మీ మొబైల్ 4జీ సపోర్ట్ చేస్తుందా..చెక్ చేసుకోండిలా..

Written By:

మార్కెట్ రోజురోజుకు పుంజుకుంటోంది. 2జీ, 3జీ, 4జీ ఇలా వరుస జనరేషన్లతో స్మార్ట్ ఫోన్ మార్కెట్ దూసుకుపోతోంది. జియో రాకతో ఒక్కసారిగా 4జీ అనేది ఇప్పుడు విప్లవంగా మారిందనే చెప్పాలి. దాని దెబ్బకు 4జీ ఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే చాలామంది ఫోన్ 4జీ సపోర్ట్ చేస్తుందో లేదో తెలియకుండానే 4జీ నెట్ వర్క్ ని వాడేస్తుంటారు. అది సరిగా పనిచేయకపోతే నిరాశకు గురి అవుతుంటారు. ఈ నేపథ్యంలో మీ ఫోన్ 4జీ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకుంటే సరిపోతుంది. అందుకోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు

భారీగా తగ్గిన డేటా ఆఫర్ల బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రిక్ 1

మీ ఫోన్ సెట్టింగ్స్ లో కెళ్లి మొబైల్ నెట్ వర్క్ సెలక్ట్ చేసుకోండి. అక్కడ మీకు నెట్ వర్క్ మోడ్ కనిపిస్తుంది. అక్కడ మీరు lte అని సెలక్ట్ చేసుకుంటే చాలు. ఆ అప్సన్ లేకుంటే మీ ఫోన్ 4జీ సపోర్ట్ చేయనట్లుగా భావించాలి.

ట్రిక్ 2

అక్కడ మీకు అన్ని రకాల నెట్ వర్క్ లు చూపిస్తుంది. అంటే మీ ఫోన్ కు ఏ నెట్ వర్క్ సపోర్ట్ చేస్తుందో అక్కడ కనిపిస్తుంది.

ట్రిక్ 3

మీ ఫోన్ 4జీ సపోర్ట్ చేస్తే వెంటనే నెట్ వర్క్ సెర్చ్ చేయండి. మీ ప్రాంతంలో 4జీ నెట్ వర్క్ వస్తుందో లేదో ఇట్టే తెలిసిపోతుంది.

ట్రిక్ 4

ఫైనల్ గా మీ మొబైల్ స్టేటస్ బార్ పై 4జీ సిగ్నల్ చూపిస్తే మీరు 4జీలోకి అడుగుపెట్టినట్లే. అది ఓ సారి చెక్ చేసుకుంటే సరిపోతుంది.

ట్రిక్ 5

మీరు మీ నెట్ వర్క్ పరిధిలో 4జీ సిగ్నల్స్ ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటే Settings> Mobile Networks > Network Selection > Manual Search సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ ఏరియాలో ఉన్న 4జీ నెట్ వర్క్ ల వివరాలు మీకు కనిపిస్తాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How do I know whether my phone has LTE/4G support or not?
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot