ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
డ్రైవింగ్ చేస్తున్న సమయంలో ఫోన్ టెక్స్టింగ్ చాలా ప్రమాదకరమని ట్రాఫిక్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చాలా మంది పెడచెవిన పెట్టేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్నసమయంలో స్మార్ట్‌ఫోన్‌లను వాడటం కారణంగా డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతింటుంది, ఈ కారణంగా ఎటువంటి అనర్థాలైనా జరగొచ్చు.

కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశముంది. డ్రైవింగ్ సమయంలో స్మార్ట్‌ఫోన్ టెక్స్టింగ్ కారణంగా చోటుచేసుకున్న ప్రమాదాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా వందల్లోనే ఉంది. కాబట్టి డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు సాధ్యమైనంతవరకు వరకు ఫోన్ టెక్స్టింగ్ లకు దూరంగా ఉండండి.
అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలి..?
కొన్నికొన్ని ముఖ్యమైన సందేశాలకు తక్షణమే రిప్లై ఇవ్వవల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో హ్యాండ్స్- ఫ్రీ మెసేజింగ్ ఆప్షన్‌ను మీరు ఎంపిక చేసుకున్నట్లయితే రిస్క్ కాస్త తగ్గుతుంది. ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో వాయిస్ కమాండ్స్ ఆధారంగా మెసెజ్‌లను టాకిల్ చేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం...

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం గూగుల్ ‘Google Now' పేరుతో శక్తివంతమైన టూల్‌ను లాంచ్ చేసింది. వాయిస్ కమాండ్స్ ఆధారంగా స్పందించే ఈ హ్యాండ్స్ - ఫ్రీ టూల్ మీ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది.

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
ఇంటర్నెట్ యాక్టివేట్ చేసి ఉన్న మీ ఆండ్రాయిడ్ ఫోన్ మైక్రోఫోన్‌కు వినిపించేలా "OK, Google" అని చెప్పండి. వెంటనే ‘Google Now' మీ మాటలు వినే ప్రయత్నం చేస్తుంది. తాజాగా పొందుపరిచన అప్‌డేట్‌లో భాగంగా గూగుల్ నౌ వాయిస్ కమాండ్ ఫీచర్ మెసేజ్‌లను కూడా చదువుతోంది.

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
‘Google Now' వాయిస్ టూల్‌ను ఉపయోగించుకుని మీ ఫోన్‌కు వచ్చిన చివరి సందేశాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే ఫోన్ మైక్రోఫోన్ కు వినిపించేలా "OK, Google" show my last messages on phone అని కమాండ్ ఇవ్వండి.

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
వెంటనే గూగుల్ మీ ఫోన్ చివరిగా వచ్చిన 5 మెసేజ్‌లను చూపిస్తుంది. ఆ మెసేజ్‌లను మీరు వినాలనుకుంటే ‘గూగుల్ నౌ' ఆ మెసెజ్‌లను చదివి వినిపించటంతో పాటు రిప్లై ఇవ్వమంటారా అని కూడా అడుగుతుంది.

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
గూగుల్ నౌ తరహాలోనే యాపిల్ కూడా తన ఐఫోన్‌లకు సిరి (Siri) పేరుతో పర్సనల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్‌ను అందిస్తోంది.

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
ఈ హ్యాండ్స్ ఫ్రీ టూల్ ద్వారా ఐఫోన్ యూజర్లు వాయిస్ కమాండ్స్ ఆధారంగా మెసేజ్‌లకు రిప్లై ఇవ్వొచ్చు. ఈ సౌకర్యాన్ని యూజర్లు ఉపయోగించుకోవాలంటే ముందుగా ఈ ఫీచర్‌ను తమ ఫోన్‌లలో ఎనేబుల్ చేసుకోవల్సి ఉంటుంది.

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
సిరి ఎనేబుల్ అయిన తరువాత యాక్టివేట్ చేసుకునేందుకు ఫోన్ మైక్రోఫోన్ కు వినిపించేలా "Hey, Siri" Read my text messages అని వాయిస్ కమాండ్ ఇస్తే చాలు, వెంటనే మీ ఫోన్ మెసెజ్ లను లొకేట్ చేసి Siri వాటిని చదవటం ప్రారంభిస్తుంది.

ఫోన్‌ను ముట్టుకోకుండా మెసెజ్‌కు రిప్లై ఇవొచ్చు
ముందుగా ఆమె మొదటి మెసేజ్‌ను చదివి రిప్లై ఇవ్వమంటారా అని అడుగుతుంది. మీరు సింపుల్‌గా YES లేదా NO అని చెప్పటం ద్వారా సిరి ఫీచర్ ముందుకు ప్రొసీడ్ అవుతుంది.


Click it and Unblock the Notifications








