విండోస్ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవటం ఏలా..?

|

కోట్లాది మంది ఎదురుచూపుల మధ్య మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేసింది. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టం ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో లభ్యమవుతోంది. విండోస్ 7, 8.1 జెన్యున్ ఓఎస్‌లను వినియోగిస్తున్న వారు విండోస్ 10ను ఉచితంగా తమ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను మీ పీసీలో ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకునేందుకు VentureBeats వివరణాత్మక టుటోరియల్‌ను విడుదల చేసింది. ఈ టుటోరియల్‌ను ఫాలో అవటం ద్వారా విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్ విండోస్ 10ను మాన్యువల్‌గా మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

Read More: దుబాయ్‌ను మించిన చైనా టవర్

విండోస్ 10ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకునేందుకు అవసరమైనవి:

విండోస్ 7, లేదా విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టం (జెన్యున్ కాపీ), మైక్రోసాఫ్ట్ విండోస్ 10 మీడియా క్రియేషన్ టూల్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్, (గమనిక: విండోస్ 10ను మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకునేందుకు డివైస్‌లోని డేటాను పూర్తిగా బ్యాకప్ చేసుకోవాలి). ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభించేముందు మీ సిస్టం సామర్థ్యాన్ని బట్టి ఈ రెండు ఫైల్స్‌లో ఒకదాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

Media Creation Tool 32-bit Windows

Media Creation Tool 64-bit Windows

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్:1

పైన ప్రొవైడ్ చేసిన లింక్స్‌లో మీ సిస్టం కాన్ఫిగరేషన్‌కు సరిపోయే మీడియా క్రియేషన్ టూల్‌ను ఎంపిక చేసుకుని మీ పీసీలో ఇన్‌స్టాల్ చేసుకోండి.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్ : 2

టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత విండోస్ 10ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు మీడియా క్రియేషన్ టూల్‌లోని Next బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు విండోస్ 10 డౌన్‌లోడ్ అవటం స్టార్ట్ అవుతుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్: 3

టూల్ మీ డౌన్‌లోడింగ్ ప్రక్రియను పరిశీలిస్తుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్: 4

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టంను మీ పీసిలో ప్రవేశపెట్టేందుకు అవసరమైన అన్ని ఫైల్స్‌ను మీడియా క్రియేషన్ టూల్ సమకూరుస్తుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్ 5:

విండోస్ 10 ఇన్‌స్టాలర్ మీ పీసీలో లోడ్ అవుతుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్ 6:

విండోస్ 10 ఇన్‌స్టాలర్ మీ పీసీని చెక్ చేసుకుంటుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్ 7:

లైసెన్స్ టర్మ్ ను Accept చేయటం ద్వారా విండోస్ 10 ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్ 8:

ఇన్‌స్టాలర్ టూల్ విండోస్ ఇన్‌స్టాలేషన్ ప్రకియను మీ పీసీలో ప్రారంభించే ముందు మీ పీసీకి ఇంకేమైనా అప్‌డేట్స్ అవసరమేమోనని మరొకసారి చెక్ చేసుకుంటుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్ 9:

Install బటన్ పై క్లిక్ చేసినట్లయితే విండోస్ 10 మీ పీసీలో మొదలవుతుంది.

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

విండోస్ 10 స్టెప్ బై స్టెప్ ఇన్‌స్టాలేషన్ గైడ్‌

స్టెప్ 10:

విండోస్ 10 సెటప్‌ను మీకు నచ్చినట్లు సెలక్ట్ చేసుకుని Next బటన్ పై క్లిక్ చేసినట్లయితే విండోస్ 10 ఇన్‌స్టాల్ కాబడుతుంది. కొత్త అనుభూతులో విండోస్ 10ను ఆస్వాదించవచ్చు.

Best Mobiles in India

English summary
How To Install Windows 10 On Your PC Now: 10 Simple Steps. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X