సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికి పట్టుకోవటం ఏలా?

Written By:

ఏదో పనిలో నిమగ్నమై యదాలాపంగా చేతిలోని ఫోన్‌ను ఇంట్లో ఏదో మూలన పెట్టేస్తాం. ఆ తరువాత ఫోన్‌తో అవసరమొచ్చి దాన్ని వెతికిపట్టుకునేందుకు నానా తంటాలు పడుతుంటాం. సాధారణ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికిపట్టుకోవటం పెద్ద కష్టతరం కాకపోవచ్చుగానీ సైలెంట్ మోడ్‌లో ఉన్న ఫోన్‌ను వెతికిపట్టుకోవటం చాలా క్లిష్టమైన పని. సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయి మీకు కనిపంచకుడా పోయినా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వెతికపట్టుకునేందుకు కొన్ని ట్రిక్స్...

Read More: గూగుల్ సీఈఓగా భారతీయుడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయి ఇంట్లో మీకు కనిపించకుండా పోయిన మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను సులభతరంగా వెతికిపట్టుకోవాలంటు, ఖచ్చితంగా ఆ డివైస్ డేటా కనెక్షన్ లేదా హోమ్ వై-ఫై నెట్‌వర్క్ కనెక్టెయి ఉండాలి.

 

పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెతికి పట్టివ్వటంలో గూగుల్ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇంట్లో పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను వెతికి పట్టుకునే క్రమంలో మీ కంప్యూటర్‌ను ఆన్ చేసి ఏదో ఒక వెబ్‌బ్రౌజర్‌లోకి వెళ్లండి.

బ్రౌజర్‌లోకి వెళ్లిన తరువాత ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ పేజీలోకి వెళ్లిండి.

ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ పేజీలోకి వెళ్లిన తరువాత మీ జీమెయిల్ అకౌంట్ వివరాలతో లాగిన్ అవ్వండి.

ఇప్పుడు మీ అకౌంట్‌తో కనెక్ట్ అయి ఉన్న డివైస్ లు జాబితా మీకు కనిపిస్తుంది.

వాటిలో పోగొట్టుకున్న మీ డివైస్‌ను సెలక్ట్ చేసుకోండి.

ఇప్పుడు మీకు Ring, Lock, Erase ఆప్షన్‌లు కనిపిస్తాయి

వాటిలో Ring బటన్ పై క్లిక్ చేసి confirmartion boxను కన్ఫర్మ్ చేసుకోండి.

ఇప్పుడు మీ పని పూర్తియినట్లే. కొద్ది నిమిషాలు తరువాత మీ ఫోన్ కు రింగ్ చేసినట్లయితే సైలెంట్ మోడ్ తొలగిపోయి పూర్తి వాల్యుమ్‌తో రింగ్ టోన్ మీకు వినిపిస్తుంది. తద్వారా మీ ఫోన్ ఎక్కడుందో సులువుగా తెలుసుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ యాప్‌ను గూగుల్ ఉచితంగా అందిస్తోంది. చాలా వరకు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్ ఇన్‌బుల్ట్‌గా వస్తోంది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ యాప్ లేనట్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Find a Lost Android Phone on Silent Mode in Your House. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot