరఖాస్తు అందిన మూడు గంటల్లోనే పీఎఫ్ క్లెయిమ్ పరిష్కారమయ్యేలా ఈ చర్య దోహదపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత పరిష్కార సమయం 20 రోజులుగా ఉంది. ఈపీఎఫ్‌ఓకు ప్రస్తుతం 5 కోట్ల మందికిపైగా చందాదారులు ఉన్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470