మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?
అత్యధిక మంది యూజర్లను కలిగి ఉన్న యాప్స్‌లలో ఫేస్‌బుక్ మెసెంజర్ ఒకటి. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే వారి సంఖ్య 700 మిలియన్లు కంటే ఎక్కువగానే ఉంది. ఫేస్‌బుక్ అందిస్తోన్న ఈ అత్యుత్తమ మెసెంజర్ యాప్‌లో చాటింగ్ మాత్రమే కాదు బోలెడన్ని సౌకర్యాలు ఉన్నాయి.

ఫేస్‌బుక్ ఇటీవల తన మెసెంజర్ యాప్ కోసం పీటీపీ పేరుతో సరికొత్త పేమెంట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ బ్యాంక్ అకౌంట్‌ల నుంచి ఇతరుల అకౌంట్లలోకి డబ్బుఇచ్చిపుచ్చు్కోవచ్చు (ప్రస్తుతానిక ఈ ఫీచర్ భారత్‌లో అందుబాటులో లేదు). అంతేకాదండయో...ఈ మెసెంజర్ ద్వారా Uber సర్వీసులను కూడా బుక్ చేసుకోవచ్చు.

మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?
మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు, ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉచిత వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను చేసుకోవచ్చు.

మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?
ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.

మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?
మెసెంజర్ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే ఫేస్‌బుక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఏమి లేదు. జస్ట్ మీ ఫోన్ నెంబర్ ద్వారా మెసెంజర్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచు.

మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?
మీ మెసెంజర్ యాప్‌లో గ్రూప్ మెసేజ్‌లను ఓ క్రమ పద్థతిలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు.

మీరు ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా..?
ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను డెస్క్‌టాప్ మీద కడా వాడుకోవచ్చు


Click it and Unblock the Notifications








