గంట తొక్కితే రోజంతా కరెంటు

By Sivanjaneyulu
|

ఆ సైకిల్‌ను గంట తొక్కితే చాలు రోజంతా మన ఇంటల్లిపాదికి సరిపోయే కరెంటు తయారువుతుంది. భారత సంతతికి చెందిన అమెరికన్ బిలియనీర్ మనోజ్ భార్గవ ఈ వినూత్న సైకిల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.నిత్యం విద్యుత్ సమస్యలను ఎదుర్కొనే మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఈ సైకిల్ ఎంతగానో ఉపయోగపడనుందని భార్గవ వెల్లడించారు.

Read more : వాట్సప్: ఇండియాలో వాడేది ఇవేనట

Bicycle Produces

ఈ సైకిల్ పెడల్స్ తొక్కిన సమయంలో చక్రాలు తిరిగి కరెంటు జనరేట్ అవుతుంది. జనించిన కరెంట్ సైకిల్ కు అనుసంధానించిన బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఈ సైకిల్ ను గంట సేపు తొక్కటం ద్వారా ఒకరోజుకు అవసరమైన విద్యుత్ అవసరాలను తీర్చుకోవచ్చని మనోజ్ భార్గవ అంటున్నారు. ఎలాంటి ఇంధన వ్యయం అక్కర్లేకుండా ఉత్పత్తి కాబడే ఈ కరెంటు ద్వారా లైట్లు, ఓ చిన్న ఫ్యాన్, సెల్‌ఫోన్ ఛార్జింగ్ వంటి అవసరాలను తీర్చుకోవచ్చు.

Read more: సత్య నాదెళ్ల సమక్షంలో కొత్త పాలసీలకు శ్రీకారం

వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో లభ్యం కాబోయే ఈ సైకిల్ ధర రూ.12,000 నుంచి రూ.15,000 వరకు ఉండొచ్చు. భారత్‌లో తొలత ఈ సైకిల్‌ను ఉత్తరాఖండ్‌కు పరిచయం చేస్తామని, ఆ తరువాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని భార్గవ అంటున్నారు.

Best Mobiles in India

English summary
Here write This Bicycle Produces A Day's Electricity With Just An Hour Of Pedalling

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X