Home
How to

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

By Sivanjaneyulu

మనలో చాలా మంది పబ్లిక్ వై-ఫై పట్ల ఆసక్తి చూపుతుంటారు. ఎందుకుంటే ఇక్కడ ఇంటర్నెట్ ఉచితం కాబట్టి. షాపింగ్ మాల్స్, కాఫీ షాప్స్, ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇలా అనేక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై హాట్ స్పాట్ లు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ వై-ఫై ద్వారా ఉచిత ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్స్ మాత్రం చాలానే ఉన్నాయి. పబ్లిక్ వై-ఫైను వినియోగించటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. పబ్లిక్ వై-ఫై హాట్ స్పాట్ లకు మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ కనెక్ట్ చేసినపుడు కొన్ని జాగ్రత్తలను పాటించటం ద్వారా సేఫ్ జోన్ లో ఉండొచ్చు...

గంట తొక్కితే రోజంతా కరెంటు

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..?  తస్మాత్ జాగ్రత్త..!

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

పబ్లిక్ వై-ఫైతో కనెక్ట్ అయి ఉన్నపుడు ఆన్ లైన్ బ్యాంకింగ్, షాపింగ్ వంటి లావాదేవీలను నిర్వహించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు హోమ్ లేదా వర్క్ ప్లేస్ నెట్ వర్క్ ను ఉపయోగించుకోండి. మార్గమధ్యంలో ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలను వినయోగించుకోవల్సి వస్తే పబ్లిక్ వై-ఫైకు బదులుగా మొబైల్ డేటాను ఉపయోగించుకోండి.

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..?  తస్మాత్ జాగ్రత్త..!

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

వై-ఫై కంటే మొబైల్ డేటానే ఫాస్ట్

మీ స్మార్ట్ ఫోన్ లోని 3జీ నెట్ వర్క్ కంటే వేగవంతమైన ఇంటర్నెట్ ను పబ్లిక్ వై-ఫై లు అందించగలవు. అయితే, మీ డివైస్ కు వై-ఫై రౌటర్ కు దూరం పెరిగే కొద్ది కనెక్టువిటీ వేగం మందగిస్తుంది. తాజాగా మొబైల్ ఫోన్ ల కోసం అందుబాటులోకి వచ్చిన 4జీ కనెక్టువిటీ 3జీ, వై-ఫై హాట్ స్పాట్ లతో పోలిస్తే వేగవంతమైన ఇంటర్నెట్ ను కనెక్టువిటీని ఆఫర్ చేస్తోంది.

 

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..?  తస్మాత్ జాగ్రత్త..!

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

మీ డివైస్ లో ఏ చిన్న సెక్యూరిటీ లోపమున్నా..?

మీరు వినియోగించే స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ లో ఏ చిన్న సెక్యూరిటీ లోపమున్నా మీ డివైస్ హ్యాకర్లకు అందుబాటులో ఉన్నట్లే. మీ విండోస్ పీసీలో ఫైర్ వాల్ ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ఉంచాలి. అలానే, మీ స్మార్ట్ ఫోన్ లో యాంటీ వైరస్ యాప్ ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాలి. తరచూ లేటెస్ట్ ఓఎస్ అప్ డేట్ లను పొందటం ద్వారా కూడా సెక్యూరిటీ సమస్యల నుంచి బయటపడవచ్చు

 

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..?  తస్మాత్ జాగ్రత్త..!

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

అత్యవసరమయితేనే పబ్లిక్ వై-ఫైను వాడుకోండి..?

కొన్ని పబ్లిక్ వై-ఫైల వద్ద పాస్ వర్డ్ అస్తవ్యస్తంగా ఉండటం కారణంగా మీ డేటాను హ్యాకర్లు సులువుగా దొంగిలించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి, అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే పబ్లిక్ వై-ఫైను ఎంపిక చేసుకోండి.

 

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..?  తస్మాత్ జాగ్రత్త..!

పబ్లిక్ వై-ఫై వాడుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!

బ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్ వేర్ లను ఇన్స్ స్టాల్ చేసుకోవద్దు. ఈ చర్య మీ వ్యక్తిగత డేటాకే ప్రమాదం కావొచ్చు. కొన్ని పబ్లిక్ వై-ఫై కేంద్రాల సాఫ్ట్ వేర్ అప్ డేట్ ల ముసుగులో మాల్వేర్లతో కూడిన ప్రోగ్రామ్ లను మీ డివైస్ ల్లోకి జొప్పించి మీ డేటాను దొంగిలించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్ వేర్ లను ఇన్స్ స్టాల్ చేసుకోకండి.

Best Mobiles in India

English summary
Today we came up with few security tips, do's and don'ts while using a free Wi-Fi. So read on to discover the top five mistakes to avoid when using a public Wi-Fi.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X