ఆన్‌లైన్ షాపింగ్‌కు అతుక్కుపోతున్నారా..?

Posted By:

చిన్న పెన్‌డ్రైవ్ దగ్గర నుంచి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ వరకు అన్ని రకాల వస్తువులు ఆన్‌లైన్‌లో దొరికేస్తున్నాయి. ఇంకేముంది ఏ వస్తువు కొనాలన్నా ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో వాలిపోయి ప్రొడక్ట్ పేరును టైప్ చేసి వాటికి సంబంధించిన వివరాలను చకచకా సేకరించేసి ఓ బెస్ట్ డీల్‌ను ఎంపిక చేసేసుకుంటున్నాం.

(ఇంకా చదవండి: యాపిల్ ఐఫోన్ ‘క్లిక్' అనిపించింది)

ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ ఎంతలా విస్తరించిందంటే, ప్రతి ఐదుగురు నెటిజనులలో ముగ్గురు నెటిజనులు ఆన్‌లైన్ షాపింగ్‌కే మెగ్గుచూపుతున్నారట. కొందరైతే ఆన్‌లైన్ షాపింగ్‌కు భానిసలుగా మారిపోయి గంటల తరబడి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలోనే గడిపేస్తున్నారట. ఆన్‌లైన్ షాపింగ్‌ను ఓ వ్యసనంగా అలవర్చుకున్న పలువురు నెటిజనులు ఒంటరిగా ఉన్నా, తమకు బోర్ కొట్టినా వెంటనే ఆన్‌లైన్ షాపింగ్ అడ్డాలోకి ప్రవేశించి అవసరంలేని వస్తువులను సైతం కొనుగోలు చేసేస్తున్నారట. ఆన్‌లైన్ షాపింగ్‌ వ్యసనాన్ని అదుపులో పెట్టుకునేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా మీరు ఆన్‌లైన్ షాపింగ్ ఎందుకు చేస్తున్నారో మీలో మీరే ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రండి. అవసరమనుకుంటేనే షాపింగ్ కు ఉపక్రమించండి లేదనుకుంటే విరమించుకోండి.

షాపింగ్ వ్యాపకాన్ని మరిచిపోయేందుకు ఎక్కువ దూరం నడవండి. వ్యాయమం చేయండి.

డిస్కౌంట్ ధరల్లో వచ్చేస్తున్నాయి కదా అని డజన్ల కొద్ది డీల్స్‌ను ఓకే చేసేయకుండా అవసరానికి అనుగుణంగా వ్యవహరించండి.

 

మీ మీ బ్యాంక్ ఖాతాలలో పరిమితి స్థాయిలో నగదును ఉంచుకోవటం ద్వారా ఆన్‌లైన్ షాపింగ్‌ వ్యసనాన్ని నియంత్రించుకోవచ్చు.

ఆన్‌లైన్ షాపింగ్ చేసే కమ్రంలో ఓ మిత్రుడిని మీ వెంట ఉంచుకోండి. ఒక వేళ మీరు పరిధి దాటితే అతడు మిమ్మల్ని హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు.

ఆన్‌లైన్ షాపింగ్‌ వ్యసనం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Control Your Online Shopping Addiction. Read More in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot