6జిబి ర్యామ్ ఫోన్, స్టార్టింగ్ ధర రూ. 11999 మాత్రమే
నుబియా జెడ్ 11, నుబియా ఎన్ 1 పేర్లతో విడుదలైన ఈ ఫోన్లు నేటి నుంచి వినియోగదారులకు అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి.
వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నుబియా ఫోన్లు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ జెడీటీఈ బ్రాండ్ నుబియా ఈ ఫోన్లను తీసుకువచ్చింది.
జియో ఉచితంపై ట్రాయ్ మీద ఎయిర్‌టెల్ ఫిర్యాదు

నుబియా జెడ్ 11, నుబియా ఎన్ 1 పేర్లతో విడుదలైన ఈ ఫోన్లు నేటి నుంచి వినియోగదారులకు అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. నలుపు, బంగారు రంగుల్లో లభ్యమయ్యే నుబియా జెడ్ 11 ధర రూ .29,999 కాగా, నుబియా ఎన్ 1 ధర రూ .11,999 గా ఉంది.
ట్రంప్ ఐఫోన్, ఖరీదెంతో తెలుసా..?

ఈ ఫోన్ల ప్రత్యేకతల విషయానికొస్తే..నుబియా జెడ్ 11 లో ... ఆండ్రాయిడ్ 6.0, 5.5 అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం గా ఉన్నాయి.
టెల్కోలను చావు దెబ్బ కొట్టిన జియో

కాగా, నుబియా ఎన్ 1 ఫీచర్లు .. 5.5 అంగుళాల స్క్రీన్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్, 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 13 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ను కల్గి ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








