స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయటం ఏలా..?

Posted By:

మొబైల్ ఫోన్‌కు అప్ గ్రేడెడ్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన స్మార్ట్‌ఫోన్‌లు అనేక ఫీచర్లను కలిగి ఉంటున్నాయి. సాధారణ ఫోన్‌లకు భిన్నంగా జీపీఎస్ నేవిగేషన్, టచ్‌స్ర్కీన్, యాక్సిలరోమీటర్, టిల్టింగ్, షేకింగ్వంటి ప్రత్యేక ఫీచర్లను స్మార్ట్‌ఫోన్‌లు కలిగి ఉంటున్నాయి. స్మార్ట్ హ్యాండ్‌సెట్‌లలోని ఈ తరహా ఫీచర్లను ఆధారం చేసుకుని వేలాది అప్లికేషన్‌లు పుట్టుకొస్తున్నాయి. మీకు కూడా ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ తయారుచేయలనుందా..? అయితే ఈ సలహాలు మీకు తప్పనిసరి........

సెకండ్‌హ్యాండ్ కెమెరా కొందామనుకుంటున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయటం ఏలా..?

1.) ఆ అంశాల్లో అవగాహన తప్పనిసరి:

అప్లికేషన్ రూపకల్పనలో భాగంగా జనరల్ ప్రోగ్రామింగ్ ఇంకా కోడింగ్ విభాగాల్లో తరవుగా ఉంటూ కొత్త అప్‌డేట్‌లను తెలుసుకుంటూ ఉండాలి. ఇందకు.. బ్లాక్‌బెర్రీ డెవలప్‌మెంట్ ఫండమెంటల్స్, ఐఫోన్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, ప్రొఫెషనల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి పుస్తకాలను చదవండి.

 

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయటం ఏలా..?

2.) మీ అప్లికేషన్‌కు సంబంధించి పూరిపూర్ణ వర్ణనను డాక్యుమెంట్ రూపంలో పదిలపరుచుకోండి:

మీరు రూపొందించబోయే అప్లికేషన్‌కు సంబంధించి పరిపూర్ణమైన వర్ణనను డాక్యుమెంట్ రూపంలో దగ్గరుంచుకోండి. యాప్ అభివృద్ధికి సంబంధించి మీకు తట్టే కొత్త ఆలచనలను ఆ డాక్యుమెంట్‌లో జోడిస్తూ రాతపూర్వకంగా పదిలపరుచుకోండి.

 

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయటం ఏలా..?

3.) రిజిస్టర్ చేసుకోండి:

స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి కొత్త అప్లికేషన్‌లను స్వీకరించే కమ్రంలో అప్లికేషన్ డెవలపర్ల కోసం అప్లికేషన్ డెవలపర్ వెబ్‌సైట్‌లను నెలకొల్పుతాయి. ఐఫోన్ దేవ్ సెంటర్, ద బ్లాక్‌బెర్రీ డెవలపర్స్ జోన్, ఆండ్రాయిడ్ డెవలపర్స్ వెబ్‌సైట్ వంటి సైట్‌లను అప్లికేషన్ డెవలపర్ల కోసం యాపిల్, బ్లాక్‌బెర్రీ ఇంకా గూగుల్ సంస్థలు ఇప్పటికే నెలకొల్పాయి. మీరు కూడా స్మార్ట్‌ఫోన్ యాప్‌ను డిజైన్ చేసే యోచనలో ఉన్నట్లయితే సదరు ప్లాట్‌ఫామ్‌కు సంబందించిన వెబ్‌సైట్‌లోకి లాగినై రిజిస్టర్ కండి.

 

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయటం ఏలా..?

4.) మీరు ఎంచుకున్న ఫ్లాట్‌ఫామ్ డెవలపర్ సెంటర్‌కు సంబంధించి మాన్యువల్స్‌ను చదవి అందుకు అనుగణంగా వ్యవహరించండి.

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అభివృద్ధి చేయటం ఏలా..?

5.) అప్లికేషన్ రూపకల్పన ప్రక్రియ పూర్తికాగానే సదురు యాప్ పనితీరును ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని డెవలపర్ సెంటర్‌కు సమర్పించండి. మీ అప్లికేషన్ ఉపయోగకరంగా ఉన్నట్లయితే సదరు డెవలపర్ సెంటర్ నుంచి ఆమోద ముద్ర లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot