ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్ వేగవంతంగా ఏలా..?
రైల్వే టికెట్‌లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) ఒక్కటే మార్గం. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ అంటే కుదరదు. ఏ ట్రెయిన్ చూసినా ఎసీ ఫస్ట్‌క్లాసు మొదలు సీటింగ్ వరకు అన్నీ సాధారణంగా వెయిట్ లిస్టులోనే ఉంటాయి. అటువంటి ప్రయాణికుల కోసం అంటూ తత్కాల్ విధానాన్ని రైల్వేలు ప్రారంభించాయి.
బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు... రూ.6,000 నుంచి రూ.7,000 ధరల్లో
కొంత అదనపు రుసుముతో అదే రోజు ప్రయాణానికి టిక్కెట్లను తత్కాల్ ద్వారా రిజర్వ్ చేయించుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో లేదా ఇంటర్నెట్‌లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఉదయం పది గంటలలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్ ద్వారా ఐర్‌సీటీసీ తత్కాల్ టికెట్‌లను వేగవంతంగా బుక్ చేసుకేనే మార్గాలను మీముందుంచుతున్నాం.
బెస్ట్ ఫోటోగ్రఫీ (కళ్లు చెదిరే చిత్రాలు)
1.) ముందుగా నోట్‌ప్యాడ్‌ను ఓపెన్ చేసి టికెట్ బుకింగ్ అవసరమైన వివరాలను ( పేరు, వయసు, ప్రూఫ్, డ్రైవింగె లెసెన్స్ లేదా పాన్ కార్డ్ వివరాలు) నమోదు చేసుకుని సేవ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల టికెట్ బుకింగ్ సమయంలో సమయం ఆదా అవుతుంది.
2.) 9.45 గంటలకు ఐఆర్ సీటీసీ సైట్‌లోకి లాగిన్ అవ్వండి.
3.) సైట్‌లోకి లాగిన్ అయిన వెంటనే వెబ్‌సైట్‌లోని సర్వర్ టైంను చెక్ చేసుకోండి.
4.) మీరు వెళ్లాల్సిన గమ్మస్థానానికి సంబంధించిని వివరాలను ఎంచుకోండి. ఈ సమయంలోనే ఓర్సు సహనం ఎంతో ముఖ్యం.
5.) సర్వర్ టైమ్ 10గంటలు కాగానే బుక్ బటన్ పై క్లిక్ చేయండి.
6.) ఇలాంటి సందర్భాల్లో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
7.) కాప్చా ఇష్యూ: కాప్సా (ఆంగ్ల పదాలతో తికమకగా ఉండే సెక్యూరిటీ కోడ్) ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అసహనానికి లోనుకాకుండా కొత్త కాప్చాను ఎంచుకోండి.
8.) పేమెంట్ చెల్లించే సమయంలో చాలా సార్లు ‘Service unavailable' అని చూపిస్తుంటుంది. ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు విండోను క్లోజ్ చేయటం లేదా బ్యాక్ బటన్‌ను నొక్కదు. పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
9.) బ్యాంక్ చెల్లింపు ప్రక్రియ పూర్తికాగానే విండోను క్లోజ్ చేయకండి.
10.) తత్కాల్ బుకింగ్ సమయంలోనే ఓర్సు సహనం ఎంతో ముఖ్యం.


Click it and Unblock the Notifications

