భారీగా తగ్గిన డేటా ఆఫర్ల బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి

Written By:

జియో రాకతో అన్ని కంపెనీలు తమ కష్టమర్ల కోసం డేటా ఆఫర్లను భారీగా తగ్గించాయి. మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా డేటా ఆఫర్ల గురించే చర్చ జరుగుతోంది. దిగ్గజ టెల్కోలు సంవత్సరానికి సరిపడా డేటా ఆఫర్లను ఒక్కసారే ప్రకటించాయి. ఈ నేఫథ్యంలో మార్కెట్లో దొరుకుతున్న బెస్ట్ డేటా ఆఫర్స్ ఏంటో ఈకంపెనీ మంచి ఆఫర్ ఇస్తుందో అనే విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

మరో షాక్..రూపాయికే 300 నిమిషాల 4జీ డాటా కాల్స్..ఎక్కడంటే...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వొడాఫోన్

297 రూపాయలకు 1జిబి 3జి 4జి డేటాను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటితో ఈ ఆఫర్ లభిస్తోంది. దీంతో పాటు రూ. 3861లకు 13 జిబి డేటాను 13 నెలల వ్యాలిడిటితో అందిస్తోంది.

బిఎస్ఎన్ఎల్

ఈ కంపెనీ కూడా ఇతర కంపెనీలకు పోటా పోటీగా ఆపర్లను ప్రకటించింది. రూ. 198కే 1జిబి 3జి డేటాను ఇస్తోంది. ఇక రూ. 2574తో 13 జిబి డేటాను వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తోంది.

ఐడియా

ఐడియా కూడా ఇతర కంపెనీలకు ధీటుగానే ఆపర్లు ప్రకటించింది. రూ. 249 కే 1జిబి డేటాను అందిస్తోంది. 28 రోజుల వ్యాలిడిటి ఉంటుంది.రూ. 3237 తో 13 జిబిని వన్ ఇయర్ వ్యాలిడిటితో అందిస్తోంది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్

రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబాని ఢిల్లీలోని వినియోగదారుల కోసం రూపాయికే 300 నిమిషాల 4జీ డాటాను తీసుకొచ్చారు.30రోజులపాటు వర్తించేలా ఒక్కరూపాయి కే 300 నిమిషాల 4జీ డాటాకాలింగ్ సదుపాయాన్ని ప్రకటించింది. Call Drops Se Chutkaara పేరుతో ఈ ఆఫర్ ను దేశ రాజధాని ఢిల్లీలోని వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. త్వరలో దేశం మొత్తానికి విస్తరించే అవకాశం ఉంది.

ఎయిర్ టెల్

ఎయిర్ లెట్ ఈ మధ్య ప్రవేశపెట్టిన ఆఫర్ సామాన్యుల కన్నా కార్పోరేట్లకే ఎక్కువ లబ్ది కలిగిస్తోంది.కేవ‌లం రూ.51 కే జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామ‌ని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే దీనికోసం వినియోగారులు ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వ‌ర‌కు ఉచితంగా వ‌స్తుంది. ఆ త‌ర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవ‌చ్చు. ఈ ఆఫర్ 12 నెల‌ల వ‌ర‌కు వర్తించనుంది.

ఎయిర్ టెల్

ఈ కాలంలో ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెల‌ల వ‌ర‌కు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవ‌చ్చంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే.

జియో

జియో 90 రోజుల ప్రివ్యూ ఆఫర్ తో అన్ లిమిటెడ్ డేటాను అందిస్తోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Reliance Jio effect: Data charges slashed, here's a comparison for the best deal
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot