హ్యాకర్ల ఉచ్చులో ఇంటర్నెట్

By Sivanjaneyulu
|

ఈ ఏడాది హ్యాకర్లు చెలరేగిపోయారు. సైబర్ సెక్యూరిటీ సంస్థలు పటిష్టమైన ఫైర్ వాల్ ను ఏర్పాటు చేస్తున్నప్పటికి హ్యాకర్ల దాడులు ఏ మాత్రం తగ్గలేదు. సెక్యూరిటీ లోపాలు ఆసరాగా తీసుకుని కార్ల నుంచి గ్యాస్ స్టేషన్‌ల వరకు, ఫోన్‌లు, కంప్యూటర్ల నుంచి హాస్పటల్ ఎక్విప్‌మెంట్ వరకు వేటిని విడిచిపెట్టలేదు. ఈ ఏడాది చోటు చేసుకున్న 10 భయానక హ్యాకింగ్ దాడులను ఇప్పుడు చూద్దాం..

 

రూపాయికే 4జీ స్మార్ట్‌ఫోన్, త్వరపడండి

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తూ జూలైలో పబ్లిక్‌లోకి చొరబడిన ‘స్టేజ్‌ఫ్రైట్' అనే మాల్వేర్, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను చుట్టిముట్టినట్లు సెక్యూరిటీ సంస్థ జింపీరియమ్ గుర్తించింది. ఈ మాల్వేర్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టే క్రమంలో గూగుల్ యుద్ధ ప్రాతిపదికన ప్యాచప్ చర్యలు చేపట్టింది. 

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

తాము అభివృద్థి చేసిన యు కనెక్ట్ ఫీచర్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకోవటంతో Fiat Chrysler Automobiles లక్షన్నర కార్లను రీకాల్ చేసింది. కార్లలో పొందుపరిచే ఈ యు కనెక్ట్ పీచర్ ఫోన్ కాల్స్‌ను ఎనేబుల్ చేయటంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అలానే నేవిగేషన్‌ను కంట్రోల్ చేస్తుంది. యుకనెక్ట్స్ సెల్యులార్ కనెక్షన్‌లోని సెక్యూరిటీ లొసుగులను ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు కార్లకు సంబంధించి ఐపీ అడ్రస్‌‌లను తమ ఆధీనంలోకి తీసుకుని అలజడి సృష్టించారు.

 10 భయానక హ్యాకింగ్ దాడులు
 

10 భయానక హ్యాకింగ్ దాడులు

యాష్లే మాడిసన్ డేటింగ్ వెబ్‌సైట్ హ్యాకింగ్ భాగోతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.. ఈ అక్రమ సంబంధాల వెబ్‌సైట్‌లోని సభ్యులకు సంబంధించిన చాటు మాటు వ్యవహారాలను చాకిచక్యంగా దొంగిలించిన హ్యాకర్లు దశలు వారీగా ఆ డేటాను ఇంటర్నెట్‌లో విడుదల చేసారు. మొదటి దశలో36 మిలియన్ల మంది ప్రొఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని రెండవ దశలో 20 జీబిల నిడివిగల డేటాను హ్యాకర్లు లీక్ చేసారు. వెబ్‌సైట్‌కు సీఈఓకు సంబంధించిన ఈ-మెయిల్స్‌తో పాటు మొత్తం కంపెనీకి సంబంధించిన సోర్స్ కోడ్స్ ను కూడా హ్యాకర్లు ఆన్ లైన్ లో ఉంచారు.

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

29 సంవత్సరాల యువ హ్యాకర్ సామీ కామ్కర్ తాను సొంతంగా అభివృద్థి చేసిన ఓ గాడ్జెట్ సహాయంతో జీఎమ్ సంస్థ కార్లలోని ఆన్‌స్టార్ సిస్టమ్‌ను హ్యాక్ చేయగలిగారు. OnStar రిమోట్ లింక్ యాప్‌ను అప్ డేట్ చేయటం ద్వారా జీఎమ్ సంస్థ ఈ హ్యాక్‌ను నివారించగలిగింది.

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

ఓ పరిశోధనలో భాగంగా రిసెర్చర్లు Corvette కారుకు సంబంధించిన బ్రేకులను టెక్స్ట్ మేసెజ్ ద్వారా కంట్రోల్ చేయగలిగారు.

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

సెక్యూరిటీ విషయంలో ఎంతో కట్టుదిట్టంగా వ్యవహరించే  యాపిల్ సంస్థ కూడా ఓసారి హ్యాకర్ల ఉచ్చులో పడాల్సి వచ్చింది. Mac OS X 10.10లోని సెక్యూరిటీ లోపాన్ని ఆసారా తీసుకున్న హ్యాకర్లు ఓ వ్యక్తి కంప్యూటర్‌లోకి చొరబడి మల్వేర్‌లతో కూడిన యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేసారు. సమస్యను గుర్తించిన యాపిల్ హుటాహుటిన సమస్యను పరిష్కరించింది.

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

30 డాలర్లను వెచ్చించి ఓ హ్యాకర్ అభివృద్థి చేసిన టూల్ ఎలాంటి కార్ లాక్‌నైనా ఓపెన్ చేసేస్తుంది.

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

గడిచిన నెలలో డెల్ కంప్యూటర్స్ మేజర్ సెక్యూరిటీ సమస్యను ఫేస్ చేయవల్సి వచ్చింది. 

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

మొజిల్లా తన ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌‌లో అతిపెద్ద సేక్యూరిటీ లోపాన్ని గుర్తించింది. ఈ సెక్యూరిటీ లోపం కారణంగా హ్యాకర్ల యూజర్‌కు తెలియకుండా కంప్యూటర్ నుంచి డేటాను దొంగిలించే ప్రమాదముందని హెచ్చరించింది. వెంటనే తమ సాఫ్ట్‌వేర్‌అను అప్‌డేట్ చేసుకోవాలని మొజిల్లా తెలిపింది.

 10 భయానక హ్యాకింగ్ దాడులు

10 భయానక హ్యాకింగ్ దాడులు

చైనాకు చెందిన ప్రముఖ టాయ్ మేకర్ వీటెక్ మేజర్ సెక్యూరిటీ సమస్యను ఫేస్ చేయవల్సి వచ్చింది. ఈ సంస్థ పై దాడులకు తెగబడిన హ్యాకర్లు 4.9 మిలియన్ల పేరెంట్ అకౌంట్ లతో పాటు 6.7 మిలియన్ల కిడ్స్ ప్రొఫైల్స్ ను దొంగిలించారు.

Best Mobiles in India

English summary
Biggest Hacking Attacks of 2015. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X