నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

Written By:

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలో అత్యధిక శాతం పవర్‌ను ఖర్చు చేసే విభాగం ఏదైనా ఉందంటే అది డిస్‌ప్లే విభాగమే. మీరు ఎంపిక చేసుకునే వాల్ పేపర్‌ను బట్టి కూడా బ్యాటరీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. లేత రంగులతో కూడిన వాల్ పేపర్లతో పోలిస్తే బ్లాక్ లేదా ముదురు రుంగులతో కూడిన వాల్ పేపర్లు తక్కువ బ్యాటరీ పవర్‌ను ఖర్చు చేస్తాయి.

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

2015లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ ఇవే

మనం ఉపయోగిస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లలో మెజారిటీ శాతం స్మార్ట్‌ఫోన్‌లు ఎల్‌సీడీ లేదా అమోల్డ్ టైప్‌ డిస్‌ప్లేలను కలిగి ఉంటాయి. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా మార్కెట్లో లభ్యమవుతోన్న స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే టెక్నాలజీ గురించి మీకు అవగాహన కలిగించటంతో పాటు బ్యాటరీ డ్రెయిన్ సమస్యలను నివారించేందుకు పలు ముఖ్యమైన చిట్కాలను ప్రస్తావించటం జరుగుతోంది....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

ఎల్‌సీడీ పూర్తి పేరు లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే. ఎల్‌సీడీ డిస్‌ప్లేలను మన ఇళ్లలోని టెలివిజన్ అలానే మానిటర్లలో చూడొచ్చు. నెక్సుస్ 5, ఎల్‌జీ జీ3, సోనీ

ఎక్స్‌పీరియా జెడ్3 వంటి స్మార్ట్‌ఫోన్‌లలో ఎల్‌సీడీ డిస్‌ప్లేలను పొందుపరిచారు. క్రిస్టల్స్ ఆధారంగానే లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే రూపాంతరం చెందింది కాబట్టి తనకితానుగా లైట్‌ను విడుదల చేయలేదు. ఎల్‌సీడీ డిస్‌ప్లేలు బ్యాటరీ శక్తిని కాస్త ఎక్కువగానే ఖర్చు చేస్తుంటాయి. ఇందుకు కారణం స్ర్కీన్ ఉపయోగంలో ఉన్న సమయంలో ప్రతి పిక్సల్ ప్రకాశింపజేయబడుతుంది కాబట్టి.

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

AMOLED పూర్తి పేరు యాక్టివ్ - మాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డైయోడ్. ఈ డిస్‌ప్లేలను ఎక్కువుగా స్మార్ట్‌ఫోన్‌లలోనే ఉపయోగిస్తారు. మరో రకం డిస్‌ప్లే OLED పూర్తి పేరు ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డైయోడ్ . ఈ డిస్‌ప్లే‌లో యాక్టివ్ మ్యాట్రిక్స్ ఉండదు.

అమోల్డ్ స్ర్కీన్‌లను ఎక్కువుగా సామ్‌సంగ్ డివైస్‌లలో ఉపయోగించటం జరుగుతోంది. గెలాక్సీ ఎస్5, గెలాక్సీ నోట్ 4, గెలాక్సీ ఎస్6, గెలాక్సీ నోట్ 5 వంటి హైఎండ్ ఫోన్‌లలో అమోల్డ్ డిస్‌ప్లేలను మనం చూడొచ్చు. ఎల్‌జీ కంపెనీ తన జీ ఫ్లెక్స్ 2 స్మార్ట్‌ఫోన్‌లో ప్లాస్టిక్ ఓఎల్ఈడి డిస్‌ప్లేను వినియోగించింది. అమోల్డ్ డిస్ ప్లేలు బ్యాటరీలతో మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి.

 

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

మీరు అమోల్డ్ డిస్‌ప్లేతో వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే బ్యాటరీ లైఫ్‌ను మరింతగా ఆదా చేసుకోవచ్చు. అమోల్డ్ డిస్‌ప్లే ఫోన్‌లలో బ్లాక్ లేదా ముదురు రుంగులతో కూడిన వాల్ పేపర్లను ఉపయోగించటం వల్ల బ్యాటరీ లైఫ్‌ను 6 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.

ఎల్‌సీడీ డిస్‌ప్లే స్వతహాగానే బ్యాటరీ లైఫ్‌ను ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల బ్యాటరీని ఏ మాత్రం ఆదా చేయలేదు. ఎల్‌సీడీ డిస్‌ప్లే ఫోన్‌లను వినియోగిస్తున్న యూజర్లు బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఎనేబుల్ చేసి ఉంచటం వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది.

 

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను సాధ్యమైనంత వరకు పొడగించేందుకు అనేక బ్యాటరీ ఎక్స్‌టెండర్ యాప్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ట్రై చేయటం వల్ల బ్యాటరీ లైఫ్‌ను పొడిగించుకోవచ్చు.

నల్లరంగు వాల్‌ పేపర్లు ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తాయా..?

బ్లాక్ వాల్ పేపర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటం, డార్క్ థీమ్‌లను సెట్ చేసుకోవటం, స్ర్కీన్ టైమ్ అవుట్ సెట్టింగ్‌ను మరింత తగ్గించుకోవటం, ఆటో - బ్రైట్నెస్‌ను టర్నాఫ్ చేయటం, పవర్ సేవింగ్ మోడ్‌ను ఎనేబుల్ చేసుకోవటం వంటి చిన్ని చిన్ని చిట్కాలను పాటించటం ద్వారా ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను మరింత పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How Black Wallpaper Can Save Your Android Smartphone Battery!
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot