మారుమూల పల్లెల్లోకి వైఫై హాట్ స్పాట్

Written By:

కేంద్రం చేపట్టిన ‘డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలసి గ్రామీణ భారతంలో వంద వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.

Read more: రోజుకు 5 గంటలు స్మార్ట్‌ఫోన్‌తోనే కాలం

మారుమూల పల్లెల్లోకి వైఫై హాట్ స్పాట్

దేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లోని గ్రామాల్లో ఏర్పాటు చేసే ఒక్కో హాట్‌స్పాట్ సెంటర్‌కు రూ. 5 లక్షల చొప్పున ఏటా రూ. 5 కోట్లను ఫేస్‌బుక్ ఖర్చు చేయనుందని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, ఎండీ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.ఈ వైఫై హాట్‌స్పాట్ కేంద్రాలను క్వాడ్‌జెన్ సంస్థ ఏర్పాటు చేసి, నిర్వహిస్తుందని, ఇప్పటికే 25 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

Read more: స్మార్ట్‌ఫోన్ లైటింగ్ నుంచి మీ కంటిని కాపాడుకోండిలా

మారుమూల పల్లెల్లోకి వైఫై హాట్ స్పాట్

ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ దేశ వ్యాప్తంగా 40 వేల‌ వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయబోతోంది. 2018 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు కోసం రూ.6,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు గతంలో కేంద్ర టెలికాం శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ చెప్పారు.ఈ సంవత్సరం రూ.500 కోట్ల పెట్టుబడితో దేశంలోని 250 చోట్ల 2,500 వైఫై హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేస్తామని బిఎస్‌ఎన్‌ఎల్‌ సిఎండి అనుపమ్‌ శ్రీవాస్తవ చెప్పారు.

Read more : మార్కెట్లోకి 10 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

మారుమూల పల్లెల్లోకి వైఫై హాట్ స్పాట్

ఇందులో ఇప్పటికే 200 చోట్ల వైఫై హాట్‌స్పాట్‌ల ఏర్పాటు పూర్తయిందన్నారు.త్వరలో పూరి జగన్నాధుడి ఆలయం, ఖజురహో వంటి యాత్రా స్థలాల్లో సైతం వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.

Read more about:
English summary
Here Write Facebook to help BSNL set up 100 rural Wi-Fi hotspots
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting