బేసిక్ ఫోన్‌తో బ్యాంకు సేవలు పొందడం ఎలా..?

Written By:

మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా..బేసిక్ ఫోన్ మాత్రమే ఉందా.. మీ బేసిక్ ఫోన్ తో బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవాలనుకుంటున్నారా.. ఎలా నిర్వహించుకోవాలో తెలియడం లేదా..అయితే వీటన్నింటికీ ఇప్పుడు పరిష్కారం చూపిస్తోంది ఎన్‌యూయూపీ (నేషనల్ యునిఫైడ్ యూఎస్ఎస్డీ ప్లాట్ ఫాం. దీంతో మీరు బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు ఎలాగో ఓ సారి చూద్దాం.

6జిబి ర్యామ్ ఫోన్, స్టార్టింగ్ ధర రూ. 11999 మాత్రమే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

NUUP

NUUP అనేది యూఎస్ ఎస్టీ USSD ( Unstructured Supplementary Service Data) అనే ఫ్లాట్ ఫాం మీద పనిచేస్తుంది. ఇందుకోసం మీకు ఇంటర్నెట్ గాని స్మార్ట్ ఫోన్ కాని అవసరం లేదు. కేవలం ఫీచర్ ఫోన్ తో బ్యాంకు పనులు చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బేసిక్ ఫోన్ నుండి

మీరు మీ బేసిక్ ఫోన్ నుండి * 99 # నంబర్ కు డయల్ చేయగానే వెలకమ్ టూ ఎన్‌యూయూపీ అంటూ ఓ మెసేజ్ వస్తుంది. అందులో మీకు పలు ఆప్సన్లతో కూడిన మెనూ కనిపిస్తుంది. ఇవన్నీ ఇంగ్లీష్ లోనే ఉంటాయి మరి.

ప్రాంతీయ భాషలతో ఈ సేవను వాడుకోవాలంటే

మీరు ప్రాంతీయ భాషలతో ఈ సేవను వాడుకోవాలంటే అందుకు వేరే నంబర్లను డయల్ చేయాల్సి ఉంటుంది. హిందీకైతే * 99 * 22 # తెలుగుకైతే * 99 * 24 # కోడ్‌ను డయల్ చేయాలి. అనంతరం వచ్చే ఆప్షన్స్ ఆ భాషల్లోనే కనిపిస్తాయి.

కోడ్ డయల్ చేయగానే

ఈ కోడ్ డయల్ చేయగానే వచ్చే మెనూలో బ్యాంకుకు సంబంధించిన షార్ట్ నేమ్స్ కాని లేకుంటే ఐఎఫ్‌ఎస్సీ కోడ్ లోని మొదటి నాలుగు అక్షరాలు కాని బ్రాంచ్ కోడ్ లోని మొదటి రెండు అక్షరాలు కాని ఎంటర్ చేయాలి. వీటికోసం మీరు ఇంటర్నెట్ ని కాని, బ్యాంకును కాని సంప్రదించవచ్చు.

మీ అకౌంట్ నంబర్లోని చివరి 4 అంకెలను

ఈ వివరాలను ఎంటర్ చేశాక మీ అకౌంట్ నంబర్లోని చివరి 4 అంకెలను ఎంటర్ చేయమని ఆప్షన్ వస్తుంది. అది కూడా ఎంటర్ చేసి ముందుకు వెళితే అప్పుడు అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్, ఎంఎంఐడీ, చేంజ్, పిన్ వంటి ఆప్షన్స్ దర్శనమిస్తాయి. వాటి ద్వారా యూజర్లు తమ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే

ఇందులో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఎంఎంఐడీ అనే ఆప్సన్‌ని ఉపయోగించాలి. అయితే ఇది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. అవతలి వ్యక్తులకు చెందిన బ్యాంక్ అకౌంట్ ఎంఎంఐడీ తీసుకుంటనే డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయగలుగుతారు.

మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్

అయితే ఈ ఎన్‌యూయూపీ సేవను ఉపయోగించుకోవాలనుకుంటే ఎవరికైనా మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ అయి ఉండాలి. అది లేకపోతే బ్యాంక్ అధికారులను సంప్రదించి మొబైల్ బ్యాంకింగ్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా యాక్టివేట్ అయ్యాక ఎన్యూయూపీ సేవను ఉపయోగించుకునేందుకు వీలు కలుగుతుంది.

గరిష్టంగా రూ. 5 వేల వరకు

ఈ పద్దతిలో మీరు గరిష్టంగా రూ. 5 వేల వరకు పండ్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు. అంతకు మించి మీరు లావాదేవీలు చేయాలనుకుంటే రెండో సారి చేయాల్సి ఉంటుంది. ఈ సేవలకు అయ్యే ఖర్చు కేవలం 50 పైసలు మాత్రమే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to make bank transactions with only Basic phones Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot