మొబైల్ పోతే రూ. 20 వేల వరకు ఉచిత బీమా

Written By:

డిజిటల్ పేమెంట్స్ రంగంలో దూసుకుపోతున్న కంపెనీ 'ఫ్రీచార్జ్' తాజాగా తన యూజర్ల కోసం కొత్త ఈ-వాలెట్ ప్రొటెక్షన్ ప్లాన్ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా కస్టమర్లు / వ్యాపారులు వారి మొబైల్ ఫోన్ను పోగొట్టుకుంటే వాలెట్ బ్యాలెన్స్పై రూ .20,000 వరకూ ఉచిత బీమాను పొందొచ్చు.

తెలంగాణాలో ఇంటెక్స్ ప్లాంటు, అనేకమందికి ఉపాధి

మొబైల్ పోతే రూ. 20 వేల వరకు ఉచిత బీమా

దీనికోసం ఫ్రీచార్జ్ రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 'ఈ-వాలెట్ల వినియోగం, భద్రతకు సంబంధించి వినియోగదారుల్లో ఉన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇది మొబైల్ ఫోన్ జారిపోయినప్పుడు కస్టమర్ల డబ్బుకు రక్షణ కల్పిస్తుంది 'అని కంపెనీ తెలిపింది.

జియో యూజర్లకు గుడ్ న్యూస్

మొబైల్ పోతే రూ. 20 వేల వరకు ఉచిత బీమా

ఫోన్ పోయినప్పుడు కన్సూమర్ 24 గంటల లోపు పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాలని ఫ్రీచార్జ్ సీఈవో గోవింద్ రాజన్ పేర్కొన్నారు. అదేవిధంగా ఫ్రీచార్జ్కు ఈ-మెయిల్ లేదా కస్టమర్ కేర్కు కాల్ చేసి తెలియజేయాలని చెప్పారు. నెలలో కనీసం ఒకసారైన లావాదేవీ నిర్వహిస్తేనే బీమా వర్తిస్తుందని తెలిపారు.

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండిEnglish summary
FreeCharge Launches E-Wallet Protection Plan read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting