లోన్ తీసుకునే మార్గాలు

Written By:

మీరు మాట్లాడుతూ ఉన్న సమయంలో ఫోన్ బ్యాలన్స్ అయిపోయింది. అయితే అత్యవసరంగా కాల్ చేయాలి. మరి మొబైల్ లో బ్యాలన్స్ లేదు. అటువంటి సమయంలో దగ్గర్లో షాపులు కూడా ఉండవు. మరి అలాంటి సమయంలో కంపెనీలు మీకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇక డేటా అయిపోయిన తరువాత కూడా మీరు లోన్ డేటా పొందవచ్చు. మరి ఆ లోన్ ఏ నెట్ వర్క్ మీద ఎలా పొందాలి అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

మొబైల్ పోతే రూ. 20 వేల వరకు ఉచిత బీమా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్ టాక్ టైం లోన్ కోడ్

ఎయిర్‌టెల్ కష్టమర్లు మీ ఫోన్ బ్యాలన్స్ 5 రూపాయల కన్నా తక్కువ ఉంటే మీరు వెంటనే లోన్ పొందవచ్చు. ఇందుకోసం మీరు మీ మొబైల్ నుంచి *141*10#కు గాని అలాగే 52141 కాల్ చేయాలి. మీరు వెంటనే రూ. 10 టాక్ టైం పొందుతారు. మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రీఛార్జ్ చేసుకుంటే కంపెనీ దాన్నుంచి ఆ లోన్ అమౌంట్ తీసుకుంటుంది.

ఎయిర్ టెల్ డేటా లోన్ కోడ్

డేటా లోన్ కావాలంటే *141*567# కు కాల్ చేసి పొందవచ్చు. ఇది మీకు రెండు రోజుల వ్యాలిడితీ 50 ఎంబీ వరకు వస్తుంది.మీతరువాత రీ ఛార్జ్ లో రూ. 15 ఎయిర్ టెల్ తీసుకుంటుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వొడాఫోన్ టాక్ టైం లోన్ కోడ్

వొడాఫోన్ కష్టమర్లు లోన్ కావాలంటే 1241కి కాల్ చేసి పొందవచ్చు. 'SMS CREDIT' to 144కి ఎసెమ్మెస్ చేయడం ద్వారా పొందవచ్చు. దీంతో పాటు *111*10# నంబర్ కి కాల్ చేసి పొందవచ్చు. 10 రూపాయలు వస్తుంది. మీ నుంచి తరువాత రూ. 13 తీసుకుంటారు.

వొడాఫోన్ డేటా లోన్ కోడ్

*111*10# నంబర్ కి కాల్ చేయడం ద్వారా 30 MB of 3G 1 రోజు వ్యాలిడితో వస్తుంది. ఆ తరువాత 10రూపాయలు మీ బ్యాలెన్స్ నుండి తీసుకుంటారు.

బిఎస్ఎన్ఎల్ టాక్ టైం లోన్ కోడ్

బిఎస్ఎన్ఎల్ కష్టమర్లు SMS CREDIT' to 53738 ద్వారా రూ. 10 టాక్ టైం పొందవచ్చు. మీరు 24 గంటల్లోగా మీ బ్యాలన్స్ వేయించుకోకపోతే ఆ తరువాత వారు మీనుంచి 11రూపాయలు కట్ చేస్తారు.

రిలయన్స్ టాక్ టైం లోన్ కోడ్

రిలయన్స్ కష్టమర్లు *141*5# డయల్ చేయడం ద్వారా 10 రూపాయలు టాక్ టైం లోన్ పొందుతారు. *141*10# ఈ నంబర్ కి కాల్ చేసినా మీకు ఆఫర్ వస్తుంది. YCR' అని టైప్ చేసి 51234 మెసేజ్ చేసినా మీరు పొందవచ్చు.

ఐడియా డేటా లోన్ కోడ్

ఐడియా కష్టమర్లు *150*06#కి డయల్ చేయడం ద్వారా 25 ఎంబీ డేటాను రెండు రోజుల పాటు పొందవచ్చు. దీనికోసం ఐడియా మీ నుంచి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తుంది. *150*333# ఈ నంబర్ కి డయల్ చేయడం ద్వారా 35 MB 3G డేటా మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. దీనికి తరువాత 11 రూపాయలు ఛార్జ్ చేస్తారు.

ఐడియా డేటా లోన్ కోడ్

ఐడియా కష్టమర్లు *150*06#కి డయల్ చేయడం ద్వారా 25 ఎంబీ డేటాను రెండు రోజుల పాటు పొందవచ్చు. దీనికోసం ఐడియా మీ నుంచి ఆరు రూపాయలు ఛార్జ్ చేస్తుంది. *150*333# ఈ నంబర్ కి డయల్ చేయడం ద్వారా 35 MB 3G డేటా మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. దీనికి తరువాత 11 రూపాయలు ఛార్జ్ చేస్తారు.

ఎయిర్‌సెల్ టాక్ టైం లోన్ కోడ్

ఎయిర్‌సెల్ కష్టమర్లు 10 రూపాయల కన్నా తక్కువ టాక్ టైం ఉంటే *414# , 12880కు కాల్ చేయడం ద్వారా గాని SMS LOAN' to 55414 ఎసెమ్మెస్ చేయడం ద్వారా కాని రూ. 10 టాక్ టైం పొందవచ్చు. ఆ తరువాత మీ నుంచి వారు 12 రూపాయలు ఛార్జ్ చేస్తారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
How to Get Talktime and Data Loans on Airtel, BSNL, Vodafone Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot