ఆంధ్ర, తెలంగాణల్లో ఐడియా 4జీ

Written By:

భారతదేశపు మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఆపరేటర్ ఐడియా (Idea) దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో 4జీ ఎల్టీఈ సేవలను ప్రారంభించింది. ఈ హైస్పీడ్ ఫోర్త్ జనరేషన్ మొబైల్ నెట్‌వర్క్ సేవలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోని అన్ని నగరాలతో పాటు పట్టణాల్లో మార్చి 2016 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఐడియా తెలిపింది.

ఆంధ్ర, తెలంగాణల్లో ఐడియా 4జీ

మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 75 పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కడప, చెన్నై, బెంగుళూరు, ముదురై, మైసూర్ వంటి నగరాలకు ముందుగా ఐడీయా 4జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆ తరువాత గుంటూరు, కాకినాడ, కడలూర్, కాలికట్ ప్రాంతాలకు 4జీ సేవలను విస్తరించనున్నారు.

మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు, ఇంటికొచ్చి ఫోన్ రిపేర్ చేస్తారు

ఇప్పటికే ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు దేశీయంగా 4జీ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. త్వరలో రిలియన్స్ కూడా తన జియో 4జీ సేవలను త్వరలో ప్రారంభించబోతోంది. 4జీ సేవలకు రోజు రోజుకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో టెలికాం ఆపరేటర్లు 4జీ నెట్‌వర్క్ పై దృష్టిసారిస్తున్నాయి. ఐడియా సెల్యులార్‌కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 సర్కిళ్లలో 1800 మెగాహెర్ట్జ్ 4జీ స్పెక్ట్రమ్ ఉంది. తన 4జీ నెట్‌వర్క్‌ను ప్రత్యేక ఆఫర్ల పై విక్రయించేందుకు మొబైల్ తయారీ కంపెనీలతో ఐడియా ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు *121# or *212# or *130# or *123#

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

మీ ఐడియా మొబైల్ నెంబర్ ను తెలుసుకునేందుకు *789# or *100# or *1#

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా సర్వీస్ మెనూ కోసం *147#

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా అకౌంట్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు *456# or *457#

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా నుంనచి రూ.10 లోన్ తీసుకునేందుకు *150*10# 

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఎస్ఎంఎస్ బ్యాలన్స్ తెలుసుకునేందుకు *451#
బ్యాలన్స్ ట్రాన్స్‌ఫర్ చేసేందుకు *567*మొబైల్ నెంబర్*Rs.#

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా సర్వీస్ కోసం *147#
ఐడియా ప్యాక్ కోసం *369#

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా కస్టమర్ కేర్ కోసం 12345
ఐడియా మెనూ కోసం *111#

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా 3జీ సర్వీసును యాక్టివేట్ చేసుకునేందుకు ACT 3G to 12345

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా 3జీ సర్వీసులు డీయాక్టివేట్ చేసుకునేందుకు DEACT 3G to 12345

ముఖ్యమైన ఐడియా నెట్‌వర్క్ కోడ్స్

ఐడియా జీపీఆర్ఎస్ సెట్టింగ్స్ కోసం SET to 12345

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Idea launches 4G LTE services in 75 towns in South India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot